ఆహ్లాదానికి నెలవుగా.. | Sakshi
Sakshi News home page

ఆహ్లాదానికి నెలవుగా..

Published Mon, Jan 29 2024 1:22 AM

కృష్ణా నది వద్ద రిటైనింగ్‌ వాల్‌ వెంట నిర్మిస్తున్న పార్కు నమూనా చిత్రం - Sakshi

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2024

7

నేడు స్పందన

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు ‘స్పందన’ ప్రారంభమవుతుందని కలెక్టర్‌ ఢిల్లీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు ఉదయం 9.45 గంటలకు రావాలని పేర్కొన్నారు.

కొండలమ్మ సన్నిధిలో డీఆర్వో

గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారిని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి పి.రోజా ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

నగరవాసులకు ఆహ్లాదం పంచేలా విజయవాడలో కృష్ణా నది చెంతనే రక్షణ గోడ వెంట పార్కును తీర్చిదిద్దుతున్నారు. సకల హంగులను నగరపాలక సంస్థ అధికారులు ఇక్కడ అమరుస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చకచకా చేస్తుండటంతో ఇవి తుది దశకు చేరాయి. త్వరలో పార్కును అందుబాటులోకి తెస్తామని ఆహ్లాదానికి నెలవుగా మారుస్తామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.

సాక్షి ప్రతినిఽధి, విజయవాడ: కృష్ణా నది వద్ద రక్షణ గోడ వెంట నగరపాలక సంస్థ ఉద్యానవనాన్ని తీర్చిదిద్దు తోంది. విజయవాడలో కనకదుర్గ వారధి నుంచి రామలింగేశ్వరనగర్‌ డీపీ స్టేషన్‌ వరకు 1.25 కి.మీ పొడవున పార్కును ఏర్పాటు చేస్తున్నారు. రూ.12.3 కోట్లతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రూ.7.8 కోట్లు నగరపాలక సంస్థ, రూ.4.5 కోట్లు అర్బన్‌ గ్రీనరీ నిధులను వినియోగిస్తున్నారు. రిటైనింగ్‌వాల్‌ వద్ద పార్కును ప్రజలకు త్వరలో అందుబాటులోకి తేవడానికి పనులు త్వరితగతిన సాగుతున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రీ కెనాఫీ, వాకింగ్‌ , సైక్లింగ్‌ ట్రాక్‌, రోడ్లు, బెస్మెంట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి

నగరవాసులకు అభివృద్ధితోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీఎంసీ ప్రణాళికబద్ధంగా పార్కులను అభివృద్ధి చేస్తోంది. నదీ తీరంలో సాయంత్ర వేళ కుటుంబ సభ్యులతో గడపడానికి బ్యూటిఫికేషన్‌ పార్కు నిర్మిస్తున్నారు.

వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం

వారధి నుంచి రామలింగేశ్వనగర్‌ వరకు నది వెంట రిటైనింగ్‌ వాల్‌కు ఆనుకుని నిర్మిస్తున్న ఈ పార్కులో ఒకేసారి 250–500 మంది వరకు వాకింగ్‌ చేయడానికి వీలుగా వాకింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. ఇంకా ఆహ్లాదాన్ని కలిగించడానికి వివిధ రకాల మొక్కలతో గ్రీనరీని అభివద్ధి చేస్తున్నారు. స్వాగత ద్వారం, సైకిల్‌, వాకింగ్‌ట్రాక్‌లు, వాటర్‌ ఫాల్స్‌, రక్షణగోడకు రెయిలింగ్‌, లైటింగ్‌, సిటింగ్‌ ఏరియా, ఓపెన్‌ జిమ్‌, ప్లే ఏరియాతో పాటు అధునాత సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దడానికి కార్పొరేషన్‌ రూ.7.8 కోట్లను ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రిటైనింగ్‌ వాల్‌ వెంట ఫిల్లింగ్‌ చేశారు. రక్షణ గోడ వెంట 21 మీటర్ల వెడల్పుతో, ఆ ప్రాంతంలో ఫిల్లింగ్‌ చేసి, 19 మీటర్ల మేర బండ్‌ ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. నగరవాసులకు కృష్ణమ్మ చెంత ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరే అవకాశం కలగనుంది. నది వెంట గ్రీనరితో కృష్ణమ్మ అందాలు విజయవాడ వాసులకు కనువిందు చేయనున్నాయి.

అదనపు హంగులు

నాలుగు మీటర్ల వెడల్పులో సైక్లింగ్‌ ట్రాక్‌, దానికి ఆనుకుని 10 మీటర్ల వెడల్పులో ఆహ్లాదకరంగా ఉండేలా పార్కు నిర్మిస్తున్నారు. పార్కులో ఓపెన్‌ జిమ్‌, గ్రూప్‌ సిట్టింగ్‌ ప్లేస్‌, షేడెడ్‌ సీటింగ్‌ ప్లేస్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. వాహనాల పార్కింగ్‌కు అనువుగా స్థలాన్ని కేటాయించారు. రాత్రివేళ్లలో కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఆర్చికి, వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లకు లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

u

u

కృష్ణా నది చెంతనే పార్కు

రిటైనింగ్‌ వాల్‌ వెంట 1.25 కి.మీ.

మేర ఏర్పాటు

రూ. 12.3 కోట్లతో పనులు 15 రోజుల్లో పూర్తి

1/8

2/8

పార్కులో ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ వెలుగులు
3/8

పార్కులో ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ వెలుగులు

4/8

5/8

6/8

7/8

8/8

Advertisement
Advertisement