వైభవంగా కుఠారిచండీ యాత్ర | Sakshi
Sakshi News home page

వైభవంగా కుఠారిచండీ యాత్ర

Published Fri, Mar 31 2023 2:24 AM

జాతనుక తరలివచ్చిన భక్తజనం  - Sakshi

పోటెత్తిన భక్తజనం

కవిటి: ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం, కుఠారిచండీ అమ్మవారి యాత్ర వింధ్యగిరి గ్రామంలో బుధవారం కన్నుల పండువగా జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఒడిశా చీకటి ప్రాంతానికి చెందిన రాజవంశీయులు కుఠారిచండీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా తొలిదీపం వెలగించారు. అమ్మవారి దర్శనానికి ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. లోకకల్యాణార్ధం అమ్మవారికి చండీహోమం నిర్వహించారు. 20 వేలమంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 40 మంది పోలీసులతో కవిటి ఎస్సై కె.రాము బందోబస్తు నిర్వహించగా.. రాజపురం ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు.

పూజలందుకున్న కుఠారిచండీ అమ్మవారు
1/1

పూజలందుకున్న కుఠారిచండీ అమ్మవారు

Advertisement
Advertisement