జగన్నాథుని సేవలో సీజేఐ | Sakshi
Sakshi News home page

జగన్నాథుని సేవలో సీజేఐ

Published Sat, May 6 2023 1:08 AM

జగన్నాథుని సన్నిధిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  - Sakshi

భువనేశ్వర్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పూరీ జగన్నాథుని దర్శించుకున్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన సీజేఐ.. భువనేశ్వర్‌ చేరుకుని విమానాశ్రయం నుంచి నేరుగా పూరీ వెళ్లారు. అంతరాలయంలో రత్న సింహాసనంపై ఆసీనులైన చతుర్థా మూర్తులను శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం శ్రీమందిరం ప్రాంగణంలో విమలాదేవి, శ్రీ మహాలక్ష్మి, సాక్షి గోపీనాథ్‌, కన్నొపొడా హనుమంతుడు, ఇతర పార్శ్వ దేవ దేవతలను దర్శించారు. ఆలయానికి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి జిల్లా యంత్రాంగం, ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. శ్రీమందిరం సింహద్వారం వద్ద హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ జెనా, అడ్వకేట్‌ జనరల్‌ ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికారు. రాష్ట్రంలో తన 3రోజుల బస సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి శనివారం కటక్‌ జ్యుడీషియల్‌ అకాడమీలో జరిగే పేపర్‌లెస్‌ కోర్టుల డిజిటలైజేషన్‌పై జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై 
చంద్రచూడ్‌కు స్వాగతం పలుకుతున్న సీఎస్‌
1/1

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు స్వాగతం పలుకుతున్న సీఎస్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement