కొలువుదీరిన ఘటాలు | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన ఘటాలు

Published Wed, May 31 2023 3:12 AM

అమ్మవారి ఘటాలకు పూజలు చేస్తున్న భక్తులు
 - Sakshi

రాయగడ: గ్రామదేవత బురదల పోలమ్మ ఉత్సవాల్లో భాగంగా కన్నవారి ఇంటి నుంచి సంబరాల వేదిక వద్దకు వచ్చిన అమ్మవారు తాత్కాలికంగా మెయిన్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద కొలువుదీరారు. అమ్మవారి ప్రతిరూపాలుగా కొలిచే ఘటాలకు భక్తుల దర్శనార్థం వేదిక వద్ద పసుపు కుంకుమలతో అలంకరించి పూజారులు నిలిపారు. సోమవారం రాత్రి తన కన్నవారి ఇంటి నుంచి వచ్చిన అమ్మవారు కాలినొప్పులతో మంగళవారం విశ్రాంతి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి అమ్మవారిని అమె అక్కాచెల్లెలతో కలిపి పురవీధుల్లో ఊరేగిస్తారు. దీనిని నగర పరిక్రమణగా పిలుస్తారు. ప్రతీ ఏడాది సాంప్రదాయంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈసారి బురదల పోలమ్మ, మజ్జి గౌరమ్మ, సాత పోలమ్మ ఘటాలు వెండితో రూపొందించారు. ఈసారి మిగతా ఘటాలతో వీటిని కూడా ఊరేగిస్తారు. దుష్టశక్తులు ఏవీ నగరంలోకి ప్రవేశించకుండా అమ్మవారు పురవీధుల్లో పర్యటిస్తారు. ఇదిలాఉండగా అమ్మవారి సేవకులు పూజారి, పూజారమ్మలు కన్నవారి ఇంటి నుంచి సంబరాల వేదిక వద్దకు వచ్చిన ఆనందంలో నృత్యం చేశారు. దీనిని తిలికించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే మహిళలు మెయిన్‌ రోడ్డు వద్దనున్న సంబరాల వేదిక ప్రాంగణంలో లలితా పారాయణ పఠనం చేశారు.

లలితా పారాయణం చేస్తున్న మహిళలు
1/2

లలితా పారాయణం చేస్తున్న మహిళలు

 పూజారి, పూజారమ్మల నృత్యం
2/2

పూజారి, పూజారమ్మల నృత్యం

Advertisement
Advertisement