927మందికి వైద్య పరీక్షలు | Sakshi
Sakshi News home page

927మందికి వైద్య పరీక్షలు

Published Tue, Jul 25 2023 2:30 AM

-

జయపురం: పట్టణంలోని జగధాత్రిపూర్‌ ఆస్పత్రి, జయపురం ఎల్‌ఆర్‌ ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరాల్లో 927మందికి పరీక్షలు జరిపారు. క్రిస్టియన్‌పేట క్లబ్‌ ప్రాంగణంలోని రెండో హటపొదర్‌ మిషన్‌శక్తి కేంద్రంలో సీజనల్‌గా వచ్చే వ్యాధులు, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, ఇతర సాధారణ వ్యాధులపై వివరించారు. శిబిరాల్లో డాక్టర్‌ తధాగత రథ్‌, డాక్టర్‌ సురేష్‌ పాణిగ్రహి, పీహెచ్‌ఎం సంజయకుమార్‌ స్వొయి, లింగరాజ్‌ పాఢి, సూపర్‌వైజర్‌ సత్యనారాయణ పాత్రొ, ప్రణయ సాహు తదితరులు పాల్గొన్నారు.

మణిపూర్‌పై ఆందోళనలో ఎంపీ ఉల్క

కొరాపుట్‌: మణిపూర్‌ ఘటనపై పార్లమెంట్‌లో సోమవారం జరిగిన ఆందోళనలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొరాపుట్‌ పార్లమెంట్‌ సభ్యుడు సప్తగిరి ఉల్క పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఉల్క ఒక్కరే హస్తం పార్టీ తరఫున లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన ఆందోళనలో భాగంగా సహచర మిత్రుడు సమీప ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ ఎంపీ దీపక్‌ బైజ్‌తో కలిసి పాల్గోన్నారు. దీపక్‌ ప్రస్తుతం ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

మాజీ స్పీకర్‌కు పరామర్శ

పర్లాకిమిడి: ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్‌ చింతామణి జ్ఞాన్‌ సామంతరే సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ నేపథ్యంలో గంజాం జిల్లా పాత్రపురం బ్లాక్‌ బొమ్మిక గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకున్న పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు పరామర్శిచారు. పరామర్శలో బీజేపీ నాయకులు జగన్నాథ పరిడా, జి.శ్రీధరనాయుడు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement