కూలిన విమానాశ్రయ ప్రహరీ | Sakshi
Sakshi News home page

కూలిన విమానాశ్రయ ప్రహరీ

Published Sun, Aug 13 2023 12:30 AM

-

భువనేశ్వర్‌: కలహండి జిల్లా భవానీపట్న ఉత్కెళ ఎయిర్‌స్ట్రిప్‌ ప్రాంతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందింది. త్వరలో ఇక్కడి నుంచి భువనేశ్వర్‌కు విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానుందని ఇటీవల ప్రకటించారు. ఇంతలో విమానాశ్రయం ప్రహరీ కుప్పకూలింది. ఈ నెల 15న విమానాశ్రయం ప్రారంభించేందుకు యోచిస్తున్న తరుణంలో ఇలా జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌, చీఫ్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఏఎస్‌ఓ), ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), సీఐఎస్‌ఎఫ్‌ నోడల్‌ అధికారుల నేతృత్వంలోని ప్రత్యేక బృందం గత నెల ఎయిర్‌స్ట్రిప్‌ను సందర్శించి సౌకర్యాలు, ఇతర భద్రతా ప్రామాణికల్ని అధికారుల సమక్షంలో సమీక్షించింది. దీని ఆధారంగా ఉత్కెళ ఎయిర్‌స్ట్రిప్‌కు 2బి లైసెన్స్‌ మంజూరు చేసే సౌకర్యాలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement