12న అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ జిల్లా జట్ల ఎంపిక | Sakshi
Sakshi News home page

12న అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ జిల్లా జట్ల ఎంపిక

Published Wed, Oct 11 2023 7:36 AM

చోరీకి గురైన ఇంటిని పరిశీలిస్తున్న 
క్లూస్‌ టీమ్‌ ఎస్సై  స్వరూప్‌ - Sakshi

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈనెల 12న నిర్వహించనున్నట్లు అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పీవీఎల్‌ఎన్‌ కృష్ణ మంగళవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి నగరంలోని రాజీవ్‌ క్రీడామైదానం ప్రాంగణంలో చెస్‌, ఫెన్సింగ్‌, కరాటే, బాల్‌బ్యాడ్మింటన్‌, బేస్‌బాల్‌, యోగా క్రీడాంశాల్లో బాల, బాలికలకు ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో 8,9,10 తరగతులు చదువుతున్న వారితో పాటు 19 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండి ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసిస్తున్న క్రీడాకారులు పాల్గొనేందుకు అర్హులుగా తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ రోజు జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.

13న జాబ్‌ మేళా

శృంగవరపుకోట: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ), జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ (జేకేసీ)ల ఆధ్వర్యంలో ఎస్‌.కోట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సీహెచ్‌.కేశవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాకు హాజరయ్యేందుకు పదవ తరగతి నుంచి పోసు్ట్ర గాడ్యుయేషన్‌ పూర్తి చేసిన 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులందరూ అర్హులేనని పేర్కొన్నారు. విద్యార్థులు వారి విద్యార్హత, కులం, ఆధార్‌, నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకుని సెమినార్‌ హాల్‌కు హాజరుకావాలని స్పష్టం చేశారు. జాబ్‌మేళాలో ఏటీసీ టైర్స్‌, అరబిందో ఫార్మా, సెనప్టిక్స్‌ ల్యాబ్స్‌, డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌, జయభేరి ఆటోమోటివ్స్‌, రాండ్‌స్టాండ్‌, నవత ట్రాన్స్‌పోర్ట్‌, అపోలో ఫార్మసీ, ముత్తూట్‌ ఫైనాన్స్‌, స్మార్ట్‌ సర్వీసెస్‌ కంపెనీలు హాజరుకానున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 7995691295 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లల మృతి

రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి బుచ్చెంపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన బూర సోములు ఇటీవల వారపు సంతలో 20 గొర్రె పిల్లలను జీవనోపాధికోసం కొనుగోలు చేశాడు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కుక్కల గుంపు గొర్రె పిల్లలపై దాడిచేయగా 15 గొర్రె పిల్లలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరో నాలుగు పిల్లలు గాయాల పాలయ్యాయని గ్రామస్తులు తెలిపారు. సుమారు రూ.లక్ష విలువైన గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృతిచెందడంతో బాధితుడు లబోదిబో మంటూ రోదిస్తున్నాడు. ఇప్పటికై నా కుక్కల నిర్మూలనకు అధికారులు చర్యలు తీసుకోవాలని, బాధితుడిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

8 తులాల బంగారం చోరీ

సీతానగరం: మండలకేంద్రంలోని ఒక ఇంటిలో 8 తులాల బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మంగళవారం బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం గ్రామానికి చెందిన యల్లామంతి వెంకటరమణ(రిటైర్డ్‌ ఆర్‌ఎస్సై) జూన్‌నెలలో హైదరాబాద్‌లో ఉన్న కుటుంబసభ్యుల దగ్గరికి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళాలు విరగ్గొట్టి బయట పడవేసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లగా బీరువా, సెల్ఫ్‌లలో పెట్టెలు వంటింట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న సుమారు 8తులాల బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె.నీలకంఠం తెలియజేశారు.

ఏడుగురు పేకాట రాయళ్ల అరెస్టు

గంట్యాడ: మండలంలోని రామవరం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం దాడి చేసి ఏడుగురు జూదరులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.8,950 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ నాయుడు తెలిపారు.

కుక్కల దాడిలో మృతిచెందిన గొర్రె పిల్లలు
1/1

కుక్కల దాడిలో మృతిచెందిన గొర్రె పిల్లలు

Advertisement
Advertisement