99 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ | Sakshi
Sakshi News home page

99 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌

Published Wed, Oct 18 2023 1:44 AM

కార్యకర్తల సమీక్ష సమావేశంలో 
మాట్లాడుతున్న పీడీ శాంతిశ్రీ  - Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 99 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్‌ సీహెచ్‌ఏ ఎ.రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. వర్సిటీ పరిపాలన కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు పాలక మండలి, అకడమిక్‌ సెనేట్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ల్లో చర్చించి అనంతరం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు చెప్పారు. నియామక ప్రక్రియలో రిజర్వేషన్‌ రోస్టర్‌ పక్కాగా అమలు ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్‌ విడుదలకు సంబంధించి కసరత్తు చివరి దశకు చేరిందని వివరించారు.

‘కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకువస్తాం’

శ్రీకాకుళం అర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞానభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, జిల్లాలో పార్టీ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల్లో ఉన్న కాంగ్రెస్‌ నేతలను ‘మన ఇంటికి రండి’ అనే నినాదంతో తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామ ని తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

బైక్‌ ఢీకొని ఇద్దరికి గాయాలు

శ్రీకాకుళం క్రైమ్‌ : నగరంలోని భాష్యం స్కూలు సమీపంలో బైక్‌ ఢీకొని ఇద్దరు గాయపడినట్లు ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకరమణ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ జామ్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న రాజేష్‌ ప్రసాద్‌ సాహు మండల వీధిలో నివాసముంటున్నాడు. ఈయన స్వస్థ లం పశ్చిమబెంగాల్‌. సోమవారం రాత్రి భోజనం కోసం మండల వీధి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అతనికి గాయాలయ్యా యి. ద్విచక్ర వాహనదారుడు కూడా కింద పడడంతో అతనికీ దెబ్బలు తగిలాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.

‘కిట్లు వినియోగించుకోవాలి’

సారవకోట: అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చిన పూర్వ ప్రాథమిక విద్యా కిట్లను కార్యకర్తలు వినియోగించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ శాంతి శ్రీ సూచించారు. ఆమె స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం సారవకోట, జలుమూరు మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను అభివృద్ధి చేసేందుకు పీపీ–1, పీపీ–2 కిట్లు అందించామని, వాటిని కట్టలు కట్టి పడేయకుండా కేంద్రాలకు హాజరయ్యే పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను బోధించాలన్నారు. టీహెచ్‌ఆర్‌ పిల్లలకు బాలామృతం వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు గత కొన్ని నెలల నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం ద్వారా టీహెచ్‌ఆర్‌ కిట్లు అందిస్తున్నామని ప్రతి ఒక్క కార్యకర్త వంద శాతం ఎఫ్‌ఆర్‌ఎస్‌ జరిగేటట్లు చూడాలన్నారు. ఆమెతో పాటు నోడల్‌ ఆఫీసర్‌ మణి, సీడీపీఓ హెచ్‌కే కామాక్షి, పలువురు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు సమస్యల విన్నపం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రెవెన్యూ సర్వీసుల సంఘం ప్రతినిధులు మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా భూ సేకరణ యూనిట్‌లు ఎత్తివేయడం సరికాదని, వాటిని పునరుద్ధరించాలని కోరారు. ఇంకా జిల్లాలో భూ సేకరణ చేయాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో ఆ యూనిట్ల అవసరం ఎంతైనా ఉందని వారు కలెక్టర్‌కు తెలిపారు. రెవెన్యూ శాఖలో వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాలని తెలిపారు. గత ఎన్నికల్లో కొన్ని మండలాల్లో ఉన్న పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. క్రమశిక్షణ సర్వీసుల కేసులు ఉన్నాయని, వాటిని దర్యాప్తు చేసి, పరిష్కరించాలని కోరారు. స్టేషనరీకి నిధులు విడుదల చేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రెవెన్యూ సర్వీసుల సంఘం జి ల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షు డు పప్పల వేణుగోపాలరావు, కార్యదర్శి బీవీవీఎన్‌ రాజు, కోశాధికారి జీఎల్‌ శ్రీనివాసరావు, యూనియన్‌ ప్రతినిధులు కె.శ్రీనివాసరావు, డి.సోనీకిరణ్‌, కె.ప్రవల్లికా ప్రియ, డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు సంతోష్‌ ఉన్నారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

ఇచ్ఛాపురం: మున్సిపాలిటీ పరిధి లాలాపేట మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న వల్లిశెట్టి రాజేష్‌ని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసినట్లు ఎంఈఓ కె.అప్పారావు తెలిపారు. పెళ్లి పేరుతో సహ ఉపాధ్యాయురాలిని మోసగించినట్లు గత నెల 20న వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో బా ధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసులో విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలియజేశారు.

Advertisement
Advertisement