కమ్యూనిటీ పారా మెడికల్‌ సిబ్బంది నూతన కార్యవర్గం | Sakshi
Sakshi News home page

కమ్యూనిటీ పారా మెడికల్‌ సిబ్బంది నూతన కార్యవర్గం

Published Fri, Nov 10 2023 4:56 AM

ఎన్నికై న జిల్లా  నూతన కార్యవర్గం - Sakshi

పార్వతీపురం టౌన్‌: కమ్యూనిటీ పారా మెడికల్‌ – ప్రైమరీ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పార్వతీపురం మన్యం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక గురువారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగింది. ఎన్నికను రాష్ట్ర అధ్యక్షుడు టి.ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు సమక్షంలో నిర్వహించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా నాగిరెడ్డి సింహాచలం ఉపాధ్యక్షుడిగా వానపల్లి శంకరరావు, కార్యదర్శిగా నడిమింటి గోపాలనాయుడు, సహాయ కార్యదర్శిగా బి.వి.రమణ, కోశాధికారిగా తులసీదాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై న వారికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, వివిధ మండలాల సభ్యులు అభినందించారు. అనంతరం రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ నిర్వహించవలసిన విధి విధానాలను తెలియజేశారు.

గిరిజనుడి హత్య!

శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ అడ్డతీగ గ్రామం వద్ద గురువారం సాయంత్రం గిరిజన యువకుడు హత్యకు గురైనట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మృతుని భార్య ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం గుమ్మ గ్రామానికి చెందిన పాంగి అర్జున్‌(38) మండలంలోని కొత్తఅడ్డతీగ గ్రామంలో భార్యాబిడ్డలతో నివసిస్తున్నాడు. గత కొంత కాలంగా గ్రామానికి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం 6గంటల సమయంలో గ్రామానికి సమీపంలో అర్జున్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గుండెలపై రెండుచోట్ల లోతైన గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తొలుత గుర్తించి అర్జున్‌ భార్య కాంతానికి సమాచారం ఇచ్చాడు. ఆమె పరుగున వెళ్లి భర్తతో మాట్లాడగా అడ్డతీగ వాళ్లు కొట్టారని చెబుతుండగా ఆయన మాట ఆగిపోయింది. భార్య వెంటనే గ్రామంలోకి వచ్చి చెప్పగా 108లో ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అర్జున్‌ మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో భార్య కన్నీరుమున్నీరవుతోంది. అరు్‌జ్న్‌ భార్య ఐదు నెలలు గర్భిణి కాగా, ఏడాది వయస్సున్న కుమార్తె ఉంది. అర్జున్‌ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

మృతి చెందిన గిరిజనుడు అర్జున్‌
1/1

మృతి చెందిన గిరిజనుడు అర్జున్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement