కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Published Sat, Nov 11 2023 12:40 AM

కార్మికులకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే ముదులి తదితరులు - Sakshi

రాయగడ: కార్మికులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందజేస్తోందని రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులి అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్‌ అడిటోరియంలో జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకం నుంచి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. ప్రజల ఆదరాభిమానాలు ఉండడంతోనే బీజేడీ రెండు దశాబ్ధాలకు పైగా అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయగలుగుతుందని తెలియజేశారు.

సాయం అందజేత

జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్న కుమార్‌ పాణిగ్రహి మాట్లాడుతూ.. ఈ ఏడాది 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 87 మంది కార్మికులకు రూ.1.73 కోట్లు, ఫునరల్‌ సహాయార్ధం మరో 87 మంది కార్మికులకు రూ.4.35 లక్షలు, మెటెర్నిటీ సహకారం కింద 11 మంది కార్మికులకు రూ.1.10 లక్షలు, కార్మికుల పిల్లల చదువుల కోసం 20 మందికి రూ.1,87,400లు, వివాహ కార్యక్రమాలకు గాను మరో 46 మంది కార్మిక కుటుంబాలకు రూ.22.75 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేసిందన్నారు. అదేవిధంగా మృతి చెందిన మరో 8 మంది కార్మిక కుటుంబాలకు లక్ష రుపాయలు చొప్పున్న ఆర్థిక సాయం అందించిందని వివరించారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపల్‌ చైర్మన్‌ మహేష్‌ పట్నాయక్‌, స్పెషల్‌ డవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ (రాయగడ) అనసూయా మాఝి, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సరస్వతీ మాఝి తదితరులు పాల్గొనగా, జిల్లా కార్మిక శాఖ అఽధికారి జాస్మిన్‌ సాహు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అతిథులు కార్మికులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందించారు.

ఎమ్మెల్యే మకరంద ముదులి

Advertisement
Advertisement