రాష్ట్రపోటీలకు సన్నద్ధం కావాలి | Sakshi
Sakshi News home page

రాష్ట్రపోటీలకు సన్నద్ధం కావాలి

Published Mon, Nov 20 2023 12:36 AM

సత్కారం అందుకున్న మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ సంఘ ప్రతినిధులు, అథ్లెట్స్‌  - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు శ్రీకాకుళం జిల్లా అథ్లెట్స్‌ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొడ్డేపల్లి నారాయణరావు పిలుపునిచ్చారు. తిరుపతి వేదికగా డిసెంబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు 42వ ఏపీ రాష్ట్రస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2023 పోటీలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్‌ సమీపంలో ఉన్న ఎన్‌జీఓ గెస్ట్‌హౌస్‌ వేదికగా సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డేపల్లి నారాయణరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. శ్రీకాకుళంలో సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటైన వెంటనే జాతీయ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. సంఘ ప్రధాన కార్యదర్శి పాలకొండ అప్పారావు మాట్లాడుతూ జిల్లాలో అద్భుతమైన నైపుణ్యం, టైమింగ్‌ కలిగిన మాస్టర్‌ అథ్లెట్స్‌ ఉన్నారని గుర్తుచేస్తు.. రాష్ట్రపోటీలకు సమయం సమీస్తున్న దృష్ట్యా సన్నద్ధం కావాలన్నారు. సమీపంలోని క్రీడామైదానాల్లో నిర్దేశించుకున్న ఈవెంట్స్‌లో శిక్షణ పొందాలన్నారు. ఈ సందర్భంగా బొడ్డేపల్లి నారాయణరావు, పాలకొండ అప్పారావు, చల్లా జగదీష్‌, లింగాల ప్రసాధరావు, జీఎం జ్యోతి, సనపల సారధి, అన్నెపు ఈశ్వరరావు, సుధాకరరావులను ఘనంగా సత్కరించారు. క్రీడాదుస్తులను అథ్లెట్స్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు ఎం.భాగ్యలక్ష్మి, ఎం.కామయ్య, యశోద, ఆనంద్‌, జోగారావు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్‌ అథ్లెట్స్‌కు సంఘ పేట్రన్‌ చౌదరి పురుషోత్తమనాయుడు బెస్ట్‌ విసెష్‌ తెలియజేశారు.

Advertisement
Advertisement