నాటుసారాపై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

నాటుసారాపై ఉక్కుపాదం

Published Fri, Dec 22 2023 1:02 AM

పెంటాగడలో స్వాధీనం చేసుకున్న నాటుసారా సామగ్రి 
 - Sakshi

బరంపురం: గంజాం జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు బుధ, గురువారం రెండు రోజులు దిగపండి, చికిటి, పత్రపూర్‌ సరిహద్దుల్లో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో రహస్యంగా తయారు చేస్తున్న వంటసారా బట్టీలపై ఉక్కుపాదం మోపారు. సుమారు 2 వేల లీటర్ల విప్పపువ్వు ఊటను ధ్వసం చేశారు. అలాగే సారా తయారీ సామగ్రి స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్టు చేశారు. అదేవిధంగా గోళంతర, హింజిలికాట్‌ పోలీసుస్టేషన్ల పరిధి కుసిమి, కుంచరడా ప్రాంతాల్లో ఎకై ్సజ్‌ అధికారులు దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నిందితులను అరెస్టు చేసినట్లు బరంపురం ఎకై ్సజ్‌ అధికారి వివేకనంద నాయక్‌ తెలియజేశారు. అక్రమంగా నాటుసారా తయారీ, విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కుసిమి ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న 
నకిలీ మద్యం బాటిళ్లు
1/3

కుసిమి ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యం బాటిళ్లు

కుంచరడా ప్రాంతలో  సీజ్‌ చేసిన నకిలీ మద్యం
2/3

కుంచరడా ప్రాంతలో సీజ్‌ చేసిన నకిలీ మద్యం

దిగపండిలో అరెస్టు చేసినవారిని చూపిస్తున్న పోలీసులు
3/3

దిగపండిలో అరెస్టు చేసినవారిని చూపిస్తున్న పోలీసులు

Advertisement
Advertisement