గజగజ | Sakshi
Sakshi News home page

గజగజ

Published Fri, Dec 22 2023 1:02 AM

- - Sakshi

● యూబీకేలో సున్నా డిగ్రీల సెల్సియస్‌ ఉష్టోగ్రత నమోదు

భువనేశ్వర్‌: రాష్ట్రంలో ఈ ఏడాది అత్యంత శీతలమైన రోజుగా గురువారం నిలిచింది. ఉదయం 6 గంటలకు సిమిలిపాల్‌ ఎగువ బొరొహా కముద (యూబీకే) ప్రాంతంలో 0 (సున్న) డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాష్ట్రంలో 13 చోట్ల రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే తక్కువగా రికార్డు అయింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని 24 చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. స్థానిక వాతావరణ కార్యాలయం సమాచారం ప్రకారం ఉత్తర, వాయువ్య దిశ నుంచి వీచే శీతల గాలుల ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 1 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 2 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశం ఉంది. జంట నగరాలైన భువనేశ్వర్‌, కటక్‌ ప్రాంతాల్లో వరుసగా 12.4 డిగ్రీల సెల్సియస్‌, 12.8 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సెమిలిపాల్‌లో మంటవద్ద చలి కాగుతున్న 
మేకపిల్ల
1/1

సెమిలిపాల్‌లో మంటవద్ద చలి కాగుతున్న మేకపిల్ల

Advertisement
Advertisement