త్రికరణ శుద్ధిగా.. | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2023 1:24 AM

- - Sakshi

రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగుతోంది. గతంలో సాగు అంటేనే భయపడాల్సిన దుస్థితిని మార్చి, నాలుగేళ్లుగా పెట్టుబడి సాయం కింద నగదు అందిస్తూ ప్రభుత్వం అన్నదాతల్లో భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేసింది. వారిలో భరోసా నింపుతోంది. నేడు మూడో విడత భరోసా సాయం అందిస్తూ రైతుల అభ్యున్నతికి, రాష్ట్రంలో వ్యవసాయా భివృద్ధికి ‘త్రి’కరణ శుద్ధితో పనిచేస్తున్నానని చాటి చెబుతోంది.

సాక్షి, నరసరావుపేట: నేల తల్లిని నమ్ముకున్న రైతన్నలకు అండగా నిలిచేందుకు రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పేరుతో నగదు సాయం అందిస్తోంది. ఏటా మూడు దఫాలుగా ఆర్థికసాయం చేసి పంటల పెట్టుబడికి తోడుగా నిలుస్తోంది. నేడు రైతుల ఖాతాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ మూడో విడత చెల్లింపులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెనాలిలో జరగనున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో బటన్‌ నొక్కి ప్రారంభించనున్నారు. సాగు ఖర్చుల నిమిత్తం రైతులు అప్పులు చేయాల్సిన పని లేకుండా గత నాలుగేళ్లుగా వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారు. దీంతో రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకుంటున్నారు. సాగును సంబరంగా చేస్తున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పేరిట ఏటా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పును పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీన్ని ఖరీఫ్‌లో పంటసాగు నిమిత్తం మే మాసంలో మొదటి విడతగా రూ.7,500, రెండో విడతగా రబీ నిమిత్తం అక్టోబర్‌ నెలలో రూ.4,000, మూడో విడతగా రూ.2,000 జనవరిలో ప్రభుత్వం విడుదల చేస్తుంది.

జిల్లాలో 2,66,871 మంది లబ్ధిదారులు...

గత మూడు ఆర్థిక సంవత్సరాలు ఇలానే క్రమం తప్పకుండా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు దఫాలుగా మే 16, అక్టోబర్‌ 17న రైతుల ఖాతాల్లో నగదు జమైంది. నేడు మూడో విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2,000 జమకానుంది. రైతులు ఈకేవైసీ చేసుకోవడంలో జరిగిన ఆలస్యం కారణంగా మూడో విడత నగదు జమలో కొంత జాప్యం జరిగింది. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి పల్నాడు జిల్లాలోని 28 మండలాల పరిధిలో మొత్తం 2,66,871 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరి వ్యక్తిగత ఖాతాల్లో నేడు రూ.57,69,49,500 జమ కానుంది. రాష్ట్రస్థాయి కార్యక్రమం తెనాలిలో జరగనుండగా, జిల్లా స్థాయి కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో జరగనుంది. ఇందులో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.

¯ólyýl$ OÐðlGÝëÞÆŠ‡ OÆð‡™èl$ ¿ýæÆø-Ýë& -ï³-G… MìSÝ믌S ¯]lVýS§ýl$ fÐ]l$

¯éË$Vø Hyé¨.. Ð]lÊyø Ñyýl™èl ^ðlÍÏ…ç³#Ë$ hÌêÏÌZ 2,66,871 Ð]l$…¨ OÆð‡™èl$ÌS Rê™éÏÌZ Æý‡*.57.69 Mør$Ï D BǦMýS çÜ…Ð]l-™èlÞ-Æý‡…ÌZ Cç³µ-sìæMóS Æð‡…yýl$ Ñyýl-™èlË$V> JMøP OÆð‡™èl$MýS$ Æý‡*.11,500 ^ðlÍÏ…ç³# ¯ólyýl$ ™ðl¯é-ÍÌZ ºr¯ŒS ¯öMìSP Ñyýl$§ýlÌS ^ólĶæ$¯]l$¯]l² ïÜG… OÐðlG‹Ü fVýS-¯ŒS-Ððl*çßæ-¯ŒS-Æð‡yìlz

Advertisement

తప్పక చదవండి

Advertisement