శాకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం | Sakshi
Sakshi News home page

శాకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

Published Tue, Oct 3 2023 1:50 AM

-

మొగల్రాజపురం(విజయవాడతూర్పు):మనుషులు శాకాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నేషనల్‌ వెజిటేరియన్‌ మూవ్‌మెంట్‌ సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్‌ చెప్పారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం సిద్ధార్థ ఆడిటోరియంలో విజయవాడ వెజిటేరియన్‌ క్లబ్‌ ప్రారంభోత్సవం జరిగింది. ముందుగా క్లబ్‌ సభ్యులు శాకాహారం ప్రాధాన్యం తెలిసేలా సిద్ధార్థ ఆడిటోరియం నుంచి పిన్నమనేని పాలిక్టీనిక్‌ రోడ్డు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల రోడ్డుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్టులు, కరపత్రాల పంపిణీతో పాటుగా మైక్‌ ద్వారా ప్రచారం చేశారు. అనంతరం సిద్ధార్థ ఆడిటోరియంలో క్లబ్‌ ప్రారంభ సభ నిర్వహించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రాణుల పట్ల దయ చూపడమే ధర్మమని, వాటిని చంపడం మహా పాపమని గౌతమ బుద్దుడు చెప్పాడన్నారు. మనిషి శరీర నిర్మాణానికి ముఖ్యంగా ప్రొటీన్‌లు, కార్బోహైడ్రెట్‌లు, కొవ్వు పదార్థాలు, లవణాలు అవసరమని శాస్త్రవేత్తలు నిర్ధారించారని తెలిపారు. అవి మాంసాహారంలో కంటే శాకాహారంలో ఎక్కువ శాతంలో ఉంటాయని పేర్కొన్నారు. శాకాహారులుగా మారి ఆరోగ్యంగా జీవించాలని సూచించారు.

Advertisement
Advertisement