Sakshi News home page

భారీ స్క్రీన్‌పై ప్రపంచ కప్‌ ఫైనల్‌ పోరు

Published Sun, Nov 19 2023 1:40 AM

-

గుంటూరు వెస్ట్‌ ( క్రీడలు ): వన్‌డే ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోరును భారీ స్క్రీన్‌పై వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నామని క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి దాసరి రమేష్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 నుంచి మ్యాచ్‌ ముగిసే వరకు స్థానిక అరండల్‌పేటలోని పిచ్చుకులగుంట క్రీడా మైదానంలో 15 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు వున్న ఎల్‌ఈడీ స్క్రీన్‌తోపాటు కూర్చుని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రవేశం ఉచితమని చెప్పారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ను మరింత ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 524.50 అడుగుల వద్ద ఉంది. సాగర్‌ జలాశయం నుంచి ఎడమకాలువకు 5,297, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 27,440, ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 841.00 అడుగుల వద్ద ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement