గూడూరు రూరల్ (తిరుపతి జిల్లా): విజయవాడలోని కోచింగ్ సెంటర్లో కుదిరిన స్నేహం విడదీయరాని బంధంగా ఏర్పడింది. పెద్దలు ఎక్కడ తమను కలుసుకోకుండా చేస్తారో అన్న భయంతో ఆ జంట గూడూరుకు సమీపంలో ఆదివారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా శ్రీరుక్మిణీపురానికి చెందిన అన్నంగి పావని (19) హోటల్ మేనేజ్మెంట్ చేసింది. చిల్లకూరు మండలంలోని ఓ హోటల్లో పని చేసేందుకు సొంత ఊరి నుంచి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని రెండు రోజుల క్రితం వచ్చింది. ఇక్కడ నుంచి తనకు గతంలో విజయవాడలోని కోచింగ్ సెంటర్లో చదుకుని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా, సగిపాడు గ్రామానికి చెందిన దండే రాకేష్(23)ను గూడూరుకు రావాలని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతో ఆదివారం గూడూరు వచ్చి ఇద్దరు కలుసుకుని చాలా సేపు భావి జీవితానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పెద్దలకు ఇష్టం లేకపోతే ఇద్దరు ఎవరికి వారు దూరం కావాల్సి వస్తుందని భావించిన వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక గూడూరు రైల్వే స్టేషన్ నుంచి సుమారు మూడు కి.మీ దూరంలో ఉన్న గాంధీనగర్ ప్రాంతం వరకు ట్రాక్‌పై నడిచి వెళ్ళి అక్కడ రైలు పట్టాలపై పడుకున్నారు. వారిపై నుంచి గూడ్స్ ట్రైన్ వెళ్లడంతో తలలు తెగి వారు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. చిన్న వయస్సులో ప్రేమించుకున్న ప్రేమికులు పుట్టిన ఊరు నుంచి దూరంగా వచ్చి ఆత్మహత్య చేసుకోవడం గూడూరు డివిజన్లో సంచలనం సృషించింది. యువతీ యువకుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచార ఇచ్చారు. వారు సోమవారం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద రోదించడం చూసిన వారు కన్నీటి పర్యంతం అయ్యారు.
రైలుకింద పడి ప్రేమికుల ఆత్మహత్య
Published Tue, Nov 21 2023 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement