నేడు ముక్కోటి ఏకాదశి తిరునాళ్ల మహోత్సవాలు | Sakshi
Sakshi News home page

నేడు ముక్కోటి ఏకాదశి తిరునాళ్ల మహోత్సవాలు

Published Sat, Dec 23 2023 4:44 AM

ప్రత్యేక అలంకారంలో సీతా సమేతుడైన రామచంద్రుడు  
 - Sakshi

అచ్చంపేట: ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్థానిక శ్రీ సీతారామస్వామి దేవాలయం వద్ద వాసవీ కన్యకాపరమేశ్వరి వర్తక సంఘం ఆధ్వర్యంలో శనివారం తిరునాళ్ల మహోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 127 సంవత్సరాలుగా అచ్చంపేటలో ముక్కోటి ఏకాదశి తిరునాళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారుజామున సీతాసమేతుడైన శ్రీరామచంద్రునికి అర్చనలు, మూలమూర్తికి స్నపన ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు సాక్షాత్కారంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి వర్తక సంఘం, లక్ష్మీ తిరుపతాంబ భజన సమాజం వార్లచే వేర్వేరుగా భజన కార్యక్రమాలు జరుగనున్నాయి. మహిళా విభాగం వారిచే తిరుప్పావై విష్ణు సహస్రనామార్చనలు జరుగుతాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సీతాసమేతుడైన శ్రీరామచంద్రులవారు దేవాలయాలనికి సమీపంలో ప్రత్యేకంగా నిర్మించిన కొఠారు(పెద్దపందిరి)లో ప్రవేశిస్తారు. సీతారామస్వామి దేవాలయాన్ని రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే భక్తులను ఆకర్షించే విధంగా దేవాలయ పరిసరాలలో ప్రత్యేక స్టాల్స్‌, రంగులరాట్నాలు ఏర్పాటు చేశారు.

ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు పూర్తి విద్యుత్‌ కాంతులతో సీతారామస్వామి దేవాలయం

Advertisement
Advertisement