No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Apr 23 2024 8:25 AM

ఆర్‌ఓకి నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్న
 కావటి శివనాగమనోహర నాయుడు - Sakshi

చిలకలూరిపేట: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌నాయుడు నామినేషన్‌ దాఖలు సందర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీ చిలకలూరిపేటలో నూతన అధ్యాయనానికి నాంది పలికింది. చిలకలూరిపేట చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నియోజవర్గం నుంచి తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారింది. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పార్టీ పతాకాలు చేతపట్టి కదం తొక్కారు. పట్టణంలోని బ్యాంకుకాలనీలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9.45 గంటలకు ర్యాలీ ప్రారంభమైంది. ప్రచార రథం పైనుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌నాయుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, పార్టీ నాయకులు విడదల గోపీనాథ్‌, జ్ఞానేశ్వర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ షేక్‌ జాన్‌సైదా తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నరసరావుపేట సెంటర్‌, భాస్కర్‌ సెంటర్‌, చౌత్రా సెంటర్‌, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, కళామందిర్‌సెంటర్‌, గడియార స్తంభం మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు చేరుకుంది. తీన్మార్‌ వాయిద్యాల నడుమ కార్యకర్తలు సందడి చేశారు. అడుగడునా భవనాలౖపై నుంచి మహిళలు, అభిమానులు పూల వర్షం కురిపించారు. మహిళలు ప్రచారరథంపై ఉన్న నాయకులకు గుమ్మడికాయలతో దిష్టితీసి, హారతులు పట్టి జయం కలగాలని ఆకాంక్షించారు. సుగా లి మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణతో వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. నామినేషన్‌ ర్యాలీ జైత్రయాత్రలా కొనసాగింది. ముందుగా పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో కావటి మనోహర్‌నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్‌నాయుడుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, జీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ లాలూపురం రాము, గుంటూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ డైమండ్‌ బాబు తదితరులు కలసి అభినందనలు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్న కావటి మనోహర్‌ నాయుడు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.నారదమునికి అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గొంటు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ రఫాని, వైస్‌ చైర్మన్‌ వలేటి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బీపీ నాయుడు, బైరా వెంకటకృష్ణ, బొంతు నాగిరెడ్డి, తాళ్ల అంజిరెడ్డి, పఠాన్‌ తలహాఖాన్‌, గుత్తా యాములయ్య, ఘంటా శంకర్‌, మద్దూరి కోటిరెడ్డి, ఏవీఎం సుభాని, ముస్లిం కార్పొరేషన్‌ డైరెక్టర్‌ షేక్‌ దరియావలి, మైనింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గాదె సుజాత, పార్టీ వివిధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కావటి నామినేషన్‌ దాఖలు

Advertisement
Advertisement