మంగళవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2023 | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2023

Published Tue, Mar 28 2023 3:18 AM

- - Sakshi

శుభ పరిణామం..

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 9,962 మంది విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం టాబ్‌లు అందజేసింది. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు బైజూస్‌ అనేది ఒక చక్కని ప్లాట్‌ఫాం. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతోంది. విద్యార్థులతో పాటు 1900 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందజేశాం.

– ఎస్‌డీవీ రమణ,

జిల్లా విద్యాశాఖ అధికారి, పార్వతీపురం మన్యం

పల్లె ముంగిటకే వైద్యం

ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర

నూతనంగా మంజూరైన 104

వాహనాల ప్రారంభం

సాలూరు: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం చేరువైందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో భాగంగా జిల్లాకు నూతనంగా మంజూరైన పదకొండు 104 వాహనాలను వెంగళరాయసాగర్‌ క్వార్టర్స్‌ వద్ద సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజన్నదొర మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రతీఒక్కరికి నాణ్యమైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. ఆస్పత్రిలో అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 104 వాహనాలతో వైద్యసేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాల్లో వైద్యసేవలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. నూతనంగా ప్రారంభించిన 11 వాహనాలతో కలిపి జిల్లా లో 30 వాహనాలు అందుబాటులోకి వచ్చా యని తెలిపారు. వైద్యశిబిరాలు విస్త్రతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో డీఎమ్‌అండ్‌హెచ్‌ఓ జగన్నాథరావు, 104 డీఎమ్‌ దుర్గాప్రసాద్‌, వైద్యశాఖ అధికారులు, మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ జర్జాపుదీప్తి, వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, నాయకులు జర్జాపు ఈశ్వరరావు, సూరిబాబు, దండి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పిడుగుపాటుకు విద్యార్థి మృతి

పార్వతీపురం: పార్వతీపురం మండలం వెంకంపేటకు చెందిన పట్ర మౌనిక (17) తన స్నేహితురాలు కె.కావ్యతో కలిసి ఊరిచివర మామిడితోట వద్దకు బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురైంది. మౌనిక అక్కడికక్కడే మృతిచెందగా కావ్య తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను చికిత్సన నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన మౌనిక పార్వతీపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయసంవత్సరం చదువుతోంది. మౌనిక మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

వైద్యాధికారి పోస్టుల భర్తీకి

ఇంటర్వ్యూలు

విజయనగరం ఫోర్ట్‌: పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎన్‌బీఎస్‌యూ, ఎన్‌ఆర్‌సీ, టెలీ మెడిసిన్‌ హబ్‌లలో ఏడు వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఏప్రిల్‌ ఒకటో తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.వి.రమణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మాలాంటి వారికి

ఉపయోగం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, గిరిజన సంక్షేమ మంత్రి పీడిక రాజన్నదొర మాలాంటి పేదకుటుంబాల విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నారు. వారు ఇచ్చిన ట్యాబ్‌లు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతున్నాయి.

–పి.కిశోర్‌, పి.కోనవల గిరిజన గురుకుల బాలుర పాఠశాల, పాచిపెంట మండలం

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

నాడు: పాఠ్యపుస్తకాల ఆధారంగా తరగతిలో బోధన జరిగేది. టీచర్‌ చెప్పిన పాఠం మళ్లీ మళ్లీ వినాలంటే కష్టమయ్యేది. అర్థంగాకపోతే మళ్లీ టీచర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాల్సిందే. ఎవరైనా వెనుకబడితే పరీక్షల్లో ఇబ్బంది అయ్యేది.

నేడు: పాఠ్యాంశాలన్నీ ట్యాబ్‌లోకి వచ్చేశాయి. ప్రతి పాఠానికి టీచర్‌ ఆడియో, వీడియో రెండూ ఉంటాయి. ఆ బోధనల్లో ఏ మాత్రం సందేహం ఉన్నా ఇంటికెళ్లిన తర్వాత కూడా ఎన్నిసారైనా వినవచ్చు. ప్రతి పాఠ్యాంశానికి అనుబంధంగా పోటీ పరీక్షలకు అవసరమైన ప్రశ్నావళి ఉంటుంది. అలా తర్ఫీదు ద్వారా ప్రజ్ఞ పెంచుకోవడానికి బృహత్తరమైన అవకాశం వచ్చింది. మరేవిధంగానూ ఇంటర్‌నెట్‌ లింక్‌ చేయడానికి కుదరదు. ఒకవేళ ఏ విద్యార్థి అయినా లింక్‌ చేస్తే ట్యాబ్‌లోని పాఠ్యాంశాలన్నీ బ్లాక్‌ అయిపోతాయి. అంతేకాదు ప్రతి ఐదుగురు విద్యార్థుల ట్యాబ్‌లపై పర్యవేక్షణ బాధ్యతలను ఒక్కో టీచర్‌కు అప్పగించారు. దీనివల్ల ఎక్కడా దుర్వినియోగానికి ఆస్కారమే లేదు.

భుజానికి బ్యాగ్‌... చేతిలో ట్యాబ్‌... చూడచక్కని యూనిఫాం.. కాళ్లకు బూట్లు... ఆ విద్యార్థులను చూస్తుంటే వారిది ఏ ఇంటర్నేషనల్‌ స్కూలో, ఏ కార్పొరేట్‌ స్కూలో అనుకుంటే పొరపాటే! వారంతా మన సర్కారీ బడుల విద్యార్థులే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమంతో ఆ బడుల దశ దిశా మారిపోయాయి. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ఎదిగేలా ఇప్పుడు ఆయన అందించిన ట్యాబ్‌లు విద్యార్థులకెంతో ప్రయోజనం చేకూర్చుతున్నాయి. బైజూస్‌ కంటెంట్‌ ఉన్న ట్యాబ్‌లతో డిజిటల్‌ బోధనతో నవశకానికి నాంది పలికారు.

ట్యాబ్‌ల పంపిణీ ఇలా..

తొలివిడతలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లను గత ఏడాది డిసెంబర్‌ 21 తేదీ నుంచి అందించింది. విజయనగరం జిల్లాలోని 457, పార్వతీపురం మన్యం జిల్లాలోని 263 పాఠశాలల్లో 27,892 మంది విద్యార్థులకు ఒక్కొక్కటి చొప్పున అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌ విద్యారంగ దిగ్గజం బైజూస్‌తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ ఇంగ్లిష్‌, తెలుగులో నిక్షిప్తమైంది. బైజూస్‌ కంటెంట్‌ను నిక్షిప్తం చేయడానికై న ఖర్చుతో కలిపితే ఒక్కొక్కటీ సుమారు రూ.32 వేల విలువైన ట్యాబ్‌లను విద్యార్థులతో పాటు వారికి బోధించే టీచర్లకు కలిపి మొత్తం 31,369 ట్యాబ్‌లను ప్రభుత్వం ఉచితంగా అందించింది. అలా చూస్తే ఈ రెండు జిల్లాలకే రూ.వంద కోట్లకు పైగా ఖర్చు అయ్యింది.

పాఠ్యాంశాల కంటెంట్‌ ప్రీలోడ్‌...

విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ట్యాబ్‌ల్లో కంటెంట్‌ ప్రీలోడ్‌ చేశారు. 8, 9 తరగతులకు సంబంధించిన గణితం, భౌతిక, జీవ, రసాయనశాస్త్రాలు, చరిత్ర, భూగర్భశాస్త్రం, పౌరశాస్త్రం సబ్జెక్టుల పాఠాలు ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉన్నాయి. పాఠ్యపుస్తకాల్లోని అధ్యాయాల వారీగా పొందుపరిచారు. ప్రతి అధ్యాయం కాన్సెప్ట్‌లుగా విభజించారు. ప్రతి కాన్సెప్ట్‌ను రెండు నుంచి నాలుగు నిమిషాల వ్యవధితో వీడియోలుగా రూపొందించారు. ఇలా మొత్తం 300 వీడియోలతోపాటు 57 అధ్యాయాలు, 472 కాన్సెప్ట్‌లు ఉన్నాయి.

ప్రశ్నపత్రాలపై సులభంగా తర్ఫీదు...

ట్యాబ్‌లలో సబ్జెక్టుల వారీగా 168 ప్రశ్నపత్రాలు ఉన్నాయి. విద్యార్థులు పాఠ్యాంశాలను వీడియోలో చూసి నేర్చుకోవడంతో పాటు ప్రశ్నపత్రాలనూ ప్రాక్టీస్‌ చేసుకొనే వెసులుబాటు ఉంది. తద్వారా అభ్యసనా సామర్థ్యాన్ని ఎవరికి వారే పెంపొందించుకోవడానికి దోహదపడుతోంది. తమ సందేహాలను ఎప్పుడైనా, ఎక్కడైనా నివృత్తి చేసుకోవచ్చు. దీంతో తరగతిలో వెనుకబడిన విద్యార్థులు సైతం చదువులో ఇప్పుడు రాణిస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ట్యాబ్‌లలో కంటెంట్‌ను అవగాహన చేసుకుంటున్న విద్యార్థులు

ట్యాబ్‌ సద్వినియోగం

చేసుకుంటున్నాం

ట్యాబ్‌ను సద్వినియోగం చేసుకుంటున్నాం. పాఠ్యాంశాలు టాపిక్‌ వారీగా వీడియోల రూపంలో ఉన్నాయి. ట్యాబ్‌ను ఏవిధంగా వాడాలనేదీ ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు.

– పొదులాపుసుస్మిత, జెడ్పీహైస్కూల్‌, పాలకొండ

జగన్‌మామకు రుణపడి ఉంటాం

జగన్‌మామయ్య మాకు ఇచ్చిన ట్యాబ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంది. బైజూస్‌ యాప్‌లో గణితం, ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలను నమోదు చేసుకొంటున్నాం. సాంకేతిక పరమైన జ్ఞానం పెంపొందించేందుకు వీలుగా ఉన్నాయి. ఆయనకు రుణపడి ఉంటాం.

– మీనక తపస్విని,

కురుపాం జెడ్పీ హైస్కూల్‌

దుగ్గిలో గజరాజుల సంచారం

కొమరాడ: మండలంలోని దుగ్గి గ్రామంలో ఎనిమిది ఏనుగుల గుంపు తిష్టవేశాయి. ప్రజలందరూ అప్రమంతా ఉండాలని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హితబోధ చేస్తున్నారు.

11 మంది డీబార్‌

విజయనగరం పూల్‌బాగ్‌:

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (ఫిజిక్స్‌ పేపర్‌–2, ఎకనామిక్స్‌ పేపర్‌–2) పరీక్షకు విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24,398 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్‌ జనరల్‌ విద్యార్థులు 20,957కు 20,124 మంది, ఒకేషనల్‌ పరీక్షకు 4,579 మందికి 4,274 మంది హాజరయ్యారు. 1138 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ నాలుగు పరీక్ష కేంద్రాలను, డీఈసీ మూడు కేంద్రాలను, స్క్వాడ్‌ బృందాలు 42, ఇతర అధికారులు 8 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన 11 మందిని డీబార్‌ చేసినట్టు ఆర్‌ఐఓ ఎం.సత్యనారాయణ తెలిపారు.

ఫిజిక్స్‌ సబ్జెక్టులో 2 మార్కుల కేటాయింపు

ఇంటర్మీడియట్‌ సెకెండియర్‌ ఫిజిక్స్‌–2 (ఇంగ్లిష్‌ మీడియం) పేపర్‌లో మూడో ప్రశ్న (రెండు మార్కులు) తప్పుగా పడింది. ఆ ప్రశ్నకు సమాధానం రాసినా, రాయకపోయినా మార్కులు కేటాయిస్తామని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించినట్టు ఆర్‌ఐఓ ఎం.సత్యనారాయణ సోమవారం ఒక ప్రకనటలో తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని కోరారు.

స్టోన్‌క్రషర్‌లో మృత్యుఘోష

ట్యాబ్‌ల ఆధారంగా బోధన

బైజూస్‌ పాఠాలతో విద్యాబోధనలో నవశకం

తొలి విడతలో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 27,892 మంది విద్యార్థులకు ప్రయోజనం

డిజిటల్‌ బోధనలో 3,477 మంది

ఉపాధ్యాయులు

ఉపయోగపడుతోంది...

ట్యాబ్‌ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రత్యక్ష అనుభవంతో పాఠాలు నేర్చుకుంటున్నాం. సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటున్నాం.

– బోను బాలాజీ, జెడ్పీ హైస్కూల్‌, గరుగుబిల్లి

పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతున్నాయి...

జగన్‌ మామయ్య ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ మాకెంతో ఉపయోగపడుతోంది. పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతున్నాయి. విరామ సమయాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నాను.

– మీసాల షణ్ముఖరావు, సీతానగరం హైస్కూల్‌

ట్యాబ్‌లతో కురుపాం జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు
1/13

ట్యాబ్‌లతో కురుపాం జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు

2/13

3/13

4/13

 వెంకంపేట పాఠశాలల్లో ట్యాబ్‌లతో బోధన
5/13

వెంకంపేట పాఠశాలల్లో ట్యాబ్‌లతో బోధన

దుగ్గిలో సంచరిస్తున్న గజరాజుల గుంపు
6/13

దుగ్గిలో సంచరిస్తున్న గజరాజుల గుంపు

7/13

8/13

9/13

10/13

11/13

12/13

13/13

Advertisement

తప్పక చదవండి

Advertisement