జాగ్రత్తలతో క్యాన్సర్‌కు దూరం | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలతో క్యాన్సర్‌కు దూరం

Published Fri, Mar 31 2023 2:26 AM

- - Sakshi

విజయనగరం అర్బన్‌: ముందు జాగ్రత్తలతో క్యాన్సర్‌ను నివారించవచ్చని అంకాలజిస్ట్‌ పైడి వెంకటేశ్వరావు, ఫిజీషియన్‌ డాక్టర్‌ కేకే నాయుడు అన్నారు. స్థానిక సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘క్యాన్సర్‌పై అవగాహన – నివారణ, చికిత్స’పై బుధవారం నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ, క్యాన్సర్‌ రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. క్యాన్సర్‌ రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే 100 మంది విద్యార్థులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీ రామ్మూర్తి, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ ఎన్‌.సతీష్‌కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

క్రాస్‌ప్రొగ్రాం వాహనం ప్రారంభం

డెంకాడ: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా క్రాస్‌ప్రొగ్రాం కార్యక్రమం అమలుచేస్తున్నట్లు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద క్రాస్‌ప్రొగ్రాం వాహనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రా మాల్లో పాడైన బోర్లను బాగుచేయనున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరా వు, ఎంపీడీఓ స్వరూపారాణి, తహసీల్దార్‌ ఆదిలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ వైకుంఠనాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement