ప్రజాప్రభుత్వమిది | Sakshi
Sakshi News home page

ప్రజాప్రభుత్వమిది

Published Sat, Nov 11 2023 12:42 AM

- - Sakshi

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మేలుచేసేందుకు అనునిత్యం పరితపిస్తోందని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను 99 శాతం నేరవేర్చింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అర్హతే ప్రా మాణికంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది. ఫ్యామిలీడాక్టర్‌, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌, జగనన్న ఆరోగ్యసురక్ష శిబిరాలతో ఆరోగ్యభరోసా కల్పిస్తోంది. సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలను చేరవచేసిందని గుర్తుచేశారు.

అవినీతి రహితంగా...

పైసా లంచం ఇవ్వకుండా సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సాలూ రు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ, కురుపాంలో ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పోడు, బంజర భూము లను గిరిజనులకు పంణిచేసింది. ఎస్సీ, ఎస్టీ కులాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని తెలిపారు.

వెనుకబడిన వర్గాల్లో ఆర్థికోన్నతి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లలో వెనుకబడిన వర్గాల్లో ఆర్థి కోన్నతి స్పష్టంగా కనిపి స్తోందని, అందుకే సామా జిక సాధికార యాత్రకు వచ్చే నేతలకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నట్టు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. నిజాయితీ, దూర దృష్టితో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. సంక్షేమ, అభివృద్ధి పాలన సాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.

1/2

2/2

Advertisement
Advertisement