ఆకట్టుకున్న వర్ణచిత్రం | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న వర్ణచిత్రం

Published Sun, Nov 12 2023 12:36 AM

 దీపావళి వర్ణచిత్రం  - Sakshi

గరుగుబిల్లి: దీపావళిని పురస్కరించుకుని గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన నఖచిత్రకారుడు పల్ల పరిశినాయుడు వేసిన నఖచిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

విజయనగరం: అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞాన వెలుగులను ప్రసరింపజేసే దీపావళి పండగను ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకోవాలని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. నరకాసుర సంహారం, రాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగివచ్చిన పుణ్య ఘడియలను స్మరించుకుంటూ జరుపుకొనే వేడుకను అన్ని వర్గాల ప్రజలు ఆత్మీయంగా చేసుకోవాలని కోరారు. లక్ష్మీదేవి కటాక్షం ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షిస్తూ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

విద్యార్థుల ఆరోగ్యంపై

ప్రత్యేక శ్రద్ధ

పార్వతీపురంటౌన్‌: వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్టు జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య తనిఖీల రికార్డు పరిశీలించి హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించిన విద్యార్థులకు ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు అందజేస్తున్నామన్నారు. విద్యార్థులకు రక్తహీనత లక్షణాలు, సీజనల్‌ వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రత, రోగ నిరోధకశక్తి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రమాదరహిత డ్రైవింగ్‌ నైపుణ్యాలు అవసరం

విజయనగరం అర్బన్‌: ఆర్టీసీ రవాణా సేవల్లో డ్రైవింగ్‌ నైపుణ్యాలు ప్రమాద రహితంగా ఉండాని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి విజయకుమార్‌ అన్నారు. ఆర్టీసీ శిక్షణ కళాశాలలో 15 రోజులుగా డ్రైవర్లకు నిర్వహించిన శిక్షణతరగతుల ముగింపు కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ డ్రైవర్లు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. డిప్యూటీ సీఎంఈ కొటాన శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 600 మంది డ్రైవర్లకు రోజుకు 40 మంది చొప్పున ప్రమాద రహిత డ్రైవింగ్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు, రీజనల్‌ సేఫ్టీ మెకానికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సీహెచ్‌.వేణు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న  శ్రీకాకుళం జిల్లా ప్రజా 
రవాణా అధికారి విజయకుమార్‌
1/3

మాట్లాడుతున్న శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి విజయకుమార్‌

జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ 
టి.జగన్మోహనరావు
2/3

జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు

జెడ్పీ చైర్మన్‌ 
మజ్జి శ్రీనివాసరావు
3/3

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

Advertisement
Advertisement