గ్రోత్‌ ఇంజిన్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ | Sakshi
Sakshi News home page

గ్రోత్‌ ఇంజిన్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌

Published Tue, Nov 21 2023 2:06 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి 
 - Sakshi

విజయనగరం అర్బన్‌: జిల్లా అభివృద్ధికి భవిష్యత్తులో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్ర యం గ్రోత్‌ ఇంజిన్‌ కానుందని, రానున్న రోజుల్లో దీని కేంద్రంగానే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో గ్రోత్‌ హబ్‌లపై విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో సోమవారం జరిగిన విశాఖ పరిసర ప్రాంత కలెక్టర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అభివృద్ధి అవకాశాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విశాఖను గ్రోత్‌ హబ్‌గా రూపొందించాలని నీతిఅయోగ్‌ నిర్ణయించిన నేపథ్యంలో విశాఖ పరిసర ప్రాంత ఎనిమిది జిల్లాల కలెక్టర్లతో నీతిఆయోగ్‌ అధికారులు ఆయా జిల్లాల్లో వృద్ధికి గల అవకాశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి అవకాశాలను వివరించారు. ఉద్యాన పంటలను విస్తరించడం, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా మరిన్ని ఉద్యోగాలు కల్పించవచ్చన్నారు. జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రమం ఏర్పాటవుతున్న నేపథ్యంలో స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు చేపట్టడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెంపొందించడంతోపాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని వివరించారు. గత ఏడేళ్ల కాలంలో వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, సేవల, స్తిరాస్థి, నిర్మాణ రంగాల్లో జిల్లా సాధించిన అభివృద్ధిని గణాంకాలతో వివరించారు. ఆయా రంగాల్లో వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తెలియజేవారు. సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధి కారి పి.బాలాజీ, నీతి అయాగ్‌ అదనపు కార్యదర్శి అన్నారాయ్‌, నీతిఅయోగ్‌ సలహాదారు పార్థసారథిరెడ్డి, మెకన్సీ కంపెనీ ప్రతినిధి అభిలాష్‌, ప్రణాళిక శాఖ కార్యదర్శి గిరిజా శంకర్‌ పాల్గొన్నారు.

విశాఖ నీతి అయాగ్‌ సమావేశంలో

కలెక్టర్‌ నాగలక్ష్మి

Advertisement
Advertisement