ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు | Sakshi
Sakshi News home page

ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

Published Tue, Nov 21 2023 2:06 AM

నూతన పుస్తకాలను ఆవిష్కరించిన వీసీ ప్రొఫెసర్‌ కె.వెంకటసుబ్బయ్య - Sakshi

విజయనగరం అర్బన్‌: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ ప్రాంగణంలో డాక్టర్‌ వైఎస్సార్‌ సెంట్రల్‌ లెబ్రరీలో 364 కొత్తపుస్తకాలను వీసీ ప్రొఫెసర్‌ కె.వెంకటసుబ్బయ్య సోమవారం ఆవిష్కరించారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ప్రస్తుతం లైబ్రరీలో ఉన్న 24,907 వాల్యూమ్‌లకు కొత్త పుస్తకాలను అనుసంధానం చేసినట్లు వీసీ తెలిపారు. డెల్‌నెట్‌ ఆన్‌లైన్‌ జర్నల్స్‌, ఈ–బుక్స్‌, ఐఈఈఈ ఆన్‌లైన్‌ జర్నల్స్‌, మ్యాగజైన్స్‌, న్యూస్‌పేపర్స్‌, డిజిటల్‌ లైబ్రరీలో 10 కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం బీటెక్‌ ఆర్‌23 రెగ్యులేషన్స్‌ కోసం, జనరల్‌, గేట్‌, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలను కొత్త పుస్తకాలతో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీనివల్ల ఇంజినీరింగ్‌ విద్యార్థులకు లైబ్రరీ పఠనంపై ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయసుమ, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ గురునాథ, ఆఫీసర్‌ ఇన్‌చార్చ్‌ లైబ్రరీ డాక్టర్‌ చింతానీలిమాదేవి, లైబ్రరీ అసిస్టెంట్‌ జి.ఈశ్వరరావు వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

జేఎన్‌టీయూ జీవీ లైబ్రరీలో

364 కొత్తపుస్తకాల ఆవిష్కరణ

Advertisement
Advertisement