యాదవుల్లో ‘సంక్షేమ’ వెలుగులు | Sakshi
Sakshi News home page

యాదవుల్లో ‘సంక్షేమ’ వెలుగులు

Published Wed, Dec 13 2023 4:56 AM

కార్తీక వనసమారాధనలో మాట్లాడుతున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  - Sakshi

బొండపల్లి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని యాదవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని గొట్లాం గ్రామ సమీపంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు సముచిత స్థానం కల్పించడంతో పాటు వివిధ పథకాల కింద ప్రతి ఇంటా సంక్షేమ వెలుగులు నింపారన్నారు. ఆర్థికోన్నతికి అనువుగా వివిధ పథకాలు అందజేశారన్నారు. యాదవవర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు అందజేశారని గ్రేటర్‌ విశాఖపట్టణం మేయర్‌ గోలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. గొర్రెలు, మేకలు పెంపకందారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు అనేక రాయితీలు కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఫుడ్‌ కమిషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.కాంతారావు, యాదవుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మన్యాల కృష్ణ, యాదవుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు విసిరపు శేఖర్‌, మన్యాల శ్రీనివాస్‌, రామకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య అతిథులను సత్కరించారు. వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Advertisement
Advertisement