భక్తిశ్రద్ధలతో గీతా యజ్ఞం | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గీతా యజ్ఞం

Published Sun, Mar 10 2024 8:00 AM

విజేతలకు బహుమతులు అందజేస్తున్న 
అతిథులు జయసుమ, విజయ,  తదితరులు - Sakshi

పార్వతీపురం టౌన్‌: మండలంలోని చినబొండపల్లిలోని ఈశ్వరీ మహాదేవి పీఠంలో భక్తి శ్రద్ధలతో గీతాయజ్ఞం నిర్వహిస్తున్నారు. 40 రోజుల పాటు భగవద్గీతలోని 18 అధ్యాయాలను పఠిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రపంచమంతా శాంతియుతం కావాలన్న సత్సంకల్పంతో యజ్ఞం నిర్వహిస్తున్నట్టు పీఠాధిపతి సద్గురు శ్రీనివాసస్వామి తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు యజ్ఞం కొనసాగుతుందన్నారు. 24న శ్రీకృష్ణ విశ్వశాంతి కల్యాణం, అన్నసమారాధ జరుగుతుందని తెలిపారు.

ఆర్యవైశ్య మహాసభను

విజయవంతం చేయండి

గజపతినగరం: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభను విజయవంతం చేయాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూసర్ల పట్టాభి పిలుపునిచ్చారు. ఇదే విషయమై మండల కేంద్రంలోని విలేకరులతో శనివారం మాట్లాడిన ఆయన దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం కల్యాణ మండపంలో ఈ నెల 10వ తేదీన జరగనున్న సభకు ఆర్యవైశ్యులంతా తరలిరావాలన్నారు. బైక్‌లు, కార్ల ద్వారా గజపతినగరం పెట్రోలుబంకు దగ్గరకు చేరుకుని, అక్కడి నుంచి ర్యాలీగా దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం కల్యాణ మండపం చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యుల ఐక్యత, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించుకుంటామన్నారు.

మహిళలు స్వశక్తితో

ఎదగాలి

కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టి.వి.కట్టిమణి

విజయనగరం అర్బన్‌: మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆ విధంగా తమను తాము మలచుకోవాలని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టి.వి.కట్టిమణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక గిరిజన యూనివర్సిటీలో వసుదైక కుటుంబం అనే అంశంపై నిర్వహించిన సదస్సును ఆయన శనివారం ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ధైర్యసాహసాలు అలవర్చుకోవాలని, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసి, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలని మహిళలకు తెలిపారు. అన్నిరంగాల్లో మహిళల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఇదే సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఒడిశాలోని బరంపురం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గీతాంజలి దాస్‌ మాట్లాడుతూ మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత వంటివి పుష్కలంగా లభించినప్పుడే పురుషులతో సమానంగా వారు ఎదగగలుగుతారన్నారు. సీ్త్రలపై చూపిస్తున్న వివక్ష, జరుగుతున్న వేధింపులు, లైంగికదాడులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థుల సంప్రదాయ కళల ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఆ తర్వాత కార్యక్రమ ముఖ్య అతిథికి గిరిజన సంప్రదాయ కళాపుస్తకాన్ని జ్ఞాపికగా వీసీ ప్రొఫెసర్‌ కట్టిమణి అందజేశారు. కార్యక్రమంలో ఉమెన్స్‌ సెల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ పరికిపండ్ల శ్రీదేవి, డాక్టర్‌ కుసుమ, డాక్టర్‌ ప్రేమ చటర్జీ, డాక్టర్‌ దివ్య కొనికల్‌, డాక్టర్‌ లత కల్యంపూడి తదితరులు పాల్గొన్నారు.

అందరికీ సమాన అవకాశాలు

డెంకాడ: సమాజంలో సీ్త్ర, పురుషలిద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మహిళలను ప్రోత్సహించాలని జేఎన్‌టీయూ జీవీ రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ జి.జయసుమ అన్నారు. చింతలవలస ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మహిళా సాధికారత సెల్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహి ళా దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించితే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గౌరవ అతిథి విశాఖ ఎన్‌ఎస్‌టీఎల్‌ సైంటిస్ట్‌–జి ఎం.విజయ మాట్లాడుతూ.. గ్రామీణ పాంతాల్లో బాలికలు ఎదుర్కొంటున్న వివక్షను వివరించారు. కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, టెడ్‌టాక్‌, డ్యాన్స్‌, ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ వైఎంసీ శేఖర్‌, అధ్యాపకురాలు ప్రభ, మహిళా కోఆర్డినేటర్లు, మహిళా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీకృష్ణ విశ్వశాంతి గీతా మహాయజ్ఞం చేస్తున్న వేద పండితులు
1/2

శ్రీకృష్ణ విశ్వశాంతి గీతా మహాయజ్ఞం చేస్తున్న వేద పండితులు

గిరిజన సంప్రదాయ కళాపుస్తకాన్ని 
జ్ఞాపికగా అందజేస్తున్న వీసీ కట్టిమణి
2/2

గిరిజన సంప్రదాయ కళాపుస్తకాన్ని జ్ఞాపికగా అందజేస్తున్న వీసీ కట్టిమణి

Advertisement
Advertisement