ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలి | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలి

Published Thu, Aug 17 2023 12:30 AM

మాట్లాడుతున్న వాసిరెడ్డి సీతారామయ్య  - Sakshi

యైటింక్లయిన్‌కాలనీ/రామగిరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీలోని కమ్యూనిటీహాల్‌లో నిర్వహించిన సింగరేణి వర్కర్స్‌ యూనియన్‌, ఏటీయూసీ ఆర్జీ–2 ఏరియా 5వ మహాసభలో, ఆర్జీ–3 డివిజన్‌ పరిధిలోని ఏపీఏలో ఏర్పాటుచేసిన గేట్‌ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో ఎన్నికలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలతో ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేసే కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కోల్‌ ఇండియా తరహలో సింగరేణిలో కూడా కాంట్రాక్ట్‌ కార్మికులకు హైపవర్‌ వేతనాలు చేల్లించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి యాజమాన్యం వేలాది కోట్ల రూపాయిలను ప్రభుత్వానికి దారాదత్తం చేస్తోందన్నారు. కేసీఆర్‌ సీఎంగా కొనసాగినంతకాలం శ్రీధర్‌ సీఅండ్‌ఎండీగా కొనసాగుతారన్నారు. కార్మికుల హక్కుల కోసం టీబీజీకేఎస్‌ ఏనాడు పోరాటం చేయలేదని కానీ ఏఐటీయూసీ నిరంతరం కార్మికుల పక్షాన పోరాడుతోందని ఏఐటీయూసీని ఆదరించాలని కోరారు. కార్మికుల పిల్లలకు మెడికల్‌ కళాశాలలో 50శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 25, 26,27 తేదీల్లో నిర్వహించే మహాసభలకు కార్మికులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ వైవీ.రావు, బ్రాంచ్‌ సెక్రటరీ ఎంఆర్‌సీ రెడ్డి, పీట్‌ సెక్రటరీ గంగాధర్‌, కందికట్ల సమ్మయ్య, రవికుమార్‌, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, ఎల్‌ ప్రకాష్‌, సదానందం, కడారి సునీల్‌, ఎల్లయ్య, స్వామి, బుర్ర తిరుపతి, రాజారత్నం, రాంచందర్‌, అన్నారావు, శ్యాంసన్‌, రవీందర్‌, సాంబశివ రావు, మహేందర్‌, సత్యనారాయణ కార్మికులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి

వాసిరెడ్డి సీతారామయ్య

Advertisement

తప్పక చదవండి

Advertisement