ఐక్య పోరాటం ఫలించింది | Sakshi
Sakshi News home page

ఐక్య పోరాటం ఫలించింది

Published Mon, Sep 11 2023 12:42 AM

మాట్లాడుతున్న రామమూర్తి
 - Sakshi

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి వ్యాప్తంగా మైనింగ్‌ సిబ్బంది ఐక్యపోరాటం ఫలించిందని సింగరేణి మైనింగ్‌ స్టాప్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ మాదాసి రామమూర్తి అన్నారు. ఆదివారం యైటింక్లయిన్‌కాలనీ ప్రెస్‌ భవన్‌లో మాట్లాడారు. సింగరేణిలోని గనివృత్తి శిక్షణ కేంద్రాల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు విధులు నిర్వహించడానికి జారీ చేసిన సర్క్యులర్‌ రద్దు చేయాలని సింగరేణి మైనింగ్‌ స్టాప్‌ ఐక్యతతో చేసిన పోరాటంతో యాజమాన్యం స్పందించింద సదరు సర్క్యులర్‌ను నిలుపుదల చేసిందని పేర్కొన్నారు. మైనింగ్‌ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు ఐక్యంగా ఉండి అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. సంస్థ అభివృద్ధిలో సూపర్‌వైజర్లు, అధికారుల పాత్ర కీలకమైందన్నారు. మెడికల్‌ అన్‌ఫిట్‌ అయినా, ప్రమాదాలకు గురైన మైనింగ్‌ సిబ్బందికి ఓపెన్‌ కాస్ట్‌, సర్పేస్‌ విభాగాల్లో అదే హోదాలో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. తమ పోరాటానికి సంఘీభావం తెలిపిన కార్మికులు, నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మైనింగ్‌ స్టాప్‌ కో కన్వీనర్‌ నాగేల్లి సాంబయ్య, బత్తుల రమేష్‌, అక్రమ్‌, దండు రమేష్‌, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అజయ్‌, నాగ ప్రసాద్‌, గోపు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement