ఇక్కడ్నే ఖర్చుచేయాలే | Sakshi
Sakshi News home page

ఇక్కడ్నే ఖర్చుచేయాలే

Published Fri, Oct 27 2023 6:46 AM

 ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చావేదికలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు - Sakshi

హామీలతో మభ్యపెట్టవద్దు

మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ మాదిరిగా సింగరేణి కార్మికులకు అన్ని పార్టీలు డిక్లరేషన్‌ ప్రకటించాలి. తమ తమ మేనిఫెస్టోల్లో కార్మికుల సమస్యలను చేర్చాలి. ఓట్ల కోసం హామీలతో మభ్యపెట్టవద్దు. డిమాండ్స్‌పై స్పష్టత లేకపోతే నోటాకే ఓటు.

– రియాజ్‌ అహ్మద్‌, హెచ్‌ఎంఎస్‌

వయోపరిమితి పెంచాలి

సింగరేణి కార్మికుల సంఖ్య 1.16 లక్షల నుంచి 39 వేలకు పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కొత్తగా ఇచ్చామంటున్న ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి? రెండు పేర్లతో పనిచేస్తున్నావారి సమస్య పరిష్కరించాలి. వారసత్వ ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంచాలి.

– కె.విశ్వానాథ్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

2, 3 నెలల జీతం పన్నుకే

తెలంగాణ ఉద్యమ సమయంలో పాలక పార్టీ 50 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తాం, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తాం, బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పి, మరిచింది. 2, 3 నెలల జీతం ఆదాయ పన్నుకే పోతోంది.

– టి.శ్రీనివాస్‌,

ఐఎఫ్‌టీయూ ఆలిండియా ప్రధాన కార్యదర్శి

చట్ట సవరణ చేయాలి

ప్రధాని మోదీ సింగరేణిని కార్పొరేట్‌ కంపెనీలపరం చేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ బొగ్గు గనులకు జాతీయం చేయడంతో సుమారు 6 లక్షల మంది కార్మికులకు లాభం చేకూరింది. ఆదాయ పన్ను మాఫీ లేదా స్లాబ్‌ పెంపు అమలుకు చట్టసవరణ చేయాలి.

– జనక్‌ప్రసాద్‌, సెక్రటరీ జనరల్‌, ఐఎన్‌టీయూసీ

రాజకీయ జోక్యం పెరిగింది

సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది. కార్మిక సంఘాల ఉనికి పూర్తిగా తగ్గిపోయింది. మారుపేర్ల మార్పు రెగ్యులరైజ్‌ చేయాలి. కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలి. నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలి.

– వాసిరెడ్డి సీతారామయ్య,

ఏఐటీయూసీ అధ్యక్షుడు

బినామీ పేర్లను సవరించాలి

సింగరేణిలో బినామీ పేర్లతో పని చేస్తున్న కార్మికుల పేర్లను సవరించాలి. గోదావరితీరంలో ఉన్నా స్వచ్ఛమైన తాగు నీరందక కార్మిక కుటుంబాలు ఆస్పత్రుల పాలవుతున్నాయి. కార్మికులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, కార్పొరేట్‌ వైద్యం అందించాలి.

– తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement