ఇది విన్నారా..!

20 Nov, 2023 10:54 IST|Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు తదనంతరం జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయి. 25 జనవరి 1950న భారత ఎన్నికల కమిషన్‌ ఏర్పాటైంది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. 25 జనవరి 2011న తొలి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించగా అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ఎన్నికల సంఘం 2004 నుంచి నిషేధించింది. ఎన్నికల అనంతరం సర్వేలను పోస్ట్‌ పోల్‌ సర్వేగా పరిగణిస్తారు.

► ఓటరు గుర్తింపు కార్డులను 1993లో ప్రవేశపెట్టారు. అప్పటి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ టి.ఎన్‌. శేషన్‌ దీనికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రం మొదటి ఎన్నికల కమిషనర్‌గా వి.నాగిరెడ్డి సేవలందించగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా 2013లో మొదటిసారిగా తిరస్కరించే ఓటు (నోటా) ప్రవేశపెట్టారు.

► ఎన్నికల్లో తొలిసారిగా ఓటింగ్‌ యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించిన రాష్ట్రం గోవా. 1999లో ఉపయో గించారు. ఓటింగ్‌ యంత్రాలలో వీవీప్యాట్‌లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2013లో సూచించింది. నోటా ఆప్షన్‌ మొదటిసారిగా 2013లో దిల్లీ, ఛత్తీస్గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు.

మరిన్ని వార్తలు