మునుగోడు నియోజకవర్గ చరిత్రను ఎవరు తిరగరాస్తారు..? | Sakshi
Sakshi News home page

మునుగోడు నియోజకవర్గ చరిత్రను ఎవరు తిరగరాస్తారు..?

Published Wed, Aug 9 2023 1:41 PM

Who Will Rewrite The History Of Munugodu Constituency - Sakshi

మునుగోడు నియోజకవర్గం

మునుగోడులో కాంగ్రెస్‌ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విజయం సాదించారు. 2009లో  ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్‌ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్‌ అభ్యర్ది  కె. ప్రభాకరరెడ్డిపై 22552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్‌రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి.

రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో  టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో  పాల్వాయి గోవర్దనరెడ్డి  పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో  ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో  ఓటమి తర్వాత కాంగ్రెస్‌ ఐ  పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది.

2014లో కాంగ్రెస్‌ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్‌ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు, పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు.

ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు.ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో   కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్‌ఎస్‌ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు.

మునుగోడు నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement
Advertisement