మంచిర్యాల: పత్యర్థులపై వ్యూహాస్రాలు.. గెలుపు ధీమాతో పార్టీలు! | Sakshi
Sakshi News home page

మంచిర్యాల: పత్యర్థులపై వ్యూహాస్రాలు.. గెలుపు ధీమాతో పార్టీలు!

Published Fri, Aug 25 2023 5:05 PM

Adilabad: Who Will Be Next Incumbent In Mancherial Constituency - Sakshi

ఆ ఎమ్మెల్యే వైఫల్యాల రాజు.. ప్రగతిని పరుగులు పెట్టించలేదని సోంత పార్టీ  నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావును మార్చాలంటున్నారు. మార్చకపోతే మునగడం ఖాయమంటున్నారు. అయినా అధిష్టానం మళ్లీ ఆయనకే టికెట్‌ కట్టబెట్టింది. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్న దివాకర్‌కు కేసీఆర్‌ ఏ ధీమాతో టికెట్‌ ఇచ్చారో అర్థం కాని విషయం అంటున్నారు. మరి మంచిర్యాలలో బీఅర్ఎస్ కోటలకు బీటలు  పారుతుందా? కాంగ్రెస్‌ జెండా  ఎగురడం ఖాయమైందా?మాజీ ఎమ్మెల్సీ  ప్రేమ్ సాగర్  రావు గుండా గండమే కాంగ్రెస్‌కుకు గండంగామారిందా? సింగరేణి  సమరంలో  కమలం సత్తా చాటుతుందా? మంచిర్యాల ఎన్నికల యుద్దంపై సాక్షి స్పేషల్ రిపోర్ట్.

మంచిర్యాల  నియోజకవర్గం అపారమైనా  నల్లబంగారం  నిల్వలు ఉన్నా ప్రాంతం. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉపాదినిస్తోంది. అలాంటి నియోజకవర్గంలో   మంచిర్యాల, హజీపూర్, నస్పూర్, దండేపల్లి, లక్షిట్పెట మండలాలు  ఉన్నాయి. ఇక్కడ 2,46,982 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో పేరుక సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ. మిగితా కులాల్లో మున్నూరు, ఎస్సీ, యాదవ, గౌడ, పద్మశాలి, సింగరేణి ఓటర్లు ఉన్నారు. పేరుక సామాజిక, సింగరేణి కార్మికుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. అయితే గులాబి పార్టీకి మంచిర్యాల కంచుకోట. ఉద్యమకాలం నుండి ఇప్పటి వరకు కార్మికులు పార్టీకి అండగా నిలుస్తున్నారు.

 తెలంగాణ రాకముందు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అరవింద్ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. తెలంగాణ అవతరణ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో  రెండుసార్లు బీఅర్ఎస్ అభ్యర్థి  దివాకర్ రావు విజయం సాధించారు. 2014, 2018 అసెంబ్లీ  ఎన్నికలలో ఎమ్మెల్యే దివాకర్ రావు విజయం సాదించారు. 2018 ఎన్నికలలో దివాకర్ రావు 75,360 ఓట్లు  సాదించి 45 శాతం ఓట్లు సాదించారు. ప్రేమ్ సాగర్‌ రావుపై 4,848 ఓట్ల తేడాతో ఓటమి నుండి ఓడ్డేకారు దివాకర్ రావు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్  సాగర్ రావు 70,512 ఓట్లతో 42 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునాథ రావు 5018 ఓట్లతో మూడు శాతం ఓట్లు సాదించారు. డిపాజిట్ కోల్పోయారు. 

దివాకర్ రావు అంతకు ముందు రెండుసార్లు విజయం సాధించారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత  రోడ్లు, త్రాగునీటి వసతి, జిల్లా కేంద్రంలో మెడికల్ కళశాల సాధించారు. అదే విధంగా నూతన కలెక్టర్ కార్యాలయం పనులు చేసేలా చోరవ చూపారు. జిల్లా అసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేట్ మార్కెట్  నిర్మాణ పనులు ప్రారంభించారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించారు. 

అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రగతిని పరుగులు పెట్టించలేదని అపవాదును ఎదుర్కోంటున్నారు. మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నా పట్టణం. కానీ అభివృద్ధి లేదు. గోదావరి ప్రక్కన ఉన్నా వేసవి వచ్చిందంటే నీటి కోరతతో కొన్ని కాలనివాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాతశిశు ఆసుపత్రి గోదావరి తీరంలో నిర్మించడం వల్ల వర్ష కాలంలో నీటిలో మునిగిపోయింది. పట్టణానికి దూరంగా నిర్మించడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గూడేం ఎత్తిపోతల పథకం నిర్వహణ అద్వానంగా మారింది. నీరందించే పైపులు పగిలిపోతున్నాయి. దాంతో చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మర్మమత్తుల ఎమ్మెల్యే సకాలంలో స్పందించలేదని  రైతులు  అసంతృప్తితో రగిలిపోతున్నారట.     

అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఏకంగా రోడ్లు వేయని ఎమ్మెల్యే మా గ్రామాలకు, కాలనిలకు రావద్దని లక్షిట్‌పెపెట్, ఇతర ప్రాంతాల్లో ప్రజలు ప్లేక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తమను ఓట్లు అడగవద్దంటున్నారు. ఇవన్ని  ఒక ఎత్తయితే మంచిర్యాల ప్రాంతంలో   సింగరేణి, సర్కార్ భూములు బీఅర్ఎస్ నాయకులు లూటీ చేశారనే అరోపణలు ఉన్నాయి. పైగా భూముల లూటీల దందాలో ఎమ్మెల్యే పాత్ర ఉందని కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఆరోపణలు సందిస్తుండటం విశేషం.

రాబోయే ఎన్నికల్లో బీఅర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు అయితే ప్రతికూల ఫలితం తప్పదని సర్వేలో తెలిందని పార్టీ వర్గాలంటున్నాయి. కానీ మరోసారి ఆయనకే టికెట్‌ రావడంతో ముధోల్‌లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ప్రత్యర్థులు. గత అసెంబ్లీ ఎన్నికలలో దివాకర్ రావు కేవలం 4848 ఓట్లతో  ప్రేమ్  సాగర్  రావును ఓడించారు. దాంతో ఈసారి ఎన్నికలలో ఎమ్మెల్యేపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేమ్ సాగర్‌రావు కసితో ఉన్నారు. ప్రజల్లో దివాకర్  రావుపై  వ్యతిరేకత పెరగడం,  రుణమాఫి,  సింగరేణి కార్మికులకు బీఆర్‌ఎస్‌ ఇచ్చిన మీలు నేరవేర్చకపోవడం ఇలాంటి ఆంశాలు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు. పార్టీకి ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఈసారి ఆరునూరైనా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ప్రేమ్‌ సాగర్‌రావు తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. కానీ కొందరు ప్రేమ్ సాగర్ కంటే ఆయన భార్య సురేఖ గెలిచే అభ్యర్థిగా అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎన్నికలలో తానే పోటీచేస్తానంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. అయితే బీఅర్ఎస్ మాత్రం ప్రేమ్ సాగర్ గెలిస్తె మంచిర్యాలలో రౌడి రాజ్యం వస్తుందని ప్రచారం చేస్తోంది. 

ఆయనపై  ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా వ్యూహాలు రచిస్తోంది. గులాబీ పార్టీ గత ఎన్నికల మాదిరిగా మళ్లీ అదే అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇక బీఅర్ఎస్ తనపై వేసిన రౌడి ముద్రను ప్రేమ్‌ సాగర్‌ రావు కొట్టిపారేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామంటున్నారు. ఇక నియోజకవర్గంలో కమలం  పార్టీ   పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రఘునాథ రావు‍కు 5వేల ఓట్లు  మించలేదు. ఇప్పుడు కూడా  అదే విధంగా ఉంది పార్టీ బలం. కానీ ఈసారి పార్టీ అభ్యర్థిని మార్చి సత్తా చాటుతామంటున్నారు కమలం పార్టీ నాయకులు. మూడు పార్టీలు మంచిర్యాలపై జెండాను ఎగురవేస్తామంటున్నారు. మరి ముధోల్‌లో ఏ పార్టీ  జెండా ఎగురుతుందో చూడాలి.

Advertisement
Advertisement