Sakshi News home page

వాళ్లకు బెయిలు.. మాకు జైలు

Published Sat, Feb 12 2022 8:55 AM

Akhilesh Yadav Slams BJP As Ministers Son Gets Bail - Sakshi

ఓటమి భయంతో సాకులు..
ఉత్తరప్రదేశ్‌లో కాషాయ జెండా ఎగురుతుందని గురువారం నాటి తొలి దశ పోలింగ్‌ తర్వాత అందరికీ అర్థమైంది. అందుకే కుటుంబ పార్టీలకు వెన్నులో వణుకు మొదలైంది. తమ పని అయిపోయిందన్న భయంతోనే ఎన్నికల కమిషన్‌ను, ఓటింగ్‌ మిషన్లను తప్పు పడుతున్నారు. 
– ప్రధాని నరేంద్ర మోదీ (కస్‌గంజ్, ఉత్తరప్రదేశ్‌) 

మోదీకి చరిత్ర తెలియదు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చరిత్రపై అవగాహన లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలీదు. అందుకే పోర్చుగీస్‌ పాలన నుంచి గోవా విముక్తికి 15 ఏళ్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్‌ను ఆడిపోసుకున్నారు.స్వాతంత్య్ర సమరయోధులు, విద్యావేత్తల కంటే ప్రధానికి ఎక్కువ తెలుసా?  పర్యావరణం, నిరుద్యోగం వంటి అంశాల నుంచి గోవా ప్రజల దృష్టి మళ్లించడానికే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
– కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌     గాంధీ (మార్గోవా, గోవా ) 

మేం గన్నా అంటే.. వారు జిన్నా అంటారు
ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ తమ కుటుంబాల కోసమే జీవిస్తున్నాయి. మేము జాతీయవాదం మాట్లాడితే వాళ్లు కులాల ప్రస్తావన తెస్తారు. మేము అభివృద్ధి అంటే మతం ఊసెత్తుతారు.  నేను గన్నా (చెరుకు)పై మాట్లాడితే జిన్నా గురించి మాట్లాడతారు. 
– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌(షాజహన్‌పూర్, ఉత్తరప్రదేశ్‌) 

వాళ్లకు బెయిలు.. మాకు జైలు
ఈ రాష్ట్రంలో రైతుల మీదకి కారు పోనిచ్చి నిండు ప్రాణాలు తీసిన వారికి బెయిల్‌ వస్తుంది. కానీ మా పార్టీలో చిన్న చిన్న నేరాలు చేసిన వారు కూడా జైల్లోనే ఉంటారు. మా పార్టీ ఎంపీ ఆజమ్‌ ఖాన్‌ను గేదెలు, మేకలు, పుస్తకాల చోరి ఆరోపణలపై జైల్లో పెట్టి ఇంకా బెయిలివ్వలేదు.    
– ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ (రామ్‌పూర్, ఉత్తరప్రదేశ్‌) 

Advertisement

తప్పక చదవండి

Advertisement