Top Stories
ప్రధాన వార్తలు
రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్‌ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలిసిన ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.హోం మంత్రి స్పందనటీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
విమాన సేవలందిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 70కి పైగా సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. సిబ్బంది అనారోగ్యంతో ఉండడమే ఇందుకు కారణమని చెప్పింది. రద్దైన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి. దాంతో ఉన్న సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పౌర విమానయాన అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.సిబ్బంది అనారోగ్యంగా ఉన్నారని దాంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సంస్థ తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించింది. ‘మా క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు చివరి నిమిషంలో ఏకకాలంలో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు మూకుమ్మడిగా ‘సిక్‌లీవ్’ దరఖాస్తులు అందాయి. దాంతో మంగళవారం రాత్రి నుంచి కొన్నివిమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరికొన్నింటిని రద్దు చేశాం. ఈ సంఘటనకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి మేము సిబ్బందితో మాట్లాడుతున్నాం. ఊహించని పరిణామం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తే క్షమాపణలు కోరుతున్నాం. ఇకపై చేసే ప్రయాణాలకు సంబంధించి సదరు సర్వీసు అందుబాటులో ఉందో లేదో సరిచూసుకోవాలి కోరుతున్నాం’ అని తెలిపింది.ఇదీ చదవండి: ట్రేడింగ్ వేళల పెంపునకు నో చెప్పిన సెబీరద్దు అయిన విమానసర్వీసుల టికెట్ డబ్బులు వాపసు చేస్తామని.. లేదంటే మరోతేదీకి రీషెడ్యుల్ చేసుకునే వీలుందని కంపెనీ పేర్కొంది. More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources— ANI (@ANI) May 8, 2024
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 07:00 AM, May 8th, 2024గాజువాక రోడ్‌షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం
CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆయనకే చెల్లు జగన్‌లోని పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం సాక్షి ఇంటర్వ్యూలో సినీనటి, యాంకర్ శ్యామల ‘వైఎస్సార్సీపీ నవరత్నాలు అమలు సాధ్యమేనా అన్న నోళ్లు మూతపడేలా అమలు చేసి చూపించారు సీఎం జగన్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరికీ ఓ లెసన్. ‘జగన్ గెలుపు అంటే జనం గెలుపు’ అన్నది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది’ అని సినీనటి, ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్యామల అన్నారు. కొంత కాలంగా వైఎస్ జగన్‌కు మద్దతుదారుగా ఉన్న ఆమె ఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ తరఫున చురుకుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. జగన్‌పై తనకు అభిమానం కలగడానికి కారణాలను... తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని ఆమె తెలియజేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...వైఎస్ అంటే ఇష్టం.. జగన్‌పై అభిమానం... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం సమీపంలోని ఇంద్రపాలెం మాది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నాకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. ఎదుగుతున్న సమయంలో లీడర్స్ చేపట్టే పనులు మన మీద చాలా ప్రభావం చూపుతాయి కదా. అలా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పటి నుంచీ వైఎస్ అంటే నాకు చాలా ఇష్టం. కట్టు బొట్టు నుంచి ఆయన ఆహార్యం దాకా అన్నీ గమనిస్తుండేదాన్ని. ఆయన హుందాతనం, మందహాసం బాగా నచ్చేవి. కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చేసిన తర్వాత.. వైఎస్సార్ మరణించిన సమయంలో ఉప్పల్‌లో ఓ ప్రైవేట్ చానల్లో పనిచేస్తున్నాను. ఎంతగానో బాధనిపించినా... ఆ సమయంలో ఎటూ కదలడానికి వీలు కాలేదు. వైఎస్ మరణం తర్వాత జగన్‌ను బాగా గమనిస్తూ ఉండేదాన్ని, ఆయన చేసిన పోరాటం, అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన వేసిన అడుగులు చూశాక ఆయనపైనా కొండంత అభిమానం కలిగింది. నా భర్త కూడా జగన్ అభిమాని కావడంతో... ఆయన్ను స్వయంగా కలవడం, ఆయన చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా ధరించడం జరిగిపోయాయి. హామీల ఆమల్లో ఆయనకు ఆయనే సాటి ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి? ప్రజలకు ఆపద వస్తే ఎలా స్పందించాలి? ఇలాంటివన్నీ జగన్‌ను చూసి నేర్చుకోవాలి. అందుకే భవిష్యత్తు రాజకీయ నేతలకు ఆయన పాలన ఒక పాఠం అంటాను నేను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మొదట్లో విని... బాబోయ్ ఇన్ని పథకాలా? ఎలా ఇస్తారో అని భయపడిన మాట నిజం. కాని అవి పక్కాగా అందించడానికి గ్రామ వలంటీర్ పేరిట ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే ఫిర్యాదు చేసిన 10–20 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయిపోయేలా పక్కాగా నిర్వహించడం అద్భుతం అనిపించింది.కోవిడ్ సవాల్‌నూసమర్థంగా ఎదుర్కొని... ప్రపంచమే బిత్తరపోయిన సంక్షోభం కోవిడ్. మహామహులే ఆ సమయంలో చేతులెత్తేశారు. అలాంటిది ఒక కొత్త సీఎం, అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన ఈ చాలెంజ్ ఎదురైనా.. జగన్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా రెండు వేవ్స్‌నూ సమర్థంగా ఎదుర్కొన్నా రు. అందుకే నేను ఫిదా అయ్యా. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోని ప్రజల్ని కలిసినప్పుడు వారు చెబుతున్నదీ అదే. ‘కోవిడ్ టైమ్‌లో సొంత వారు కూడా మా మొహం చూడలేదమ్మా.. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతీదీ మా చేతికి అందించింది’ అని.జగన్ గురించి తెలుసుకున్న కొద్దీ సంతోషం మా సొంత ఊరితో పాటు మా అత్తగారి ఊరు చీరాలకు రాకపోకలు సాగించినప్పుడు, షూటింగ్ కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు... అక్కడి స్థితిగతుల గురించి కనుక్కునేదాన్ని. వీలైనంతమందితో మాట్లాడేదాన్ని. వాళ్లందరి స్పందన తెలుసుకుంటున్న కొద్దీ జగన్ మీద ఇష్టం పెరుగుతూ వచి్చంది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమం నా ఆల్‌ౖ టెమ్ ఫేవరెట్. నేను కాకినాడ ప్రభుత్వ పాఠశాలలో చదువు కున్నా. ఆ స్కూల్లో 7వ తరగతి వరకూ అసలు ఇంగ్లిష్ మీడియం ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్, సాక్స్... ఇవన్నీ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇటీవల ఒక ప్రభుత్వ పాఠశాల విద్యారి్థని జగన్ ముందు అద్భుతమైన ఇంగ్లిష్ లో మాట్లాడితే షాక్ అయిపోయా. ఆ భాషా పరిజ్ఞానం నాకు కూడా లేదు. కేవలం రాజకీయాల కోసం ఓ పాపను దారుణంగా ట్రోల్ చేయడం దారుణం.అవకాశాలు పోతాయని వారించినా...అయితే నేను ఇంకా సినీ–టీవీ కెరీర్ ప్రారంభంలోనే ఉండడంతో పార్టీ మనిషిగా ముద్ర వేసుకోవడం మంచిది కాదంటూ చాలా మంది హెచ్చరించారు. నిజానికి ఇప్పటికీ చాలా మంది అలాగే చెబుతుంటారు. అయితే ఏదో రాజకీయ పారీ్టలో ఉన్నానని ఒక క్యారెక్టర్‌కి నేను సరిపోతానని తెలిసినా పిలవకుండా ఉంటారా? అలా జరగదని నా నమ్మకం. ఇప్పటివరకూ అలాంటి అనుభవాలు కూడా ఎదురవ్వలేదు. నేను కేవలం టీవీ యాంకర్‌గానే కాకుండా మాచర్ల నియోజకవర్గం, బెంగాల్ టైగర్... తదితర సినిమాల్లో మంచి పాత్రల్లో చేశాను.
యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
2014 నుండి యూనిసెఫ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. ఇద్దరు బిడ్డల తల్లిగా బాల్య అభివృద్ధి, ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో సంస్థకు మద్దతు ఇస్తుంది. తాజాగా యునిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా కపూర్ ఎంపికైంది. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనైంది.కరీనా కపూర్ అనగానే రంగుల ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారం అవుతుంది.అయితే ఈ అందాల నటికి మరో ప్రపంచం కూడా తెలుసు.స్త్రీ సాధికారత నుంచి మెన్స్ట్రువల్ హైజీన్ వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళుతోంది. పేదింటి బిడ్డలతో మాట్లాడుతోంది.తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా నియామకం అయిన కరీనా కపూర్‌లో ఫ్యాషన్ డిజైనర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు...ఉత్తమనటిగా సుపరిచితమైన కరీనా కపూర్ సృజనాత్మకమైన డిజైనర్ కూడా. క్లాతింగ్ రిటైలర్ ‘గ్లోబస్’తో కలిసి పనిచేసింది. న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్‌తో కలిసి తీసుకు వచ్చిన ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకం అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది. కరీనా కపూర్ వాయిస్‌తో ఈ పుస్తకం ఆడియో బుక్‌గా రావడం మరో విశేషం. ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ దివా’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని తీసుకువచ్చింది. అదితి షా బీమ్జానీతో కలసి ప్రెగ్నెన్సీపై రాసిన పుస్తకం కమర్షియల్‌గా సక్సెస్ అయింది. రుజుత దివాకర్‌తో కలిసి న్యూట్రిషన్‌కు సంబంధించి ‘ది ఇండియన్ ఫుడ్ విజ్డమ్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ రైట్’ డాక్యుమెంటరీపై పనిచేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్పై వచ్చిన ‘గర్ల్ రైజింగ్’ అనే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌కు వాయిస్–వోవర్ ఇచ్చింది.ఒకవైపు సినిమాల్లో బిజిగా ఉన్నప్పటికీ... పిల్లల విద్య, మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మహిళలపై హింసను నిరో«ధించడానికి ఎన్డీ టీవి ప్రారంభించిన శక్తి క్యాంపెయిన్‌కు అంబాసిడర్‌గా పనిచేసింది. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. జాల్నా జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంది.నిరుపేద పిల్లల చదువు కోసం షర్మిలా ఠాగుర్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. చైల్డ్–ఫ్రెండ్లీ స్కూల్ అండ్ సిస్టమ్స్ (సీఎఫ్ఎస్ఎస్) యాకేజీని లాంచ్ చేసింది. చత్తీస్‌ఘడ్‌లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వీక్ çసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాగా చదివే పిల్లలు, పాఠాలు బాగా చెప్పే టీచర్లకు పురస్కారాలు అందజేసింది. మెన్స్ట్రువల్ హైజీన్‌పై యూనిసెఫ్ లక్నోలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించింది. ‘నవజాత శిశువులను కాపాడుకుందాం’ పేరుతో కరీనా రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. నవజాత శిశువులు, తల్లుల క్వాలిటీ హెల్త్ కేర్‌కు సంబంధించి ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ అనే క్యాంపెయిన్‌ను నిర్వహించింది. మదర్స్ డే సందర్భంగా యూనిసెఫ్ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కరీనా ప్రధాన వక్త.ప్రకృతి వైపరీత్య బాధితుల కోసం, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల కోసం నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంది కరీన. పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పనిచేసే స్వస్థ్ ఇమ్యునైజేషన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది.తాజా విషయానికి వస్తే.. ‘నేషనల్ అంబాసిడర్‌గా యూనిసెఫ్‌తో నా అనుబంధం కొనసాగడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లల చదువు, హక్కుల కోసం నా గొంతు వినిపిస్తాను’ అంటుంది కరీనా కపూర్.‘కరీనా కపూర్ ఎక్స్లెంట్ కమ్యూనికేటర్’ అని కితాబు ఇచ్చింది యూనిసెఫ్. చిన్న విజయం చాలు... పెద్ద సంతోషానికిసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘నేను ఎలా సాధించానంటే’లాంటి స్టోరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేస్ మొదలైంది. ఆ రేస్‌లో భాగంగా యువతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ రేసులో మెంటల్ హెల్త్ అనేది వెనక్కి వెళ్లిపోయింది. రేస్ అనేది శాంతి, సంతోషాల కోసం ఉండాలి. విద్యార్థులు తమ మానసిక శాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా భావించుకోవాలి. ‘ఇదీ ఒక విజయమేనా!’ అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి నుంచి అశాంతి జనిస్తుంది –కరీనా కపూర్
ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్‌ను చేరుకున్న తొలి భారత క్రికెటర్‌గా శాంసన్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసకున్నాడు. శాంసన్ కేవలం 159 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును సాధించాడు. ఇప్పటివవరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ఎంఎస్ ధోని 165 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024ఓవరాల్‌గా పదో ప్లేయర్ఇక ఐపీఎల్లో ఓవరాల్‌గా 200 సిక్స్‌లు మైలు రాయిని అందుకున్న 10వ ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, సురేష్ రైనా ఉన్నారు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఢిల్లీ ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65) దంచికొట్టారు. He's got power. He's got placement. And he's dealing in sixes in Delhi 💥Sanju Samson on the move & @rajasthanroyals are 67/2 at the end of powerplay 💗Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/PkUUEHj9Zr— IndianPremierLeague (@IPL) May 7, 2024 వీరికి తోడు ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పంత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథాఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 201 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలం కాగా సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. The home side emerge victorious in tonight's run-fest here in Delhi 💥And with that win, Delhi Capitals move to number 5⃣ on the Points Table 🔥🔥Scorecard ▶️ https://t.co/nQ6EWQGoYN#TATAIPL | #DCvRR pic.twitter.com/vQvWMSk5lt— IndianPremierLeague (@IPL) May 7, 2024
నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
పులివెందుల: నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నర్రెడ్డి దంపతులు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవనీ అబద్ధాలేనని తెలిపారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. భార్యాభర్త రోజుకో అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. నర్రెడ్డి బ్రదర్స్ నాటకాలాడుతున్నారని చెప్పారు. వైఎస్ వివేకా రక్తపు వాంతులతో చనిపోయాడని తాను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో చెప్పలేదన్నారు. రూము మొత్తం రక్తపు మరకలున్నాయని, తలపైన గాయం ఉందని, బాడీ మొత్తం రక్తంలో ఉందని, సైడు వాకిలి, బెడ్ రూము వాకిలి తెరచి ఉన్నాయని, ఏసీ ఆన్‌లో ఉందని చెప్పానని తెలిపారు. రక్తపు వాంతులని ఎర్ర గంగిరెడ్డి అనగా, ఇంత రక్తం ఉంటే వాంతులంటావేమిటని తాను ఆయనతో వాదించానన్నారు. అలాంటిది రాజశేఖర్‌రెడ్డికి రక్తపు వాంతులని ఎలా చెబుతానని అన్నారు. అలాగే తాను వైఎస్ వివేకా లెటర్‌ను దాచిపెట్టడానికి ప్రయత్నం చేశానన్నారని, అదీ అబద్ధమేనని తెలిపారు. లెటర్ గురించి తాను రాజశేఖర్‌రెడ్డికి ఫోన్లో చెప్పగా ఆయనే దాచమన్నారని చెప్పారు. పోలీసులతో సమస్య కదా అని తాను అంటే ఆ విషయం ఆయనే చూసుకుంటానని చెప్పారన్నారు.అవినాశ్‌రెడ్డి తనను మేనేజ్ చేశారనడం నిజం కాదన్నారు. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. లెటర్ దాచిపెట్టమని చెప్పిన వారిని కేసులో పెడతారని, కానీ వీరు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి పోలీసులను మేనేజ్ చేసి తనను, మరో అమాయకుడైన ప్రకాష్‌ను కేసులో ఇరికించారన్నారు. తనది చిన్న ప్రాణం కాబట్టి ఇరికించారని, వారి కారణంగా తాను ఉద్యోగానికి 9 నెలలు సస్పెన్షన్‌కు గురయ్యానని, ప్రమోషన్, పాస్‌పోర్ట్ రెన్యువల్ ఆగిపోయాయన్నారు. తాను ఇప్పుడు 20 శాతం విషయాలే చెబుతున్నానని, మరలా మిగిలిన విషయాలు చెబుతానన్నారు.తాను వైఎస్ వివేకా దగ్గర 37 సంవత్సరాలు ఏ జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపారు. వివేకాను తాను చూసుకున్నట్లు వారి ఇంట్లో వారు కూడా చూసుకోలేదన్నారు. వివేకా తన ముందరే ఎన్నోసార్లు వారిని ఛీ కొట్టారని తెలిపారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి వారి బావ వివేకా ద్వారా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అయినా వారిలో ఆశ చావలేదన్నారు. వివేకా రెండో వివాహం కారణంగా వారికి ఆయనతో తీవ్ర మనస్పర్థలు వచ్చాయన్నారు. వివేకా రెండో భార్య షమీమ్ కుమారుడికి ఆస్తులు పోకుండా రాజకీయంగా వివేకా ద్వారా ఎదగాలని విఫలమై ఈ రోజు వేరేవారిపై నిందలు వేస్తున్నారన్నారు. గతంలో డ్రైవర్‌గా దస్తగిరిని తొలగిస్తేనే పులివెందుల వస్తానని వివేకాకు రాజశేఖర్ గట్టిగా చెప్పడంతో ఆయన తొలగించారన్నారు. ఇప్పుడు అదే దస్తగిరిని ముందర పెట్టుకుని వీరు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రామ్‌సింగ్ చెప్పినట్లు వినాలని సునీత బెదిరించారుఓసారి సునీత దంపతులు తనను హైదరాబాద్‌కు పిలిపించుకొని, రామ్‌సింగ్ చెప్పినట్లు వికపోతే కేసులో ఇరుక్కుంటావని బెదిరించారన్నారు. తాను అబద్ధం చెప్పనని కరాఖండిగా చెప్పానన్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి మన మాట వినకపోతే నువ్వు కేసులో ఇరుక్కుంటావని రాజశేఖర్‌తో సునీత అన్నారని చెప్పారు. దీనికి అర్థమేమిటో మీడియా సోదరులే ఆలోచించుకోవాలని అన్నారు. ఎప్పటికైనా ఈ కేసులో రాజశేఖర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు.వారి ముగ్గురు పేర్లు చెప్పాలని రామ్‌సింగ్ కొట్టాడుఢిల్లీలో సీబీఐ అధికారి రామ్‌సింగ్ నెలరోజుల పాటు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడన్నారు. హత్యలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి హస్తం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని తీవ్రంగా కొట్టేవాడన్నారు. ఎంతకీ తాను ఒప్పుకోకపోవడంతో వదిలేశారన్నారు. ఆతర్వాత ఒకరోజు రామ్‌సింగ్ వాట్సప్ కాల్ చేసి తన కుమారుడిని తీసుకొని కడపకు రమ్మని చెప్పాడన్నారు.తామిద్దరం మరుసటిరోజు రామ్‌సింగ్ వద్దకు వెళ్లగా, వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిల హస్తం ఉన్నట్లు చెప్పాలంటూ తన కుమారుడి ఎదుటే కట్టెతో కొట్టాడన్నారు. దస్తగిరి, రంగన్న చెప్పినట్లు విన్నారని, వారిని సేవ్ చేశామని, నువ్వు వినకపోతే కేసులో ఇరికిస్తామని చెప్పాడన్నారు. తన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపిస్తామని బెదిరించాడన్నారు. తాను అబద్ధం చెప్పనని గట్టిగా చెప్పడంతో పంపించేశాడన్నారు. కృష్ణారెడ్డి మాట వినలేదని సునీత దంపతులకు రామ్‌సింగ్ చెప్పగా.. తన కుమారుడితో వివాహం కుదుర్చుకున్న గుంటూరుకు చెందిన మా వియ్యంకుడికి సునీత ఫోన్ చేసి కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయిస్తామని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, వివాహం రద్దు చేసుకోవాలని బెదిరించారని, దీంతో వారు భయపడి వివాహం రద్దు చేసుకున్నారని తెలిపారు.నాకేదైనా జరిగితే వారిదే బాధ్యతతనకు ఇప్పటికీ కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి పేర్లు త్వరలో బయటపెడతానన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు ఏదైనా జరిగితే సునీత, రాజశేఖర్, శివప్రకాష్‌రెడ్డిలే బాధ్యులవుతారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానన్నారు. కేవలం రాజకీయ ఎదుగుదల కోసం సునీత దంపతులు అవినాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.కాగా, హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై కూలిన రిటైనింగ్ వాల్. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలన్నారు. #HyderabadRains #tankbund #Hussainsagar @CoreenaSuares2 @Rajani_Weather super duper rain. #scary pic.twitter.com/2xvWITJ3jt— sαмυεℓ ραυℓ🇮🇳 (@vikramsamuelp) May 7, 2024
రాజమౌళికి వివాదాస్పద ప్రశ్న.. ఆయన ఏమన్నారంటే?
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ యానిమేషన్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే అదే సమయంలో రాజమౌళికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. దానికి తనదైన శైలి ఆన్సరిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఒక హీరోను ఎక్కువగా.. మరొకరిని తక్కువగా చేశారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది..దీనిపై మీరు క్లారిటీ ఇవ్వండి? అంటూ రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. అసలు ఈ ప్రశ్నకు సందర్భమే కాదని కొట్టిపారేశారు. సింపుల్‌గా ఈ ప్రశ్నను తిరస్కరించారు. కాగా.. రాజమౌళి తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా.. మే 17న బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
సినిమా
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాన్నాళ్లు కష్టపడి డైరెక్టర్ అయ్యాడు. హిట్ కొట్టాడు. అలా అటు నటుడిగా ఇటు దర్శకుడిగా అడపాదడపా మూవీస్ చేశాడు. కానీ రెండేళ్ల క్రితం ఓ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఎంతలా అంటే ప్రాంతీయ హీరో కాస్త పాన్ ఇండియా హీరో అయ్యేంతలా. కోట్లాదిమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. మరి ఇంతలా చెప్పాం కదా.. ఇతడు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు రిషభ్ శెట్టి. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాడు. రూ.15 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తీయగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీనిబట్టి ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అయ్యిందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ తీస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ ఉండొచ్చు.రిషభ్ శెట్టి విషయానికొస్తే.. కర్ణాటకలోని కుందాపుర అనే ఊరిలో పుట్టాడు. జూ.ఎన్టీఆర్ అమ్మది కూడా ఈ ఊరే. అందుకేనేమో తారక్ అంటే రిషభ్ శెట్టి చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాడు కూడా. 2012 నుంచి శాండల్ వుడ్లో ఉన్న రిషభ్ శెట్టి.. 'కాంతార' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే.. ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 'కాంతార'తో సంచలన హిట్ కొట్టిన ఇతడు.. ప్రీక్వెల్తో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో?(ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!)
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీ వాళ్లను డీప్ ఫేక్ వదలడం లేదు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్‌ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది.గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.కాగా.. అలియా డీప్‌ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఆమె ఫేస్‌ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. View this post on Instagram A post shared by Unfixface (@unfixface) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)
బుల్లితెర నటికి వేధింపులు.. వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు!
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. స్టార్ నటీమణులు సైతం ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. తాజాగా మరో నటి క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన సంఘటన జరిగింది. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అసభ్యకరమై సందేశాలు పంపించారని కన్నడ నటి అమూల్య గౌడ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారుతనను ఆడిషన్‌కు పిలిచి లైంగిక వేధింపులకు గురి చేసిన సూర్యపై పోలీసులకు నటి ఫిర్యాదు చేసింది . సినిమా పేరుతో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అతన్ని నిలదీస్తే వెళ్లి పోలీసుకు చెప్పుకోమంటూ దారుణంగా మాట్లాడారని నటి తెలిపింది. కాస్టింగ్ డైరెక్టర్ అంటూ పరిచయం చేసుకుని వేధింపులకు గురి చేశాడంటూ వెల్లడించింది. కాగా.. అమూల్య కన్నడతో పాటు తెలుగు సీరియల్స్‌లోనూ నటిస్తోంది. కన్నడ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది.
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
ఐస్‌లా కూల్ లుక్‌తో హాట్ బ్యూటీ అషూరెడ్డిటైట్ ఫిట్ డ్రస్సులో మెంటలెక్కిస్తున్న రితికఓరకంట చూస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన తృప్తి దిమ్రితెగ కష్టపడుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్వంగి మరీ అందాల విందు చేస్తున్న అనన్య పాండేబుక్ చదువుతూ వయ్యారాలు ఒలకబోస్తున్న మాళవిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee)
ఫొటోలు
‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’లో అల్లు అర్జున్ (ఫొటోలు)
ప్రముఖ కంపెనీల రెయిన్బో కలర్ లోగోలు.. (ఫోటోలు)
Venkatesh Election Campaign: ఖమ్మం లో సినీ హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం (ఫొటోలు)
Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
Hyderabad Rain Photos: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
క్రీడలు
విమానం దారి మళ్లింపు... వారణాసిలో కోల్‌కతా జట్టు
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లకు సోమవారం రాత్రి కునుకు లేకుండా గడిచింది. క్రికెటర్లు ప్రయాణించిన విమానం లక్నో నుంచి కోల్‌కతాకు బయలుదేరాల్సి ఉండగా... ప్రతికూల వాతావరణంతో పలుమార్లు దారి మళ్లించారు. వారి చార్టర్ ఫ్లయిట్‌ను తొలుత గువాహటికి మళ్లించారు. అక్కడి నుంచి కోల్‌కతాకు క్లియరెన్స్ రావడంతో టేకాఫ్ అయిన విమానానికి మళ్లీ వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. దీంతో ఉన్నపళంగా ఫ్లయిట్‌ను వారణాసి ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించాల్సి వచి్చంది. అలా తీవ్రమైన ప్రయాణ బడలిక, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఆటగాళ్లు సోమవారమంతా వారణాసిలోని హోటల్లో గడపాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ విమాన ప్రయాణం ఉండటంతో ఈలోపు కోల్‌కతా జట్టు క్రికెటర్లు వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తర్వాత నైట్‌రైడర్స్ జట్టు కోల్‌కతాకు చేరుకోగలిగింది. ఈ నెల 11న సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది.
ఢిల్లీ రేసులోకొచ్చింది!
న్యూఢిల్లీ: జోరుమీదున్న రాజస్తాన్ రాయల్స్‌పై కీలకమైన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో పడింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ పోరులో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (20 బంతుల్లో 50; 7 ఫోర్లు; 3 సిక్స్‌లు), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓడింది. కెపె్టన్ సంజూ సామ్సన్ (46 బంతుల్లో 86; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. ఖలీల్, ముకేశ్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ తలా 2 వికెట్లు తీశారు. 4,4,4,6,4,6... ఓపెనర్లు ఫ్రేజర్, పోరెల్ ఒకరి తర్వాత ఒకరు రాయల్స్ బౌలర్లను చితగ్గొట్టారు. ముందుగా ఫ్రేజర్... బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఒక సిక్స్, 2 బౌండరీలతో 15 పరుగులు రాబట్టాడు. అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 4, 4, 4, 6, 4, 6లతో 28 పరుగులు పిండుకోవడంతో ఫ్రేజర్ ఫిఫ్టీ 19 బంతుల్లోనే పూర్తయ్యింది. అతని దూకుడును అశ్విన్ తన తొలి ఓవర్లోనే అడ్డుకున్నాడు. అనంతరం అక్షర్ పటేల్ అండతో పోరెల్ బాదడం మొదలుపెట్టాడు. 9వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మరుసటి ఓవర్లోనే అక్షర్ (15)ను అశ్విన్ బోల్తా కొట్టించగా, పోరెల్ సిక్సర్‌తో 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వరుస ఓవర్లలో పోరెల్‌ను అశ్విన్... రిషభ్ పంత్ (15)ను చహల్ పెవిలియన్ పంపారు. మిడిలార్డర్లో స్టబ్స్ (20 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. కెప్టెన్ పోరాడినా... క్లిష్టమైన లక్ష్యం ముందరుంటే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), బట్లర్ (19) గట్టి పునాది వేయలేకపోయారు. ఈ దశలో కెపె్టన్ సామ్సన్, రియాన్ పరాగ్ (22 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అండతో రాయల్స్‌ను నడిపించాడు. 11వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు దాటాక అదే ఓవర్ ఆఖరి బంతికి పరాగ్‌ను రసిఖ్ బౌల్డ్ చేశాడు. అయితే శుభమ్ దూబే వచ్చాక సామ్సన్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సామ్సన్ను ముకేశ్ అవుట్ చేయడం రాజస్తాన్‌ను కుదిపేసింది. శుభమ్‌తో నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించాక భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్సన్ నిష్క్రమించగా... తర్వాత ఓవర్‌కు ఒకటి, రెండు చొప్పున వికెట్లను కోల్పోయిన రాయల్స్ ఓటమి పాలైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: ఫ్రేజర్ (సి) ఫెరీరా (బి) అశ్విన్ 50; పోరెల్ (సి) సందీప్ (బి) అశ్విన్ 65; షై హోప్ (రనౌట్) 1; అక్షర్ (సి) పరాగ్ (బి) అశ్విన్ 15; పంత్ (సి) బౌల్ట్ (బి) చహల్ 15; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 41; గుల్బదిన్ (సి) అశ్విన్ (బి) బౌల్ట్ 19; రసిఖ్ (రనౌట్) 9; కుల్దీప్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–60, 2–68, 3–110, 4–144, 5–150, 6–195, 7–215, 8–221. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–1, సందీప్ శర్మ 4–0–42–1, అవేశ్ 2–0–42–0, అశి్వన్ 4–0–24–3, పరాగ్ 2–0–17–0, చహల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అక్షర్ (బి) ఖలీల్ 4; బట్లర్ (బి) అక్షర్ 19; సామ్సన్ (సి) హోప్ (బి) ముకేశ్ 86; పరాగ్ (బి) రసిఖ్ 27; శుభమ్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 25; పావెల్ (బి) ముకేశ్ 13; ఫెరీరా (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 1; అశి్వన్ (సి) హోప్ (బి) కుల్దీప్ 2; బౌల్ట్ (నాటౌట్) 2; అవేశ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–4, 2–67, 3–103, 4–162, 5–180, 6–181, 7–185, 8–194. బౌలింగ్: ఖలీల్ 4–0–47–2, ఇషాంత్ 3–0–34–0, ముకేశ్ 3–0–30–2, అక్షర్ 3–0–25 –1, కుల్దీప్ 4–0–25–2, రసిఖ్ 3–0–36–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నో వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
అర్జెంటీనా దివంగత దిగ్గజ ఫుట్‌బాలర్ డీగో మారడోనా 1986లో గెల్చుకున్న ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీ వేలానికి రానుంది. జూన్ 6వ తేదీన పారిస్‌లోని అగుటెస్ ఆక్షన్ హౌజ్‌లో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ వేలం జరుగుతుందని, దీనికి కనీస ధరను ఇంకా నిర్ణయించలేదని వేలం నిర్వాహకులు తెలిపారు. మెక్సికో ఆతిథ్యమిచ్చిన 1986 ప్రపంచకప్ లో మారడోనా సారథ్యంలో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోరీ్నలో మారడోనా ఐదు గోల్స్ చేయడంతోపాటు ఉత్తమ ప్లేయర్‌కు అందించే ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీని సాధించాడు.
భారత బాక్సర్ల పసిడి పంచ్
అస్తానా (కజకిస్తాన్): ఆసియా అండర్–22 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), పూనమ్ పూనియా (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు)... విశ్వనాథ్ సురేశ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్ఖా (60 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.ఫైనల్స్‌లో ప్రీతి 3–0తో బజరోవా ఎలీనా (కజకిస్తాన్)పై, పూనమ్ 4–1తో సకిష్ అనెల్ (కజకిస్తాన్)పై, ప్రాచి 4–1తో అనర్ తుసిన్బెక్ (కజకిస్తాన్)పై, ముస్కాన్ 3–2తో జకిరోవా అజీజియా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచారు.విశ్వనాథ్ సురేశ్ 5–0తో కరాప్ యెర్నర్ (కజకిస్తాన్)పై, సబీర్ యెర్బోలత్ (కజకిస్తాన్)పై నిఖిల్, ఆకాశ్ 4–1తో రుస్లాన్ (కజకిస్తాన్)పై విజయం సాధించారు. ఓవరాల్‌గా ఆసియా అండర్–22, యూత్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 43 పతకాలు సంపాదించారు.
బిజినెస్
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించినట్లు వెల్లడించింది.దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది.
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
దేశాన్ని విడిచి వెళ్లాలా? అంటూ బెంగళూరు ఇన్ఫ్రా, వాతావారణంపై ఆంత్రప్రెన్యూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బెంగళూరు ఇప్పుడు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొటోంది. ఈ తరుణంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోమో మీడియా కో-ఫౌండర్, క్రియేటీవ్ హెడ్ అనంత్ శర్మ బెంగళూరు నగరంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వాతావరణం, నీటి సమస్యపై ఎక్స్ వేదికపై అనంత్ శర్మ స్పందించారు. శర్మ తాను ముంబై లేదా పూణే షిఫ్ట్ అవ్వడం మంచిదా లేకా దేశం విడిచిపెట్టి వెళ్లడం మంచిదా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Bangalore looks like it's gonna go to the dogs in another 5 years with bad infra bad weather and bad water. Is Mumbai or Pune worth shifting to or should I just leave India?— Anant (@AnantNoFilter) May 3, 2024‘బాడ్ ఇన్ఫ్రా, బ్యాడ్ వెదర్, బ్యాడ్ వాటర్. నేను ముంబై లేదా పూణేకు షిఫ్ట్ అవ్వాలా? లేదా? దేశం విడిచి వెళ్లాలా? అంటూ నెటిజన్ల అభిప్రాయాల్ని కోరారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎక్కువ మంది నెటిజన్లు తన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మరో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వండి అంటూ సలహా ఇస్తే.. మరికొందరు మాత్రం బెంగళూరులో సానుకూల అంశాలను చర్చించారు. మీకు ఆర్థిక స్థోమత ఉంటే వదిలేయండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. బెంగుళూరుతో ఉన్న వ్యవస్థాగత సమస్య ఏమిటంటే ప్రజలు దీనిని వలస నగరంగా భావించడం. ఓటు బ్యాంకుగా మారితే తప్ప నగరాన్ని మార్చాలని ఎవరూ కోరుకోరని నిట్టూర్చాడు.
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఆంద్రప్రదేశ్ 'బ్లూ ఎకానమీ' (ఓషన్ ఎకానమీ)లో కూడా ఓ కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కోస్తాంధ్రలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఓడరేవు, ఫిష్ ల్యాండర్లు, ఫిషింగ్ హోరోబర్‌లలో ఏదో ఒకదాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీపై దృష్టి సారించింది. ఇప్పటికే వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం 4 కొత్త ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించింది. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఎక్కడ నిర్మించారు. వాటికైన ఖర్చు వివరాలు కింద గమనించవచ్చు.ఓడరేవులురామాయపట్నం పోర్టు: రూ. 3,736.14 కోట్లుమచిలీపట్నం పోర్టు: రూ. 5,115.73 కోట్లుమూలపేట పోర్టు: రూ. 4,361.91 కోట్లుకాకినాడ గేట్‌వే పోర్ట్: రూ. 2,123.43 కోట్లుఫిషింగ్ హార్బర్లుజువ్వాలదిన్నె: రూ. 288.80 కోట్లునిజాంపట్నం: రూ. 451 కోట్లుమచిలీపట్నం: రూ. 422 కోట్లుఉప్పాడ: రూ. 361 కోట్లుబుడగట్లపాలెం: రూ. 365.81 కోట్లుపూడిమడక: రూ. 392.53 కోట్లుబియ్యపుతిప్ప: రూ. 428.43 కోట్లువొడరేవు: రూ. 417.55 కోట్లుకొత్తపట్నం: రూ. 392.45 కోట్లుమంచినీళ్లపేట: అప్గ్రేడేషన్ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలుచింతపల్లి: రూ. 23.74 కోట్లుభీమిలి: రూ. 24.86 కోట్లురాజయ్యపేట: రూ. 24.73 కోట్లుదొండవాక: రూ. 23.90 కోట్లుఉప్పలంక: రూ. 5.74 కోట్లురాయదరువు: రూ. 23.90 కోట్లువైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ఈ కేంద్రాల వల్ల ఎంతోమంది ఉపాధి పొందగలిగారు. పోర్ట్‌లు ద్వారా 75000 కంటే ఎక్కువమంది ఉపాధి పొందారు. ఫిషింగ్ హార్బర్ల ద్వారా 65000 కంటే ఎక్కువ, ఫిష్ ల్యాండర్ల ద్వారా 39000 కంటే ఎక్కువమంది ఉపాధి అవకాశాలను పొందగలిగారు.ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతులు కూడా పెరిగాయి. ఎగుమతుల్లో 12వ సంఖ్య దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ కేంద్రాల నిర్మాణం తరువాత ఆరో స్థానానికి చేరింది. 2014-19లో ఎగుమతుల విలువ రూ. 90829 కోట్లు, కాగా 2019-23 మధ్య రూ. 159368 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బ్లూ ఎకానమీలో రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు సూపర్‌చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్‌గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. తమకు అందిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను లింక్డిన్లో షేర్ చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్‌చార్జింగ్ టీమ్‌లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది.
వీడియోలు
బాచుపల్లిలో ఘోర ప్రమాదం
మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..
నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్
సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..
టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్
ఆంధ్రా అతలాకుతలం..
విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..
ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
ఫ్యామిలీ
ఉండాల్సింది ధైర్యం మాత్రమే!
ప్రపంచంలో చాలామంది ఒకే తరహా పనిని ఏళ్లుగా చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కొందరు మాత్రం ఏకకాలంలో ఎన్నో పనులు చేస్తూ సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ఇందు గుర్జార్. జైపూర్‌వాసి అయిన 32 ఏళ్ల ఇందు గుర్జార్ సింగిల్ పేరెంట్‌గా తన తొమ్మిదేళ్ల కూతురును చూసుకుంటూ, బ్యాంకు ఉద్యోగం చేస్తూ, అంతర్జాతీయ క్రీడాకారిణిగా, మౌంటెనీర్ బైకర్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. సవాళ్లను అధిగమిస్తూ ఇందు చేస్తున్న ప్రయత్నం ఒడిదొడుకులను ఎదుర్కొనేవారికి స్ఫూర్తిగా నిలుస్తుంది.‘‘సమస్యలు వచ్చేదే మనలోని శక్తిని గుర్తించడానికి. ధైర్యం తెచ్చుకొని ప్రయత్నిస్తే తిరిగి మనకో కొత్త జీవితం ఏర్పడుతుంది. నా చిన్నతనంలో మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. మా నాన్నకు టీ కొట్టు ఉండేది. కానీ, దాని నుంచే ఆయన తన కొడుకులలో ఒకరిని డాక్టర్ని చేసి, మా అందరికీ ఉత్తమవిద్యను అందించడానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. చిన్ననాటి నుంచి క్రీడలంటే చాలా ఆసక్తి. రాష్ట్రస్థాయిలో బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడాను. కాలేజీలో స్పోర్ట్స్ ఆప్షన్ లేక΄ోవడంతో నా ఇష్టాన్ని అక్కడితో వదిలేయాల్సి వచ్చింది. గృహహింస మా కమ్యూనిటీలో అమ్మాయిలకు పెళ్ళిళ్లు త్వరగా చేస్తారు. కానీ, నా తల్లిదండ్రుల సహకారంతో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను. ఆ వెంటనే పెళ్లి చేశారు. పెళ్లి నా జీవితాన్ని విచ్ఛిన్నం చేసింది. బిడ్డను కనాలని, వరకట్నం తేవాలని... ప్రతిరోజూ ఏదో ఒక విషయం మీద నరకం చూసేదాన్ని. అత్తింటివాళ్లు నా తల్లిదండ్రులకు నా మీద ఏవేవో చాడీలు చెప్పేవారు. పాప పుట్టిన తర్వాత పుట్టింటి నుండి తిరిగి అత్తవారింటికి వెళ్లడానికి భయపడ్డాను. కానీ, పెద్దవారిని కూర్చోబెట్టి, ఒప్పించి తిరిగి తీసుకెళ్లారు. కానీ, అక్కడి పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు.నెల రోజుల వ్యవధిలోనే మా అత్తింటిని వదిలి, తిరిగి పుట్టింటికి వచ్చేశాను. ఏడాది కాలం పుట్టింట్లోనే ఉన్నాను. పరిస్థితుల్లో మార్పు రాదని గ్రహించి, విడాకులకు కోర్టులో కేసు వేశాను. ఒంటరిగా బిడ్డను పెంచడం నాకు అంత తేలికైన పనికాదు. ఇంటి నిర్వహణకు, నా ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఇంధనం అవసరం. ఆ మనోవర్తి రూపంలో ఆ ఇంధనం రాబట్టుకోవడం కోసం ఏడేళ్లపాటు విడాకుల కేసుపై పోరాడుతూనే ఉన్నాను. కానీ, న్యాయం జరగలేదు.డిప్రెషన్ నుంచి కోలుకొని... ఆటుపోట్లతో ఉన్న జీవితాన్ని చూసి చాలా బాధపడేదాన్ని. ఒక వ్యక్తి జీవితంలో చెడుకాలం వచ్చినప్పుడు పరిస్థితుల ముందు లొంగిపోతాడు. కానీ, నాకు నేనుగా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలనుకున్నాను. బ్యాంకు ఉద్యోగం సంపాదించుకొని, నాకు నేనుగా జీవించడం మొదలుపెట్టాను.ఫిట్‌గా ఉండేందుకు.. ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే కోవిడ్ వచ్చింది. మొదటి వేవ్‌లో కరోనా బాధితురాలిని అయ్యాను. వాడిన మందుల వల్లనేమో కోవిడ్ తర్వాత బరువు పెరగడం మొదలైంది. దీంతో ఫిట్‌గా ఉండేందుకు రోజూ రెండు–మూడు కిలోమీటర్లు సైక్లింగ్ చేసేదాన్ని. ఆ తర్వాత స్టేడియంకు వెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ సైక్లిస్టుల బృందాన్ని కలిశాను. ఆ క్రీడలో పాల్గొనడానికి వయోపరిమితి ఏమీ లేదని తెలిసింది.దాంతో నాలో చిన్న ఆశ కలిగింది. బహుశా విధి నాకు అలాంటి అవకాశం ఇచ్చింది అనుకున్నాను. మొదట్లో రెండు–మూడు కిలోమీటర్లు సైక్లింగ్ చేసే నేను ఈ రోజు 50– 100 కిలోమీటర్లు తిరుగుతున్నాను. యూసీఐ (ఇంటర్నేషనల్ సైకిలిస్ట్ యూనియన్) ఎలిమినేటర్ ప్రపంచకప్‌లో పాల్గొన్నాను. ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్లలో పాల్గొని, అంతర్జాతీయ సైక్లిస్టులను కలిశాను.పర్వత బైకర్‌గా...వృత్తిరీత్యా బ్యాంకర్గానే కాకుండా మూడేళ్లుగా మౌంటెన్ బైకర్‌గా కూడా ఉన్నాను. పర్వతాల్లో చేసే సాహసోపేతమైన ΄ోటీల్లో విజేతగా నిలుస్తుండేదాన్ని. ఆ పోటీలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. రెండేళ్ల క్రితం లదాఖ్‌లోని లేహ్‌లో జరగిన యుసిఐ ఎలిమినేటర్ ప్రపంచ కప్‌లో ఎలైట్ మహిళల విభాగంలో భారతదేశానికి ్రపాతినిధ్యం వహించడం గర్వంగా అనిపించింది.శక్తిని గుర్తించాలి..నా కూతురికి ఇప్పుడు తొమ్మిదేళ్లు. ఆమె కూడా క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందుకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాను. చదువుతోపాటు టాలెంట్‌ను కూడా గుర్తించి, దానిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలని అమ్మాయిలకు చెబుతుంటాను. ఈ నెల పదిన జరిగే రేస్‌లో పాల్గొంటున్నాను. గెలుపు – ఓటమి, విజయం – అపజయం అని చింతించకుండా 100 శాతం శక్తినీ, సామర్థ్యాన్నీ వినియోగించి లక్ష్యాన్ని సాధించి, ఫలితాన్ని భగవంతునికే వదిలేయాలి. ఇంకో విషయం.. ఏదైనా కొత్తగా చేయడానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చు. మీకుండాల్సింది ధైర్యం మాత్రమే’’ అంటుంది ఇందు.
సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
గతేడాది 2023లో మిస్ యూఎస్ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్‌గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన కిరీటాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు ఆమె అభిమానులు. మానసిక ఆరోగ్యం కారణంగానే తాను ఈ అత్యున్నత స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఆరోగ్యమే మహా సంపద అని అందువల్ల ముందు తన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. అలాగే మిస్ యూఎస్ఏగా తన జర్నీ చాలా అర్థవంతంగా సాగిందని చెప్పింది. మిస్ యూఎస్ఏ టైటిల్‌ని గెలుచుకున్న తొలి మెనిజులా అమెరికన్ మహిళ. తాను మిస్ యూఎస్ఏ 2023 టైటిల్‌కు రాజీనామా చేయాలన కఠినమైన నిర్ణయం తీసుకున్నాని వోయిగ్ట్ పేర్కొన్నారు. ఇది నాకు కొత్త అధ్యయనం అని తెలుసని, అందువల్ల స్థిరంగా ఉండేందుకు యత్నిస్తా. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మిస్ యూఎస్ఏ ఆర్గనైజేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..వోయిగ్ట్ తన విధుల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. మా టైటిల్ హోల్డర్లకు ముందు ప్రాధన్యత ఇస్తాం. ఈ సమయంలో ఆమెకు తనకు తానుగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము గుర్తించాం. తన భాద్యతలకు వారసునిగా చేయడం కోసం చూస్తున్నారని అర్థమయ్యింది.త్వరలో ఆమె కోరుకున్నట్లుగానే కొత్తమిస్ యూఎస్ఏని ప్రకటించడం కూడా జరుగుతుంది. అని అన్నారు. ఇన్‌స్టాగ్రాంలో సంస్థ మోడల్‌కి మద్దతను ఇవ్వడమే గాక ఆమె చేసిన సేవకు ధన్యావాదాలు తెలిపింది. కాగా, హవాయికి చెందిన సవన్నా గాంకీవిచ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆమె తదుపరి కొత్త యూఎస్ఏ కిరీటాన్ని పొందే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక వోయిగ్ట్ మిస్ యూఎస్ఏగా డేటింగ్ హింసకు వ్యతిరేకంగా, ఇమ్మిగ్రేషన్ హక్కులు, లాభప్రేక్ష లేని స్మైల్ ట్రైన్‌తో పనిచేయడం వంటి పలు సేవలందించారు. ఈ వేదిక తన కలను సాకారం చేసుకునేలా చేసింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అయ్యేలా చేసిందని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది.(చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ)
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
హైదరాబాద్ కుమారాంటీ తరహాలో సంచలనం రేపిన వడా పావ్ గర్ల్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఖరీదైన కారుతో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లగ్జరీ, దాదాపు కోటి రూపాయల అద్భుతమైన ఫోర్డ్ మస్టాంగ్లో వడా పావ్ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.ఢిల్లీకి చెందిన "వడా పావ్ గర్ల్" చంద్రికా దీక్షిత్ మంగోల్‌పురి ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తుంది. రోజూ వందల మందికి వడ పావ్‌ను విక్రయిస్తుంది. అలా వడా పావ్ గర్ల్‌గా బాగా ఫేమస్ అయింది. ఇన్‌స్టాలో 31 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.తాజాగా ఫోర్డ్ ముస్టాంగ్ కారులో వడాపావ్ అమ్ముతానంటూ ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "వడ పావ్ అమ్మాయి ముస్తాంగ్ కారులో వడా పావ్ అమ్మడం ప్రారంభించింది." అని ప్రకటించింది. అంతేకాదు వెయట్ చేయండి.. వడాపావ్‌తో పాటు త్వరలో ఒక పెద్ద ప్రకటన రాబోతోంది అని కామెంట్ చేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా చప్పట్ల మోత మోగించారు. అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేసింది. భారత మార్కెట్లో ఈ కారులే టెస్ట్ వెర్షన్ ధర సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Chandrika Gera Dixit official (@chandrika.dixit) కాగా ఇటీవల తనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఒకవీడియో వైరల్ అయింది. అయితే ఆమెను అరెస్ట్ చేయలేదని ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ముస్తాంగ్ కారు నుండి బయటికి రావడం, సరికొత్త ఐఫోన్, ఐవాచ్, ఎయిర్పాడ్లను కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన రీల్స్ చేసింది. అలాగే పోర్స్చేతో సహా ఖరీదైన కార్లతో పోజులిచ్చింది.
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
ఇంతవరకు పలు సంస్థల్లో పలు రకాల డ్రెస్ కోడ్లు ఉండేవి. కార్పోరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు శుక్రవారాల్లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో కేవలం సెమీ ఫార్మల్తో రిలాక్స్డ్గా పనిచేస్తారు. వాటిల్లోనే 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' వంటి డ్రెస్ కోడ్లను విన్నాం. ఇప్పుడూ అతిపెద్ద పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ అలాంటి డ్రెస్ కోడ్ విధానాన్నే కాస్త వెరైటీగా తీసుకొచ్చింది. అది కూడా క్యాజువల్ డ్రెస్ కూడా కాకుండా మరీ నలిగిన బట్టలు వేసుకురమ్మని చెబుతుడటం విశేషం. ఎందుకంటే ఇలా..డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఎన్ కలైసెల్వి, సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించమని తన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. పైగా "ముడతలు అచ్చే హై"(ముడతలు బాగుంటాయి) అని ప్రచారం చేస్తోన్నారు కూడా. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ చేయని దుస్తులు ధరించేలా చేయడమే ఈ డ్రెస్ కోడ్ ముఖ్యోద్దేశం. ఇలాంటి డ్రెస్ వేసుకునేందుకు అందరూ సహకరించాలని సీఎస్ఆర్ కోరింది. ప్రతి బట్టల సెట్‌ను ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని పేర్కొంది. కాబట్టి ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని సీఎస్ఆర్ డైరెక్టర్ జనరల్ కలైసెల్వి అన్నారు. మే 1 నుంచి 15 వరకు 'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'ముడతలు అచ్చే హై' ప్రచారాన్ని ప్రారంభించింది. ఎనర్జీని ఆదా చేసే చొరవలో భాగంతా సీఎస్ఐఆర్ దేశంలోని అన్ని ల్యాబ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక రేటింగ్ విధానాలను కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం సీఎస్ఐఆర్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను సుమారు 10% తగ్గించడమే ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోపు దీన్ని అమలు చేయనుంది. అంతేగాదు ఇటీవలే ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. తన మాతృభూమిని, ఈ గ్రహాన్ని(భూమి) రక్షించడానికి సీఎస్ఐఆర్ చేస్తున్న చిన్న ప్రయత్నం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.(చదవండి: 27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!)
న్యూస్ పాడ్‌కాస్ట్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే అధోగతే.. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.