AP: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

AP Political News Jan 25th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Thu, Jan 25 2024 6:58 AM

AP Elections Political News Updates Headlines 25th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

8:05 PM, Jan 25, 2024

చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ ఛాలెంజ్ 

  • పెనమలూరులో నా పై పోటీ చేసే దమ్ముందా?
  • చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడు
  • ఎవరు పోటీ చేసినా గెలిసేది నేనే
  • ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్‌ను ఎదుర్కోలేరు
  • ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తాం
  • ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు
  • ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు జగన్‌మోహన్‌రెడ్డి
  • సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జగన్‌పై కుట్రలు చేస్తున్నారు
  • చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు.. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది
  • 2024లో 175 స్థానాలు గెలుస్తాం
  • పెనమలూరు గడ్డ వైఎస్సార్‌సీపీ అడ్డా

7:35 PM, Jan 25, 2024

వంగవీటి రంగా విగ్రహానికి దండ కూడా వేయని వ్యక్తి పవన్ కళ్యాణ్: అడపా శేషు

  • పవన్‌కు, చంద్రబాబు కావాల్సిందే సీఎం కుర్చీ మాత్రమే
  • అధికారంలోకి రావడానికి ఏం చేయడానికైనా వెనుకాడరు
  • కుటుంబాల మధ్య చిచ్చు పెట్టగలరనడానికి ఉదాహరణే షర్మిల
  • పార్టీ పెట్టి పదేళ్లైనా కార్యకర్తలకు పదవులు ఇచ్చుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్
  • జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో మందికి పదవులిచ్చి సముచిత స్థానం కల్పించారు
  • మనం నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది
  • సీఎం జగన్‌ వల్ల జరిగిన అభివృద్ధిని అందరికీ చెప్పాలి

6:53 PM, Jan 25, 2024
చంద్రబాబుపై  ఎంపీ కేశినేని నాని ఫైర్‌

  • చంద్రబాబు రాజకీయ సమాధికి తిరువూరులో జనవరి 3నే పునాది పడింది
  • తిరువూరులో నాపై, స్వామిదాస్‌పైకి లోకేష్‌ గూండాలను పంపాడు
  • చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు
  • సీఎం జగన్‌ పేదవాడిని ధనికుడిని చేశారు
  • ఎంపీగా నా భావజాలం సీఎం జగన్ భావజాలం ఒక్కటే.. ముక్కు సూటితనం
  • విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి నిజమైన అంబేద్కర్ వాదిగా సీఎం జగన్ నిలిచారు
  • చంద్రబాబుకు రోడ్లు కావాలి.. ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలి
  • సీఎం జగన్‌కు పేదవాడి కడుపుమంట తీర్చి వారిని ధనికుల్ని చేయడం కావాలి
  • లోకేష్ కోసం చంద్రబాబు అమరావతి నిర్మించాడు
  • చంద్రబాబు 100 కోట్లు కూడా విజయవాడ అభివృద్దికి ఇవ్వలేదు
  • తిరువూరులో స్వామి దాస్‌ను 20వేల ఓట్ల మెజారిటీతో గెలుపించుకోవాలి
  • త్వరలోనే కట్టలేరు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం

6:26 PM, Jan 25, 2024
రాజోలు టీడీపీలో మరోసారి బయట పడ్డ వర్గ విభేదాలు

  • నారా భువనేశ్వరి పర్యటనలో మహిళా సర్పంచ్‌కు అవమానం
  • రాజోలు మండలం  శివకోడు నారా భువనేశ్వరిని కలవడానికి వచ్చిన తాటిపాక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల
  • ఆమెను లోపలికి రానివ్వకుండా తోసేసిన గొల్లపల్లి సూర్యారావు వర్గీయులు
  • ఇటీవల రాజోలులో  జరిగిన లోకేష్  పాదయాత్ర లో సర్పంచ్ రత్నమాల ప్లెక్సీలను చించేసిన గొల్లపల్లి వర్గం
  • అప్పట్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న టీడీపీ నేతలు

5:27PM, Jan 25, 2024
రాజధాని లేదంటే దానికి కాంగ్రెస్ పార్టీయే కారణం: వైవీ సుబ్బారెడ్డి

  • రాష్ట్రాన్ని అడ్డుగోలుగా కాంగ్రెస్ విభజించింది.
  • అటు వంటి కాంగ్రెస్ పార్టీలో చేరి మాట్లాడడం సమాజసం కాదు..
  • వైఎస్ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో దేశం మొత్తం తెలుసు..
  • కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మకై జగన్‌ను జైల్లో పెట్టారు
  • మాకు కాంగ్రెస్ అసలు పోటీనే కాదు.

5:25PM, Jan 25, 2024

పార్టీ పరంగా ఉన్న వారు అందరూ బహిరంగ సభకు హాజరువుతారు:  మంత్రి బొత్స సత్యనారాయణ 

  • దుష్ట శక్తుల కుట్రలను అడ్డుకొనేందుకు సభ జరగనుంది
  • ప్రజలకు చేసిన మంచిని సీఎం జగన్ వివరిస్తారు
  • రాబోయే రోజుల్లో ఎలా పోరాటం చేయాలో సీఎం జగన్ సూచిస్తారు
  • ప్రజలకు చేసిన మంచిని వివరిస్తారు
  • మీరు సంతృప్తి పడితేనే ఓటు వేయండి అని సీఎం జగన్ దైర్యంగా చెపుతున్నారు
  • చంద్రబాబులా మాయమాటలు చెప్పడం సీఎం జగన్‌కు తెలియదు
  • రాష్ట్రంలో ఓటు హక్కు లేని వారు మాట్లాడుతున్నారు
  • ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది అంటే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్ హయంలోనే జరిగింది
  • విద్య వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు
  • దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది
  • ప్రజల సీఎం జగన్ పాలనపై ఒక ఆలోచన చేయాలి
  • 27 తేదీన జరిగే బహిరంగ విజయ వంత మవుతుంది
  • భగవంతుని ఆశీస్సులు సీఎం జగన్‌కు ఉన్నాయి.

2:40PM, Jan 25, 2024

షర్మిలకు జగన్ ఏం అన్యాయం చేశారో ఆమెనే చెప్పాలి: సజ్జల

  • రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదు
  • ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదు
  • జగన్‌కి చెల్లెలుగా, వైఎస్సార్‌కి కూతురిగా మాత్రమే ప్రజలకు షర్మి ల తెలుసు
  • కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ఫ్యామిలీని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసు
  • తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలి
  • ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా?
  • షర్మిల మాట్లాడిన ప్రతీదానికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు
  • వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ అక్రమ కేసులు పెట్టింది
  • 16 నెలలు జైల్లో పెట్టారు
  • వైఎస్సార్‌ను ప్రేమించిన ప్రతీ గుండె జగన్‌ను ఆదరించారు
  • కాంగ్రెస్‌ పెట్టింది అక్రమ కేసులని.. ఆ పార్టీ నేతలే చెప్పారు
  • జగన్‌ అంతు చూడాలని కాంగ్రెస్‌ అనేక ప్రయత్నాలు చేసింది
  • చంద్రబాబు రాయించిన స్క్రిప్ట్‌ను షర్మిల చదువుతున్నారు
  • తెలంగాణలో పార్టీ కోసం పని చేసిన వారికి షర్మిల ఏం న్యాయం చేశారు
  • తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు షర్మిలను ఎందుకు వద్దన్నారు
  • రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు మేము గెలుస్తాం
  • 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తోంది
  • టీడీపీకి తగినంత సంఖ్యా బలం లేదు
  • అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్‌ నిర్ణయం
  • గంటా రాజీనామా ఆమోదం స్పీకర్‌ నిర్ణయం
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర పరిధిలో ఉన్న అంశం

1:20 PM, Jan 25, 2024
అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్‌సీపీని గెలిపిస్తాం: సజ్జల

  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం.
  • పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. 
  • ఈ నెల 27 నుంచి వరుస సభలు ఉంటాయి. శనివారం భీమిలిలో సీఎం జగన్‌ తొలి సభ ఉంటుంది.
  • సీఎం జగన్‌ పేద ప్రజల పక్షపాతి.
  • అధికారం అంటే బాధ్యతగా భావించిన నాయకుడు వైఎస్‌ జగన్‌.
  • వైఎస్సార్‌సీపీలో అందరూ కార్యకర్తలే.
  • వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడమే లక్ష్యం.
  • కుల, మత, రాజకీయాలకు అతీతంగా.. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించాం.
  • అవినీతికి తావులేకుండా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నాయన్నారు.
  • ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన నాయకుడు జగన్‌.

1:05 PM, Jan 25, 2024
గంటా శ్రీనివాస్‌పై పేర్ని నాని సెటైర్లు

  • రాజీనామాపై గంటా శ్రీనివాస్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు
  • గంట న్యాయపోరాటాన్ని ఎవరు ఆపటం లేదు
  • గంటా శ్రీనివాసరావు నాయకత్వం టీడీపీకే అవసరం లేదు
  • టీడీపీలోనే టికెట్ లేక అనవసర ఆరాటాన్ని సృష్టిస్తున్నాడు
  • షర్మిల ఎక్కడి వ్యక్తి అనేది స్పష్టతనివ్వాలి
  • నాడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసి నేడు అదే పార్టీకి సారథ్యం వహించటంలోనే ఆమె వైఫల్యం తెలుస్తోంది

12:45 PM, Jan 25, 2024
ఎల్లో బ్యాచ్‌కు మంత్రి జోగి రమేష్‌ కౌంటర్‌

  • ఏలూరులో జనవరి 30వ తేదీన జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు జోగి రమేష్‌ పిలుపు
  • గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానాలు 
  • గడచిన ఐదు సంవత్సరాల వైఎస్సార్‌సీపీ పాలనపై ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం సాగుతుంది
  • చంద్రబాబు, పవన్, మరే ఇతర పార్టీలు అందరూ కలిసి వచ్చిన సీఎం జగన్ ఒకరే వారికి సమాధానం చెప్పగలరు

12:30 PM, Jan 25, 2024
అభివృద్ధి పనులు ప్రజలకు తెలియాలి: బొత్స సత్యనారాయణ

  • వైఎస్సార్‌సీపీ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం
  • మన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలి.
  • పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి పనిచేయాలి. 
     

12:05 PM, Jan 25, 2024
వెల్లంపల్లి ఆఫీస్‌కు మల్లాది

  • విజయవాడ సెంట్రల్‌లో వైఎస్సార్‌సీపీ సంబురాలు
  • మల్లాది, వెల్లంపల్లి ఆత్మీయ ఆలింగనం
  • సెంట్రల్‌లో కొత్త ఆఫీస్‌ కార్యక్రమానికి హాజరైన మల్లాది విష్ణు
  • తన ఆఫీస్‌ నుంచి వెల్లంపల్లి ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లిన మల్లాది
  • విజయవాడ సెంట్రల్‌లో ముసలం అంటూ యెల్లో మీడియా కథనాలు
  • ఒక్క హగ్‌తో చెక్‌పెట్టిన మల్లాది

11:55 AM, Jan 25, 2024
ప్రజలు జగన్‌ను తప్ప ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేరు

  • ఈ నెల 27న భీమిలిలో వైఎస్ఆర్ సీపీ ఎన్నికల శంఖారావం
  • సభా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
  • చంద్రబాబు, పవన్ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
  • సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు అని ప్రజలు నమ్ముతున్నారు 
  • ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు

11:50 AM, Jan 25, 2024
విశాఖ పశ్చిమ టీడీపీలో అసంతృప్తులు

  • ఎమ్మెల్యే గణబాబు పై సొంత పార్టీ నేతల తిరుగుబాటు
  • ఎమ్మెల్యే గణబాబుతో పనిచేయలేమంటూ తీర్మానం
  • కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న నేతలు
  • జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అసంతృప్తి
  • గణబాబు నాయకత్వంలో పనిచేయమన్న నేతలు

11:27 AM, Jan 25, 2024
రాజ్యసభ ఎన్నికలపై మాకొక వ్యూహాం ఉంది: ఎంపీ అయోధ్య రామిరెడ్డి

  • గంటా రాజీనామా ఆమోదం స్పీకర్ ఇష్టం
  • ఎప్పుడు కరెక్ట్ అనుకుంటే అప్పుడే ఆమోదిస్తారు
  • రాజ్యసభ ఎన్నికల పై మా వ్యూహం మాకుంది
  • మాకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ వాళ్లకు అన్నీ తెలుసు
  • షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసమే వచ్చారు
  • సమస్యలు ఉంటే విడిగా డీల్ చేసుకోవాలి
  • ప్రజలకు చెప్పినవన్నీ చేశాం
  • ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కామెంట్స్‌


10:58 AM, Jan 25, 2024
31న ఏపీ కేబినెట్‌ భేటీ

  • భేటీ కానున్న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌
  • ఈ నెల 31వ తేదీన సమావేశం
  • సీఎం జగన్‌ అధ్యక్షతన భేటీ అయ్యి పలు కీలకాంశాల్ని చర్చించనున్న మంత్రివర్గం


10:52 AM, Jan 25, 2024
రాజమండ్రి: మండపేట టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి

  • వేగుళ్లకు టికెట్ ఇవ్వడం పై లీడర్లు, కేడర్ ఆగ్రహం
  • వేగుళ్లకు టికెట్ ఇవ్వొద్దంటున్న అసంతృప్తి నేతలు

10:49 AM, Jan 25, 2024
వాళ్ల హామీలను జనం నమ్మరు : వైవీ సుబ్బారెడ్డి

  • ఉత్తరాంధ్ర అంటే సీఎం జగన్ కు ప్రత్యేక అభిమానం
  • గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు
  • మళ్లీ ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తున్నారు
  • 27 సభ ద్వారా పార్టీ కేడర్‌కు సీఎం జగన్ దిశ నిర్దేశం చేస్తారు
  • టీడీపీ జనసేన మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించరు
  • వెబ్ సైట్ నుంచి చంద్రబాబు మేనిఫెస్టో తొలగించారు
  • 2014 ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కలిసే ప్రచారం చేశారు
  • ఎందుకు చంద్రబాబు తన పాలనలో అభివృద్ధి చేయలేక పోయారు
  • వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోంది
  • మేలు జరిగితే నే ఓటు వేయండని దైర్యంగా చెప్పే నాయకుడు దేశంలో ఎవరు లేరు
  • ఎన్ని పార్టీలు కలిసిన జగన్ విజయాన్ని అడ్డుకోలేరు

10:47 AM, Jan 25, 2024
బోండా ఉమకు ఆ అర్హత లేదు: వెల్లంపల్లి

  • విజయవాడ సెంట్రల్‌ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్.
  • 58 డివిజన్లో సుమారు 40 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది
  • బోండా ఉమా, చంద్రబాబు అభివృద్ధి చేసుంటే  మాకు ఈ అభివృద్ధికి అవకాశం ఉండేదా?
  • బోండా ఉమ, చంద్రబాబుకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదు
  • బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించాడు
  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టే అపూర్వ స్వాగతం లభిస్తోంది
  • సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు 25వేల మెజార్టీతో గెలుస్తున్నాం

10:45 AM, Jan 25, 2024
కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ సమావేశాలు

  • అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో.. వైఎస్సార్‌సీపీ కీలక సమావేశాలు
  • కాసేపట్లో వెంటకగిరి నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం
  • తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్న సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి
  • కలిసి పని చేయడంపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న విజయసాయిరెడ్డి

10:29 AM, Jan 25, 2024
కృష్ణపట్నం పోర్టు ఎక్కడికీ పోదు: మంత్రి కాకాణి 

  • కృష్ణపట్నం పోర్టుపై ఎవరూ.. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు
  • కంటైనర్‌ టెర్మిన్‌ను తరలించే ఉద్దేశం లేదు
  • ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదు
  • పోర్టు ఎక్కడికీ వెళ్లదు
  • రాజకీయ లబ్ధి కోసమే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు
  • రాజకీయంగా ఎదుర్కొలేక కేపీ పోర్ట్ తరలి పోతోందని టీడీపీ ప్రచారం 
  • కేపీ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ ప్రస్తుతం అభివృద్ధి జరుగుతోంది
  • పోర్ట్ ఇటీవల ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది.
  • కేపీ పోర్ట్ అభివృద్ధి పెరుగుతోంది.. కొత్త వ్యాపారంతో ఏపీకి ఆదాయం వస్తోంది
  • అభివృద్ధి లో ఉన్న పోర్ట్ ను దెబ్బ తీయాలనే సోమిరెడ్డి ప్రచారం
  • గతం లో పవర్ పొల్యూషన్ పై కమ్యూనిస్ట్ లతో కలిసి ఆందోళన చేసిన సోమిరెడ్డి యాజమాన్యాలతో కుమ్ముక్కయ్యారు
  • పోర్ట్ వ్యాపారం లో హెచ్చుతగ్గులు ఉంటాయి... గానీ పోర్ట్ పురోగతికి ఎలాంటి డోకా లేదు.
  • కేపీ పోర్ట్ లో ఎలాంటి సర్వీస్ లు రద్దు కాలేదు. ఎక్కడికి తరలిపోలేదు
  • పోర్ట్ లో కంటైనర్ తరలిస్తామన్నా... స్థానిక ఉద్యోగుల కు ఇబ్బంది కలిగినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే గా నేనే ఆందోళన చేస్తా
  • కేపీ పోర్టులో ఏ సర్వీస్ తొలగించినా నేరుగా ఆందోళన చేస్తా
  • కృష్ణపట్నం పోర్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌

9:40 AM, Jan 25, 2024
పచ్చ బ్యాచ్‌కు సూటి ప్రశ్న.. సమాధానముందా?

  • ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ మీడియంపై నోరు జారిన పచ్చ బ్యాచ్‌
  • ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే దమ్ముందా?.

8:15 AM, Jan 25, 2024
‘పొత్తు’ కడుపులో కత్తులు!

  • బాబుకు 68 సీట్ల జాబితాతో పవన్‌ ప్రతిపాదన
  • పార్టీ నేతలు, కొన్ని కుల సంఘాల ఒత్తిడితో పలు డిమాండ్లు
  • 45కు తక్కువ కాకుండా కేటాయించాలని వినతి
  • టీడీపీ బలంగా ఉన్న సీట్లు జనసేనకు ఇచ్చారన్న అభిప్రాయం కలిగించాలని సూచన 
  • అందుకే గత ఎన్నికల్లో గెలిచిన 23లో రెండైనా ఇవ్వాలని అభ్యర్థన 
  • జనసేన జాబితా బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో పెరిగిన విభేదాలు 
  • కత్తులు నూరుతున్న ఇరుపార్టీల నాయకులు.. సీట్ల పంపకాలపై రెండు పార్టీల్లోనూ ప్రతిష్టంభన 

7:50 AM, Jan 25, 2024
చంద్రబాబుకు కొత్త టెన్షన్‌..!

  • ‘రా కదలిరా’ సభలు కొన్ని రద్దు.. మరికొన్ని వాయిదా  
  • ఇప్పటి వరకు కష్టమ్మీద కొన్ని చోట్ల మాత్రమే సభలు 
  • ఆశించిన స్థాయిలో విజయవంతం కాక సతమతం.. జనాన్ని తరలించలేక  చేతులెత్తేస్తున్న తమ్ముళ్లు 
  • మిగిలిన చోట్ల నిర్వహించడం ఇక  కష్టమని నిర్ధారణ.. ఉరవకొండ, పీలేరులో  బుధవారం జరగాల్సిన సభలు వాయిదా 
  • గోపాలపురం సభకు బదులుగా రాజమండ్రితో సరిపెట్టే యోచన.. పార్టీ పరిస్థితి అధ్వానంగా మారడంతో బయటకు రాని నేతలు  
  • సీట్ల సర్దుబాటు తేలక జనసేన నుంచి అందని సహకారం 
     

7:20 AM, Jan 25, 2024
ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు: వైఎస్సార్‌సీపీ

  • టీడీపీ హయాంలో వెలిగొండను ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు
  • 2014-2019 చేసిన పనులు శూన్యం
  • ఏ మాత్రం పనులు చేయకుండా రూ.650 కోట​ఉల కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు. 

7:00 AM, Jan 25, 2024
ఉత్తరాంధ్రలో అభివృద్ధి షర్మిలకు కనిపించడం లేదా?: వైవీ సుబ్బారెడ్డి

  • షర్మిలకు మేము చేసిన అభివృద్ధి చూపించడానికి సిద్ధం
  • ఉద్ధానంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది ఎవరు?
  • చంద్రబాబు చూపించారా.. కాంగ్రెస్ పార్టీ చూపించిందా..?
  • ఏళ్ల తరబడి ఉద్దానంలో ఉన్న సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపించారు
  • చంద్రబాబు జనసేన మేనిఫెస్టోను ప్రజలు ఎవరూ నమ్మరు
  • మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తొలగించిన ఘనుడు చంద్రబాబు
  • చంద్రబాబు ఎన్ని హామీలు అమలు చేశారో ప్రజలందరికీ తెలుసు
  • రాజీనామా చేసే ముందు గంటా ఆలోచించుకోవాలి
  • రాజీనామా చేసిన తర్వాత ఎప్పుడు ఆమోదిస్తే గంటాకు ఎందుకు?
  • స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఇప్పుడు గంటా గగ్గోలు పెడితే ఎలా?
  • రాజధానిపై గ్రాఫిక్స్ చూపించిన చంద్రబాబు గురించి ఎందుకు షర్మిల మాట్లాడటం లేదు?
  • విశాఖ రాజధాని కాకుండా కోర్టులో కేసులు వేసింది చంద్రబాబే
  • అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు కాదా?

6:45 AM, Jan 25, 2024
తిరిగి మేం అధికారంలోకి రావడం ఖాయం: సీఎం జగన్‌ 

  • నా వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నా
  • తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం
  • విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం
  • వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం
  • మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం
  • మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది:
  • కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుంది
  • విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు
  • రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు
  • అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు

6:30 AM, Jan 25, 2024
ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత: సీఎం జగన్‌

  • ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం
  • వివక్ష లేకుండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించాం
  • డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం
  • అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాం
  • అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేశాం
  • కచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం
  • ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు,
  • వాటి అమలు గురించీ కూడా విపక్షాలు మాట్లాడలేవు
  • ఇదే బడ్జెట్‌ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది
  • కాని మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు
  • కాని ఈ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ చేయగలిగింది
  • చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది నాకు లేనే లేదు
  • చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది
  • ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్‌ విధించింది
  • అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది.?
  • సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా?
  • వాటిని చూసి కన్విన్స్‌ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి
  • రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉనికి పెద్దగా లేదు
  • పోటీ మా పార్టీకి, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే ఉంటుంది
  • ప్రతి పార్టీ కూడా సర్వేలు చేస్తుంది
  • వాటి ఫలితాల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుంది
  • ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు
  • కాని కొందరు స్థానిక నాయకుల విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది
  • అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశాం
  • చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం
  • జాతీయ రాజకీయాలు విషయంలో మా విధానం స్పష్టం:
  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం
  • ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నాం:
  • కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతూ ఉంటుంది
  • అది ఆ పార్టీ సంప్రదాయంగా గమనిస్తున్నాం
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు
  • విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పాలించాలనుకుంది
  • అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు
  • నేను కాంగ్రెస్‌నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు
  • వారు పాఠాలు నేర్వలేదు
  • కాంగ్రెస్‌ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు మా సోదరికి ఇచ్చారు
  • కాని అధికారం అనేది దేవుడు ఇచ్చేది
  • దేవుడ్ని నేను బలంగా నమ్మతాను ఆయనే అన్నీ చూస్తాడు.

6:30 AM, Jan 25, 2024
టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి: సజ్జల రామకృష్ణారెడ్డి

  • వైఎస్సార్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ
  • అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యం
  • సీఎం జగన్‌.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు
  • పథకాలు, సంస్కరణల్లో సీఎం జగన్‌ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు
  • అణగారిన వర్గాలనుపైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలి
  • గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదు
  • సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలనూ తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది
  • సచివాలయ ఉద్యోగాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయి
  • మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్‌ అమలు చేశారు
  • టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం జగన్‌ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు
  • ఈ నాలుగున్నరేళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదు
  • ఎన్నికలు రాబోతున్నాయ్‌. మీ భవిష్యత్తులు మారాలంటే.. మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది
  • మీడియాను మేనేజ్‌ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి
  • ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు.
  • ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారు
  • కొత్తగా రూపుదిద్దుకుంటున్న పోర్టులు రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తాయి
  • 11 మెడికల్ కళాశాలల ద్వారా  దేశానికి కావాల్సిన వైద్యులను ఏపీ అందించబోతోంది
  • అంబేద్కర్‌కు హిమాలయాలంత విగ్రహం పెట్టినా సరిపోదు
  • అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంది
  • అంబేద్కర్ విగ్రహం గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటుంది
  • అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. విజయవాడలో కొండ పై అమ్మవారు.. కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు
  • దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం జగన్‌ ఆలోచన
  • ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా

Advertisement
Advertisement