AP Political News Dec 28th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Dec 28th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Dec 28th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Thu, Dec 28 2023 7:04 AM

AP Elections Today Political News Updates And Headlines December 28th In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

7:41PM, డిసెంబర్‌ 28, 2023

విశాఖ:

బీమిలిలో పచ్చ పార్టీ నేతల దౌర్జన్యం

  • సీపీఎం నేత అప్పలరెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలు
  • ఓపెన్‌ జిమ్‌ శంకుస్థాపనలో అప్పలరెడ్డిపై టీడీపీ గూండాల దాడి
  • పార్టీలకతీతంగా సీఎం జగన్‌ అభివృద్ధి చేస్తున్నారన్న సీపీఎం నేత అప్పలరెడ్డి
  • ప్రభుత్వ అభివృద్ధిని ప్రశంసించడంతో అప్పలరెడ్డిపై దాడి

6:45PM, డిసెంబర్‌ 28, 2023

చంద్రబాబు హయాంలో ప్రతీ పదవీ ఒక వర్గానికే దక్కేది : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
  • విజయవాడ మేయర్‌ను బీసీ మహిళకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌ది
  • మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగన్‌మోహన్‌రెడ్డే సీఎంగా ఉండాలి
  • ఈ రాష్ట్రానికి మళ్లీ మళ్లీ వైఎస్‌ జగనే సీఎంగా ఉండాలి

6:01PM, డిసెంబర్‌ 28, 2023
అంబటి రాయుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ పాలిటిక్స్‌

  • YSRCP పార్టీలో అధికారికంగా చేరిన క్రికెటర్‌ అంబటి రాయుడు
  • గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటిస్తోన్న అంబటి రాయుడు
  • విద్యార్థులు, యువతను కలిసి మాట్లాడుతోన్న అంబటి రాయుడు
  • ఇవ్వాళ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసిన అంబటి రాయుడు
  • కండూవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్‌

5:10PM, డిసెంబర్‌ 28, 2023
లోకేష్‌ పాదయాత్రలో మిస్సయింది ఏంటీ?

  • 4 వేల కిమీలు నడుస్తానని చెప్పాడు, 3130 కిమీల దగ్గరే ఆగిపోయాడు
  • తక్కిన 900 కిలోమీటర్లకు వెన్నుపోటేశాడు
  • మొత్తం 175 నియోజకవర్గాలను చుట్టేస్తానన్నాడు
  • 100 అసెంబ్లీ నియోజకవర్గాలకు బ్రేకేశాడు
  • అంటే పర్యటించింది 57% సీట్లకే.. ఎగ్గొట్టింది 43% నియోజకవర్గాలకు

లోకేష్‌ మిస్‌ చేసుకున్న అంశాలంటంటే.?

  • చంద్రబాబు అరెస్టు అయిన అద్భుతమైన అవకాశం జారవిడుచుకోవడం
  • రాష్ట్రంలో టిడిపి క్యాడర్‌ను నడిపించలేకపోవడం
  • నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన సమయంలో ఢిల్లీ పారిపోవడం

నాయకత్వంలో ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలేంటీ?

  • తాను ఎదగాల్సిన విషయం మరిచిపోవడం
  • ఇంకా 73 ఏళ్ల చంద్రబాబే ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం
  • తనకింకా పదవి చేట్టే అనుభవం లేదని ఒప్పేసుకోవడం
  • అదే సమయంలో పక్కపార్టీ నుంచి వచ్చిన పార్ట్‌టైం పొలిటిషియన్‌ పవన్‌కళ్యాణ్‌ను పొడగడం
  • క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోలేకపోవడం
  • అనర్గళంగా మాట్లాడలేకపోవడం (తెలుగు అయినా, ఇంగ్లీషు అయినా)
  • స్థానిక అంశాలపై ఎలాంటి పరిణితి పెంచుకోలేకపోవడం
  • సీనియర్లను నడిపించలేకపోవడం
  • తన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయలేకపోవడం
  • ఇచ్చిన మాట మీద నిలబడలేకపోవడం
  • అనవసరంగా నోరు పారేసుకోవడం
  • ఆగ్రహం వ్యక్తం చేస్తే జనం గుర్తిస్తారనుకోవడం

ఇప్పటికిప్పుడు చేయాల్సినవేంటీ?

  • తాను ఒక నాయకుడినని తనను తాను నమ్మడం
  • పార్టీ పగ్గాలు చేపడతానని తండ్రిని, పార్టీని ఒప్పించడం
  • ఎప్పటికైనా నేనే ముఖ్యమంత్రిని అవుతానని కనీసం తనవరకైనా నమ్మడం
  • పక్కవారిపై ఆధారపడకుండా.. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం
  • ఎల్లోమీడియా భుజకీర్తులను నమ్మకుండా.. చేసిన పనులు, ఇచ్చిన హామీలపై నిజంగా సమీక్షించుకోవడం
  • ప్రజల బాగోగులు తెలుసుకుని కొత్త పరిష్కారాలను తీసుకురాగలగడం
  • అత్యుత్తమ విధానాలను అనుసరించడం, అనైతిక విధానాలకు (ఫిరాయింపులు, దొంగ ఓట్లు) స్వస్తి చెప్పడం
  • షార్ట్‌కట్‌లను నమ్మకుండా కష్టేఫలి అనుకోవడం

4:19PM, డిసెంబర్‌ 28, 2023
బీసీల ఓట్లతో గెలిచి ఆ తర్వాత వారినే మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది:డిప్యూటీ సీఎం అంజాద్ బాష

  • ఇది వరకు పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి అన్యాయం చేశారు
  • 14  ఏళ్లు పని చేసిన చంద్రబాబు.. టీడీపీ బీసీల పార్టీ అంటాడు
  • బీసీల పేరు చెప్పుకని మోసం చేశాడు
  • మన ఓట్లతో గెలిచి మనల్ని మోసం చేశారు
  • మోసం చేసిన చంద్రబాబులాంటి వ్యక్తి కావాలా..సామాజిక న్యాయం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ కావాలా?
  • మైనార్టీని మంత్రి చెయ్యని వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబు వల్ల మైనార్టీల సమస్యలు ఎవరికి చెప్పుకొవాలో తెలియకుండా చేశాడు
  • అదే వైఎస్ జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసి డిప్యూటి సీఎంను చేశారు
  • రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ను మండలి డిప్యూటీ చైర్మన్‌ను చేశారు
  • చరిత్ర రాయాలంటే వైఎస్‌ కుటుంబానికే సాధ్యమవుతుంది
  • ఇలాంటి వ్యక్తికి మనమంతా అండగా ఉండాల్సిన అవసరం ఉంది
  • అందరిని నా వాళ్లు అని పిలిచే ఎకైక వ్యక్తి సీఎం జగన్‌
  • రాయచోటి ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది
  • మీ పట్ల ఎవరు చిత్తశుద్దితో పనిచేస్తున్నారో చూడండి
  • రాయచోటి అభివృద్దిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది
  • రానున్న ఎన్నికల్లో నక్కలు, కుక్కలు, పందులు ఎకమవుతున్నాయి
  • అయినా భయపడేది లేదు .. సింహం వైఎస్ జగన్‌లా సింగిల్‌గా వస్తంది
  • 175 స్దానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది
  • 175 స్దానాల్లో టీడీపీకి అభ్యర్థులే లేరు
  • మేము ఏరిపారిస్తే వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు

4:09 PM, డిసెంబర్‌ 28, 2023
రాష్ట్రానికి దిక్సూచి ఒక్కరే.. అది జగన్‌ మాత్రమే: ఎంపీ సురేష్‌

  • రాయచోటిలో సామాజిక సాధికార బస్సు యాత్రలో మాట్లాడిన ఎంపి నందిగం సురేష్
  • రాష్టంలో YSR ఫ్యామిలీని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరు
  • అదే చంద్రబాబును నమ్మిన వారెవరూ బాగుపడిన దాఖలాలు లేవు
  • వచ్చే ఎన్నికల్లో ఈ తేడా చూసి YSRCPని గెలిపించండి
  • ఇప్పుడు మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నారంటే అది వైఎస్ జగన్ పాలన ఘనత
  • కార్యాలయాల చుట్టూ జనం తిరగకుండా ఇంటింటికి పథకాలు అందిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్
  • చంద్రబాబు మాత్రం రాష్టాన్ని అప్పుల పాలు చేశాడని అంటున్నారు
  • కానీ మేము ఇచ్చే పథకాలన్ని ప్రజలకే చేరాయి
  • అదే టిడిపి హాయంలో పథకాలన్ని కాగితాలకే పరిమితం
  • ఎవరో పార్టీ పెడితే దాన్ని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు
  • బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రానీ పవన్ ఇప్పుడు మాట్లాడుతారా?
  • ఇప్పుడు ఇంత మంది చదువుతున్నారంటే జగన్ మోహన్ రెడ్డి కారణం
  • ఇంత మందికి పదవులు ఇచ్చారంటే జగన్ మోహన్ రెడ్డి కారణం
  • నా సామాజిక వర్గానికి పదవులు ఇస్తానంటూ దళితులను అవమానపరచిన వ్యక్తి చంద్రబాబు
  • అదే వైఎస్ జగన్ హోం మంత్రిగా దళితురాలిని చేశారు
  • నందిగాం సురేష్‌గా ఒకప్పుడు జెండా పట్టుకుని తిరిగే వాడిని
  • మళ్లీ గెలిపించి చూడండి మన పిల్లలు ఐఎఎస్, ఐపిఎస్ లు అవుతారు
  • రాష్టాన్ని ఇంతలా అభివృద్ది చేసిన వ్యక్తి జగన్ ఒక్కరే

4:01PM, డిసెంబర్‌ 28, 2023
రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు: మంత్రి అమర్నాథ్‌

  • ఒకరిద్దరు వెళ్లిపోతే పార్టీకి నష్టం జరుగుతుంది అనేది అమాయకత్వమే
  • ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు
  • త్వరలో ఖాళీ అయ్యేది జనసేన, టీడీపీలు మాత్రమే

3:33 PM డిసెంబర్‌ 28, 2023
YSRCP పాలనలో AP గణనీయమైన అభివృద్ధి : అయోధ్య రామిరెడ్డి

  • రెండేళ్లు కరోనాతో ఇబ్బంది పడినా రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది
  • నాలుగున్నరేళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది
  • తలసరి ఆదాయంలో అయిదేళ్ల కింద 17వ స్థానంలో ఉండే వాళ్లం, ఇప్పుడు ఏకంగా 9వ స్థానానికి ముందుకువచ్చాం
  • రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం రాష్ట్రం చక్కటి వృద్ధిని సాధించింది
  • 4,93,000 వేల ఉద్యోగాలిచ్చాం
  • వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరిగింది
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రెండు సార్లు ఉత్తమ ర్యాంక్ సాధించాం
  • 4 లక్షల పై చిలుకు MSMEలను తెచ్చాం
  • 8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం
  • ఆరోగ్యం కోసం నాలుగున్నరేళ్లలో వేల కోట్లు ఖర్చు చేశాం
  • ఎన్నడూ లేేనట్లుగా ఫిషింగ్ హార్బర్లు,మెడికల్ కాలేజీలు, పోర్టులు తెచ్చాం

3:15PM. డిసెంబర్‌ 28, 2023
వాలంటీర్లకు ముఖ్యమంత్రి ఎప్పుడూ మేలు చేస్తారు

వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

  • ఉపాధ్యాయ సంఘాల్లో పేరెన్నిక గల సంఘం PRTU
  • గత ప్రభుత్వం PRTU తప్పిదాల వలన రెండుగా చీలింది
  • విడిపోయిన తర్వాత కూడా రెండు ఎమ్మెల్సీ లు గెలుచుకుంది
  • ఆ రెండు సంఘాలు ఇప్పుడు కలిశాయి
  • వీరి ఐక్యత వలన రానున్న రోజుల్లో ఉపాధ్యాయులకు మేలు చేకూరుతుంది
  • వాలంటీర్లు ఎవరూ నిరసన చేయటం లేదు
  • కొందరు కమ్యూనిస్టులు ఎన్నికల నేపథ్యంలో గొడవలు చేయాలని చూస్తున్నారు
  • వాలంటీర్లు సీఎం జగన్ ఆత్మ లాంటి వాళ్లు
  • వారికి ఎప్పుడూ మేలు చేయాలనే సీఎం చూస్తారు
  • ఓట్ల కోసమైతే సీఎం జగన్ ఈ ఎన్నికల సమయంలోనే అమలు చేసేవారు తప్ప ముందుగా చేయరు
  • కానీ సీఎం జగన్ అందరికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు

కృష్టయ్య, పిఆర్టియూ నేత

  • ఉపాద్యాయ సంఘాల ఐక్యతతో ఉంటే న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం
  • వెంకట్రామిరెడ్డి సూచనలతో మా రెండు వర్గాలు ఒకటిగా కలిశాయి

సెక్రటరీ, గాదె శ్రీనివాసులనాయుడు

  • విడిపోవటం వలన నష్టం జరుగుతోందని గ్రహించాం
  • అందుకే కలిసి పని చేయాలనుకుంటున్నాం
  • గ్రౌండ్ లెవల్లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి
  • విద్య, వైద్యరంగానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు

గిరిప్రసాద్, పిఆర్టియు నేత

  • సమస్యల పరిష్కారం కోసం రెండు సంఘాలు కలిసి పని చేస్తాయి
  • ఉపాధ్యాయ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతున్నాయి

2:30PM. డిసెంబర్‌ 28, 2023
టీడీపీకి తెగులు పట్టింది: మంత్రి జోగి రమేష్‌

  • ఆ పార్టీ దివాళా తీసిందని అందరికీ తెలుసు
  • చంద్రబాబు దివాళా తీశాడనీ, ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని తెలుసు
  • పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారు
  • అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు మా మ్యానిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటు
  • 99.5% హామీలను అమలు చేసిన లీడర్ జగన్
  • దీన్ని మేము నిరూపిస్తాం,మ్యానిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా? 
  • మీ 2014 నాటి మ్యానిఫెస్టో, మా 2019 నాటి మ్యానిఫెస్టో మీద చర్చకు రాగలరా?
  • మ్యానిఫెస్టో అంటే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత
  • మ్యానిఫెస్టో అమలు చేశాం కాబట్టే  ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగగలుగుతున్నాం 
  • చరిత్రలో ఎవరైనా ఎన్నికల తర్వాత ఇలా ఇంటికి వెళ్ళి అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారా?
  • చంద్రబాబులాగా మ్యానిఫెస్టోని నెట్ నుండి తొలగించలేదు
  • మ్యానిఫెస్టోని చించి శనక్కాయల పొట్లాలుగా మార్చలేదు
  • మాకు మ్యానిఫెస్టో అంటే‌ పవిత్రగ్రంధం 
  • 2014లో మ్యానిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబును జనం చిత్తుచిత్తుగా ఓడించారు 
  • అసలు చంద్రబాబుకు ఏపీతో ఏం పని?
  • ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉందా?
  • ఇల్లు, డోర్ నెంబర్ ఉందా?
  • ఇలాంటి అడ్రస్ లేని వ్యక్తులు మా గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి
  • రైతులు, డ్రాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో దారుణంగా మోసం చేశారు
  • నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు
  • అలాంటి మోసకారి, దుర్మార్గుడు అయినందునే చంద్రబాబుకు ఈ గతి పట్టింది
  • 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా? 
  • అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా? 
  • చంద్రబాబు దిక్కుమాలిన మ్యానిఫెస్టోని అసలు ఎవరైనా నమ్ముతారా? 
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోకాళ్ల మీద నడిచినా ఆ పాపం పోదు
  • మళ్ళీ ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణమని అంటున్నారు
  • మేము ఎలాంటి ప్రకటనా చేయకపోయినా మాపై ఆరోపణలు చేస్తున్నారు
  • రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఉండేది, తినేది హైదరాబాదులో
  • అక్కడ కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయటం ఏంటి? 
  • ఈ ఎన్నికల తర్వాత వారు ఈవైపు ఇక కన్నెత్తి కూడా చూడరు

2:00 PM, డిసెంబర్‌ 28, 2023
YSRCP ప్రభుత్వం అంటే విశ్వసనీయతకు మారుపేరు : సీఎం జగన్‌

  • జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియోకాన్ఫరెన్స్
  • జనవరిలో 3, ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం చేస్తున్నాం
  • జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంపు
  • రూ.3 వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం
  • విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నాం
  • జనవరి 1 నుంచి 8 వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంటుంది
  • గత ప్రభుత్వంలో పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు
  • మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250లు చేశాం
  • ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం : సీఎం వైఎస్ జగన్
  • జనవరి 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం
  • జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుంది
  • YSR చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది
  • అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్‌ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది
  • ఈ కార్యక్రమం జరిగే లోపే దాదాపు 1.7 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు
  • 66,34,742మందికి రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి
  • పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా నేను 3వ తారీఖున కాకినాడలో పాల్గొంటున్నాను
  • ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి
  • 8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్‌ కానుక కార్యక్రమం జరుగుతుంది
  • అక్క చెల్లెమ్మలకు తోడు ఉండే ప్రభుత్వం మనది
  • ఆసరా కోసమే రూ.25,570 కోట్లు వెచ్చించాం
  • మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,,195 కోట్లు ఇచ్చాం
  • చివరి విడతగా 6,394 కోట్లు ఇస్తున్నాం
  • జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది
  • ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు
  • పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి
  • పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు
  • సచివాలయాల స్థాయిలో రూ.10వేలు, మండల స్థాయిలో రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిలో రూ.25వేలు బహుమతులు
  • ఫిబ్రవరి 15-16 తేదీల్లోనే ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు
  • ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ వైయస్సార్‌ చేయూత కార్యక్రమం
  • ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం
  • యూనిక్‌ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు
  • ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి
  • చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందుతున్నారు



1:52 PM, డిసెంబర్‌ 28, 2023
మ్యానిఫెస్టో మాయంపై ఎట్టకేలకు నోరు విప్పిన అచ్చెన్న

  • 2014లో అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టో మాయం చేసిన టిడిపి
  • తెలుగుదేశం వెబ్‌సైట్‌తో పాటు పార్టీకి సంబంధించిన అన్నిచోట్ల మ్యానిఫెస్టో మాయం
  • ఇచ్చిన ఏ హామీని సక్రమంగా నెరవేర్చకుండా పదవీ కాలం పూర్తి చేసిన చంద్రబాబు
  • ఇప్పుడు మళ్లీ మ్యానిఫెస్టో అంశాన్ని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు
  • తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కనబడకుండా చేశామని చెబుతున్నారు
  • ఎన్నికల కమిషన్‌ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే టీడీపీ మేనిఫెస్టో ఉంటుంది : అచ్చెన్నాయుడు
  • మరి తెలుగుదేశం వెబ్‌సైట్‌లో ఎందుకు లేదు? : YSRCP
  • ఏ దురుద్దేశంతో మ్యానిఫెస్టో మాయం చేశారు? : YSRCP
  • అవకాశం దొరికితే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి కూడా మాయం చేస్తారా? : YSRCP

1:33 PM, డిసెంబర్‌ 28, 2023
అయినా.. తీరు మారలేదు

  • బెంగుళూరులో ఐటీ ఉద్యోగులను కలిసిన చంద్రబాబు
  • ఇన్నేళ్లయినా తీరు మారకుండా క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నం
  • నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను
  • అప్పట్లో మా ఊరిలో కరెంట్ లేదు..రోడ్లు లేవు
  • రైతు కుటుంబంలో పుట్టి ఐటీని తీసుకొచ్చాను
  • తెలుగుదేశం ప్రచారంలో కలవండి
  • ఎన్నికలప్పుడు బెంగళూరు నుంచి ఊళ్లకు వచ్చి ఓటేయండి
  • ఏ దేశానికి వెళ్లిన ఐటీలో తెలుగువారు ఉంటారు
  • నా కొత్త నినాదం థింగ్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీ
  • అదే నా విజన్..అదే నా మిషన్
  • గతంలో ఆడపిల్లలపై శ్రద్ధ చూపేవారు కాదు
  • ఇప్పుడు వరకట్నం పోయింది..రివర్స్ ఇచ్చే పరిస్ధితి వచ్చింది
  • మన కుటుంబ వ్యవస్ధ ప్రపంచానికి ఆదర్శం
  • నేను వస్తే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ తీసుకొస్తా

1:13 PM, డిసెంబర్‌ 28, 2023
చంద్రబాబు ఏం చేయాలి? : టిడిపిలో సమాలోచనలు

  • మొన్నటి దాకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు కోర్టుకు చెప్పిన చంద్రబాబు
  • ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి మరో ప్రత్యామ్నయం లేక ఇబ్బందులు
  • లోకేష్‌పై ఇంకా పూర్తి నమ్మకం వ్యక్తం చేయని పార్టీ
  • చంద్రబాబుతోనే అన్ని చోట్ల సభలు పెట్టాలని టిడిపి నిర్ణయం
  • జనవరిలో చంద్రబాబు షెడ్యూల్ ఖరారు చేస్తున్న టీడీపీ
  • జనవరి 5 నుంచి 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు
  • రోజుకు 2 బహిరంగసభలు నిర్వహించేలా రూట్ మ్యాప్
  • ఈ నెలాఖరులోగా 25 బహిరంగ సభలు పూర్తి చేయాలని నిర్ణయం
  • ఈ 25 సభలు కాకుండా మరో 2 భారీ బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్

12:37 PM, డిసెంబర్‌ 28, 2023
లోకేష్‌ అరెస్ట్‌కు అనుమతివ్వండి: సీఐడీ

  • ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌పై విచారణ
  • లోకేష్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
  • రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను బెదిరించేలా లోకేష్‌ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్‌
  • సీఐడీ పిటిషన్‌పై ఈరోజు కోర్టులో విచారణ
  • తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్
  • నారా లోకేష్‌కు వ్యక్తిగతంగా నోటీసులివ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశం

11:37 AM, డిసెంబర్‌ 28, 2023
మళ్లీ జగన్‌ ప్రభుత్వమే వచ్చేది.. ఇది ఫిక్స్‌: దేవినేని అవినాష్

  • కొండ ప్రాంత వాసులకు ఇళ్ళ పట్టాలివ్వకుండా మోసం చేసింది టిడిపి
  • అంగన్వాడి, పారిశుద్ధ్య ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది
  • ప్రతిపక్ష నేతల చెప్పుడు మాటలు విని వారి మాయలో పడకండి
  • జగన్ ప్రభుత్వాన్ని విమర్శించటం తప్ప.. వాళ్లేం చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ
  • వైఎస్సార్‌సీపీ ఇన్చార్జిల మార్పులపై టీడీపీ అనవసర రాద్ధాంతం
  • ముందు మీ  పార్టీ నేతలు కార్యకర్తలని కాపాడుకోండి
  • టీడీపీ జనసేనలకు పార్టీలకు ముందుంది ముసళ్ళ పండగ
  • జగన్ ప్రభుత్వం విజయం పై ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు
  • జగన్ ప్రభుత్వ పథకాలపై సిగ్గులేని టీడీపీ నేతలు..  తోక పత్రికల ద్వారా విష ప్రచారం
  • పత్రికలు కూడా వాస్తవాలు గ్రహించి నిజాలు ప్రచురించాలి

11:15 AM, డిసెంబర్‌ 28, 2023
నేడు 35వ రోజు సామాజిక సాధికార యాత్ర

  • రాయచోటి, పెనమలూరు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర
  • అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర
  • మధ్యాహ్నం 12 గంటలకు అభి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్
  • కళ్యాణ మండపం నుంచి శివాలయం చెక్ పోస్ట్ వరకు బైక్ ర్యాలీ
  • శివాలయం చెక్ పోస్ట్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు పాదయాత్ర
  • బంగ్లా సర్కిల్ లో బహిరంగ సభ
  • హాజరుకానున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మత్రి విడదల రజినీ, ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి అనిల్, విప్ కొరముట్ల శ్రీనివాసులు
  • కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ఆధ్వర్యంలో బస్సుయాత్ర
  • మధ్యాహ్నం 2 గంటలకు తాడిగడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్
  • కంకిపాడులో అయాన్ కన్వెన్షన్ వరకూ భారీ బైక్, కార్ల ర్యాలీ
  • మధ్యాహ్నం 3:30 గంటలకు అయాన్ కన్వెన్షన్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం
  • సాయంత్రం 4:30 గంటలకు కంకిపాడు బస్టాండ్ వద్ద బహిరంగ సభ
  • హాజరుకానున్న రీజనల్ కో ఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రులు జోగిరమేష్, మేరుగు నాగార్జున

11:12 AM, డిసెంబర్‌ 28, 2023
ఎన్నికల వేళ.. జనాన్ని ఎలా ఒప్పిద్దాం?

  • జనవరి 5 నుంచి జిల్లాలకు చంద్రబాబు
  • ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడానికి ప్రయత్నాలు
  • జనవరి 11న నరసరావుపేటలో పవన్ తో కలిసి ఉమ్మడి సభ
  • జనసేనతో పొత్తుపై పార్టీ నేతలతో మాట్లాడుతోన్న చంద్రబాబు
  • పార్టీ మీటింగ్‌లలో ఇప్పటికే ఓ స్పష్టత ఇస్తోన్న చంద్రబాబు
  • మరోసారి ఓడిపోతే ఏపీకి రానంటూ క్లారిటీ ఇస్తోన్న చంద్రబాబు

11:10 AM, డిసెంబర్‌ 28, 2023
వ్యూహం సినిమా @ హైకోర్టు

  • వ్యూహం సినిమా పై హైకోర్టులో విచారణ
  • వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరిన నారా లోకేష్
  • చంద్రబాబు, పవన్, లోకేష్ లను కించపరిచేలా సన్నివేశాలున్నాయని పిటిషన్
  • వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు వాదనలు
  • గత విచారణలో స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు
  • నేడు నిర్మాత, డైరెక్టర్ తరఫు వాదనలు విననున్న న్యాయస్థానం
  • వాదనల తర్వాత సినిమా విడుదలపై నిర్ణయం ప్రకటించనున్న హైకోర్టు
  • రేపు వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమైన చిత్ర యూనిట్

11:00 AM, డిసెంబర్‌ 28, 2023
ఎవరు పార్టీని వీడినా ఇబ్బందేమీలేదు: వైవీ సుబ్బారెడ్డి

  • ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన  రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలి.
  • ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాము.
  • పార్టీ నుంచి ఎవరు వెళ్లిన మాకు ఇబ్బంది లేదు.
  • ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు.
  • పవన్, చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన మా నాయకుడికి తిరుగులేదు.
  • సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి మళ్లీ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు.
  • ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదు అక్కడే ఇన్‌చార్జీలను మార్చాము.
  • మేము 175 కి 175 టార్గెట్ పెట్టుకున్నాము
  • అందులో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయి.
  • ఎక్కడ అయితే అభ్యర్థులను మారుస్తున్నామో అక్కడ ముందు పనిచేసిన నాయకులు సహకరించాలని సీఎం చెప్పారు.
  • కోర్ట్ పరిధిలో ఇబ్బందులు వల్ల రాజధాని మార్చడం ఆలస్యం అయింది.
  • తప్పకుండా సీఎం జగన్‌ విశాఖ నుంచి పాలన సాగిస్తారు.
     

10:44AM, డిసెంబర్‌ 28, 2023
రోడ్ల మరమ్మత్తులకు ఎవరి పాలనలో ఏం చేశారు?

  • బాబు హయాంలో(5  ఏళ్లలో)-రూ.2,954 కోట్లు
  • జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.4,149 కోట్లు

రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి..

  • బాబు హయాంలో(5  ఏళ్లలో)-రూ.4,325 కోట్లు
  • జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.7,340 కోట్లు

పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి

  • బాబు హయాంలో(5  ఏళ్లలో)-రూ.3,160 కోట్లు
  • జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.5,444 కోట్లు

జాతీయ రహదారుల నిర్మాణానికి..

  • బాబు హయాంలో(5  ఏళ్లలో)-రూ.14,353 కోట్లు
  • జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.25,304 కోట్లు

రోడ్ల నిర్మాణం, నిర్వహణకు చేసిన మొత్తం ఖర్చు

  • బాబు హయాంలో(5  ఏళ్లలో)-రూ.24,792 కోట్లు
  • జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.42,236 కోట్లు

రోడ్ల నిర్మాణం, నిర్వహణకు చేసిన సరాసరి ఖర్చు

  • బాబు హయాంలో (5  ఏళ్లలో)-రూ.4,958 కోట్లు
  • జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.10,559 కోట్లు

బాబు  కంటే 2  రెట్లు ఎక్కువ ఖర్చు

  • రూ.1,120 కోట్లతో 3,448 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరణ
  • తీరప్రాంత జిల్లాల్లో రూ.768 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులతో   2,294 కి. మీ. మేర రోడ్లను పునరుద్ధరణ
  • తీరప్రాంతం లేని జిల్లాల్లో రూ.352 కోట్ల ఆర్ఎస్ఐ డీఎఫ్ నిధులతో  1,154 కి.మీ. మేర పునరుద్ధరణ
  • 339 రోడ్లను 'హై ప్రయారిటీ' రోడ్లుగా గుర్తింపు

రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించాడు చంద్రబాబు

10:44AM, డిసెంబర్‌ 28, 2023
ఎన్నికలొస్తున్నాయి.. ఏం చేద్దాం.?

  • కాకినాడలో పార్టీ అంతర్గత సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోన్న పవన్‌ కళ్యాణ్‌
  • కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులతో సమావేశం
  • తర్వాత కాకినాడ నగర కమిటీతో సమావేశం
  • మూడు రోజుల పాటు కాకినాడలోనే సిట్టింగ్‌
  • పార్టీ అంతర్గత సమావేశాలు కాబట్టి మీడియా రావొద్దని సూచన
  • పొత్తులో భాగంగా టికెట్లు ఇవ్వలేకపోయిన నేతలను బుజ్జగిస్తున్నట్టు సమాచారం
  • టికెట్‌ త్యాగం చేయండి, గెలిచిన తర్వాత నామినేట్‌ పోస్టుకు ప్రయత్నిస్తా
  • తెలుగుదేశం సభలకు వెళ్లి జై కొట్టాలని సూచన

10:33AM, డిసెంబర్‌ 28, 2023
పవన్‌ కళ్యాణ్‌కు అంత గొప్ప రికార్డు ఉందా?

  • 2019 ఎన్నికల్లో 136 నియోజకవర్గాల్లో పోటీచేసిన జనసేన
  • ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న పవన్‌ కళ్యాణ్‌ పార్టీ
  • పవన్‌ కల్యాణ్‌ తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకలలో ఓటమి
  • ఓ పార్టీ అధినేత రెండుస్థానాల్లో పోటీచేసి రెండింటిలోనూ ఓడిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
  •  2009లో తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల్లో పోటీచేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి.. తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు
  • 1989లో టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు హిందూపూర్, వనపర్తి (తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌ జిల్లా)లలో పోటీచేయగా.. హిందూపూర్‌లో గెలిచి వనపర్తిలో ఓడిపోయారు
  • 2019లో పవన్‌ కల్యాణ్‌ రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. 

10:06AM, డిసెంబర్‌ 28, 2023
2019లో TDP ఫ్యామిలీ ప్యాకేజీలు గల్లంతు

  • డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు కేఈ శ్యాంబాబును పత్తికొండ నుంచి సోదరుడు కేఈ ప్రతాప్‌ను డోన్‌ నుంచి బరిలోకి దించారు. వారిద్దరూ వైఎస్సార్‌సీపీ ముందు నిలవలేకపోయారు.  
  • భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి.. నంద్యాల నుంచి ఆమె సోదరుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. 
  • నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి.. ఆయన అల్లుడు, కుమార్తెలు నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె శాసనసభ స్థానాల నుంచి పోటీ చేశారు. పోలింగ్‌ అయ్యాక ఎస్పీవై రెడ్డి మరణించారు. కానీ.. ఆ ఫ్యామిలీ మొత్తం ఓడింది.
  • జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయులు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిని టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. 
  • సినీ నటుడు బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్‌ మంగళగిరి నుంచి.. చిన్న అల్లుడు భరత్‌ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. 
  • నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, ఆత్మకూరు నుంచి ఆయన సోదరుడు కృష్ణయ్య టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. 
  • మంత్రి గంటా శ్రీనివాసరావు.. మరో మంత్రి పి.నారాయణ, భీమవరం మాజీ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు వియ్యంకులు. గంటా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓటమి అంచున ఉన్నారు. నెల్లూరు, భీమవరం నుంచి పోటీ చేసిన ఆయన ఇద్దరు వియ్యంకులు ఓటమిపాలయ్యారు. 
  • విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అశోక్‌ గజపతిరాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అథితి ఓడిపోయారు.

9:36AM, డిసెంబర్‌ 28, 2023
పక్క పార్టీ అభ్యర్థులను లాక్కుంటే.. అథోగతే.. చరిత్ర చూడండి ఒక సారి.!

  • 2019లో YSRCP నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబు
  • ఇద్దరు మృతి, ఆరుగురికి వెన్నుపోటు, 15 మందికి  ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన చంద్రబాబు
  • పాపాలకు ఫలితం అనుభవించిన 23 మంది ఫిరాయింపుదారులు
  • ఎన్నికల్లో నలుగురిని గట్టెక్కించలేకపోయిన మంత్రి పదవులు
  • నలుగురు మంత్రులు ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు, అమర్‌నాథ్‌రెడ్డిలు ఘోర పరాజయం
  • పాతపట్నంలో కలమట వెంకట రమణ, పాడేరులో గిడ్డి ఈశ్వరి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఓటమి
  • రంపచోడవరంలో వంతల రాజేశ్వరి, పామర్రులో ఉప్పులేటి కల్పన, విజయవాడ పశ్చిమలో జలీల్‌ఖాన్‌ కుమార్తె షబానా ఖాతూన్ ఓటమి
  • కందుకూరులో పోతుల రామారావు, గిద్దలూరులో అశోక్‌రెడ్డి, గూడూరులో సునీల్‌కుమార్, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఓటమి
  • ఆదినారాయణరెడ్డికి కడప ఎంపీ సీటివ్వగా ఓటమి
  • ఫిరాయింపులకు వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి
  • ఫిరాయింపుదారులపై వేటు వేయకుండా కాపాడి చంద్రబాబు పట్ల స్వామిభక్తిని చాటుకున్న నాటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు

9:00AM, డిసెంబర్‌ 28, 2023
మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేస్తా : నారా లోకేష్‌ బాబు నాయుడు

  • మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచి పెట్టలేదు : లోకేష్‌
  • ప్రజలు నాకు పరీక్ష పెట్టారనుకున్నా
  • మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు
  • ఆ కసితో మంగళగిరి కోసం ముందుకెళ్తున్నా

2019లో ఏం జరిగింది?

  • 2019 వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయని లోకేష్‌
  • ఎమ్మెల్సీగా నామినేట్‌ అయి దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్‌
  • 2019లో మంత్రి హోదాలో మంగళగిరి బరిలో దిగిన లోకేష్‌
  • అప్పటికే అమరావతి పేరిట భ్రమరావతిని ప్రజలపై రుద్దిన చంద్రబాబు
  • ఓ వైపు రాజధాని ప్రచారం, మరోవైపు గ్రాఫిక్స్‌ మాయాజాలం
  • తనయుడి విజయం తథ్యమన్నట్టుగా సాగిన చంద్రబాబు తీరు
  • 2019 ప్రచారంలో లోకేష్‌ ప్రధాన నినాదం : సీమాంధ్రను సింగపూర్‌ చేస్తాం
  • అమలు కాని హామీలపై ఓటర్లు ప్రశ్నించినప్పుడు ఇబ్బంది పడ్డ లోకేష్‌
  • రుణమాఫీ, పసుపు–కుంకుమ చెక్‌లపై ఓటర్లను ఒప్పించలేకపోయిన లోకేష్‌
  • అలవాటులో పొరపాటుగా ఏప్రిల్‌ 9న తనకు ఓటేయాలని బహిరంగ సభలో ప్రకటించిన లోకేష్‌ (ఎన్నికలు జరిగింది ఏప్రిల్‌ 11, 2019)

2019: మంగళగిరిలో నారా లోకేష్‌కు షాక్‌, 5270 ఓట్ల తేడాతో ఓటమి

8:15AM, డిసెంబర్‌ 28, 2023
నేడు 35వ రోజు సామాజిక సాధికార యాత్ర

  • రాయచోటి, పెనమలూరు నియోజకవర్గాలలో జరగనున్న బస్సుయాత్ర
  • అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర
  • మధ్యాహ్నం 12 గంటలకు అభి కళ్యాణ మండపంలో వైస్సార్‌సీపీ నేతల విలేకరుల సమావేశం
  • అనంతరం కల్యాణ మండపం నుంచి శివాలయం చెక్ పోస్ట్ వరకు బైక్ ర్యాలీ
  • శివాలయం చెక్ పోస్ట్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు పాదయాత్ర 
  • బంగ్లా సర్కిల్‌లో బహిరంగ సభ
  • హాజరుకానున్న డిప్యూటి సీఎం అంజాద్ బాష, మంత్రులు విడుదల రజినీ,  ఎంపీ నదిగం సురేష్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, విప్ కొరముట్ల శ్రీనివాసులు తదితరులు
  • కృష్ణాజిల్లా పెనమలూరులో మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ఆధ్వర్యంలో జరగనున్న బస్సుయాత్ర
  • మధ్యాహ్నం రెండు గంటలకు తాడిగడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతల ప్రెస్ మీట్
  • అనంతరం కంకిపాడులో అయాన్ కన్వెన్షన్ వరకూ భారీ బైక్, కార్ల ర్యాలీ
  • మధ్యాహ్నం 3:30 గంటలకు అయాన్ కన్వెన్షన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం
  • సాయంత్రం 4:30 గంటలకు కంకిపాడు బస్టాండ్ వద్ద బహిరంగసభ
  • హాజరుకానున్న రీజనల్ కో ఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రిరాజశేఖర్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మంత్రులు జోగిరమేష్ , మేరుగ నాగార్జున తదితరులు

8:00AM, డిసెంబర్‌ 28, 2023
కుప్పంకు చంద్రబాబు పరుగులు

  • సొంత నియోజకవర్గం కుప్పంకు చంద్రబాబు
  • మూడు రోజుల పాటు కుప్పంలోనే బాబు
  • ఓటమి భయంతో కుప్పంపై ఫోకస్‌ పెట్టిన చంద్రబాబు
     

7:00AM, డిసెంబర్‌ 28, 2023
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారానికి చెక్‌..

  • వాలంటీర్ల సమ్మె అంటూ ఎల్లో మీడియా చెత్త ప్రచారం
  • వాలంటీర్లు సీరియస్‌
  • మా మీద ఆరోపణలు చేసిన వాళ్లు ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నట్టు నటన. 
  • మేము ఆందోళనలు చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
  • ఇలాంటి అవాస్తవాలను నమ్మకండి: వాలంటీర్లు

6:45 AM, డిసెంబర్‌ 28, 2023
ఏం చేస్తే నమ్ముతారు? ఏం చెబితే వింటారు?

  • ఎన్నికల వేళ తెలుగుదేశం మాయోపాయాలు
  • జనాలకు చెప్పేందుకు నానా మాయమాటలు తయారీ
  • వచ్చే నెల నుంచి భారీ బహిరంగ సభలకు ప్లాన్
  • 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించే యోచన
  • ప్రతి బహిరంగ సభకు లక్షమంది హాజరు అయ్యేలా పార్టీ ఇన్‌ఛార్జీలకు టార్గెట్‌లు
  • లెక్క తప్పిందా.. సీటు దక్కదంటూ హెచ్చరికలు

6:35 AM, డిసెంబర్‌ 28, 2023
ఎవరు బయటకు వస్తారబ్బా.?

  • సొంత బలం లేక పక్కచూపులు చూస్తోన్న తెలుగుదేశం, జనసేన
  • YSRCP నుంచి ఎవరైనా వస్తారా అని ఎదురుచూపులు
  • YSRCPలో టికెట్‌ దక్కని నేతల వెంట పడుతోన్న టిడిపి, జనసేన
  • వైసిపి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చుకున్న పవన్‌ కళ్యాణ్‌
  • మిగతా ప్రాంతాల్లోనూ అభ్యర్థులు దొరక్క అధికార పార్టీ వైపు చూపులు

స్కిల్‌ కేసులో ఏం జరిగిందంటే.?

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసు
  • డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి
  • 2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో బయటపడ్డ అక్రమం
  • వేర్వేరు రాష్ట్రాలు, ఇతర దేశాలతోనూ ఈ కుంభకోణానికి లింకులు
  • అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం
  • ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు­నాయుడే ప్రధా­న సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు
  • కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ
  • ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్‌ కూడా
  • షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు
  • చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ ఘరానా మోసం
  • రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం
  • ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం
  • రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం
  • ప్ర‌భుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారని సీఐడీ అభియోగం
  • ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర షెల్‌ కంపెనీలకు నిధుల మళ్లింపు
  • ఈ కుంభ‌కోణం 2016- 2018 మధ్య జ‌రిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు
  • ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు
  • సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
  • కోర్టుల విచారణలో కీలక ఆధారాలను సమర్పించిన సీఐడీ

Advertisement
Advertisement