‘బాలకృష్ణ అమాయకుడు.. చంద్రబాబు ఏం చేప్తే అది నమ్ముతాడు’

20 Nov, 2021 14:07 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ‘‘బాలకృష్ణ అమాయక చక్రవర్తి.. కానీ చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని అయన అనుకుంటున్నారు. అందరి ఇళ్లల్లో ఆడవారు ఉన్నారు. ‌అలాంటిది మేము ఎందుకు తిడతాము.. అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై ఒక్క ప్రశ్న అయినా వేశారా.. అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబు’’ అంటూ మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారు. ఇది దురదృష్టకరం. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదు’’ అని పేర్ని నాని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు.. ఏమన్నారో చెప్పాలి. చంద్రబాబు మాటలను వీడియో చేశారు కదా. అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా. అనని మాటని, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరం. రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి కారణం చంద్రబాబే. తెలుగు రాజకీయాలు చూసేవారికి మరోసారి చెప్తున్నాం. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు’’ అని పేర్ని నాని తెలిపారు. 
(చదవండి: చంద్రబాబు విలపించడం ఓ డ్రామా)

‘‘అసెంబ్లీ చర్చ అందరి దగ్గరా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. వైసీపీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు కూడా నిజంగానే అని నమ్మారు. వారి బుర్రలో విషం ఎక్కించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏదేదో జరిగినట్టు నమ్మించే నేర్పరితనం చంద్రబాబు సొంతం. ప్రశాంతమైన వాతావరణంలో వ్యవసాయ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈలోపు జగన్, ఆయన కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఇలాంటి పనుల వల్ల రాష్ట్ర రాజకీయాలను‌ ఎలాంటి పరిస్థితులకు తీసుకుని వెళ్తున్నారు’’ అని మంత్రి ప్రశ్నించారు. 
(చదవండి: మా అమ్మ, చెల్లెలు, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారు: సీఎం జగన్‌)

‘‘వివేకా హత్య జరిగినప్పుడు ప్రభుత్వం నడుపుతున్నది ఎవరు. ముద్దాయిలను అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు. అసెంబ్లీలో మైకు కట్ చేసినా క్షణాల్లో సెల్ ఫోన్‌లో ఎలా వీడియో తీశారు. ఇదంతా ప్రీప్లాన్ గా చేసిన వ్యవహారం. చంద్రబాబు చేతిలో ఇంకా మోసపోవద్దని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కోరుతున్నాం. ఏపీ రాజకీయాల్లో నిన్నటిరోజు నిజంగానే బ్లాక్ డే’’ అన్నారు. 

‘‘వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల విజయంపై కొవ్వొత్తుల ర్యాలీ చేస్తోంది. కేంద్రం పై పోరాడి విజయం సాధించినందుకు మేము చేస్తున్నాం. రైతుల దీక్షకు మా ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. బందులకు కూడా సహకరించింది. మరోసారి చెప్తున్నాం.. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను నమ్మవద్దు. ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో విషాన్ని ఎక్కిస్తున్నారు. ఇంతకంటే వికృత రాజకీయాలు దేశంలో ఎక్కడా లేవు’’ అన్నారు. 

చదవండి: పేకమేడలా కూలిపోయిన కంచుకోట!


 

మరిన్ని వార్తలు