AP Political News Jan 31st: పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On Jan 31st In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Jan 31st: పొలిటికల్ అప్‌డేట్స్

Published Wed, Jan 31 2024 6:54 AM

AP Political Updates On Jan 31st In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

09:15 PM, Jan 31 2024
వాళ్లు దేనికి సిద్ధం?: సజ్జల కౌంటర్‌

  • వైఎస్సార్‌సీపీ సిద్దం నినాదంపై ప్రతిపక్షాల విద్వేష వ్యాఖ్యలు
  • కౌంటర్‌ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
  • 175 స్థానాల్లో మేం పోటీ చేస్తున్నాం
  • 175 స్థానాలకు పోటీ చేయలేని వారు.. మందలుగా తప్ప కలిసిరాలేనివాళ్లు దేనికి సిద్ధం?
  • టీడీపీ జనసేనవి అర్థం లేని మాటలు
  • జనసేన, టీడీపీ ఎన్ని స్థానాల్లో సిద్ధం?

09:00 PM, Jan 31 2024
వైఎస్సార్‌సీపీ ఐదో జాబితా విడుదల

  • మార్పులు చేర్పులతో మరో జాబితా విడుదల చేసిన వైఎస్సార్సీపీ
  • ప్రకటించిన మంత్రి బొత్స, సజ్జల
  • నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని మార్చేసిన వైఎస్సార్‌సీపీ
  • రీజినల్‌ కో ఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంట్‌ బాధ్యతలు
  • చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఒంగోలు పార్లమెంట్‌ బాధ్యతలు.. అదనంగా కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్‌ కోఆర్డినేటర్‌గా నియామకం

08:00 PM, Jan 31 2024
లోకేష్‌ను మడత పెట్టడం ఖాయం

  • మంగళగిరి నియోజకవర్గం లో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
  • నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన యాత్ర
  • బస్టాండ్ సెంటర్ నుంచి గాలిగోపురం మెయిన్ బజార్ మీదుగా మార్కెట్ సెంటర్‌కు 
  • మార్కెట్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభ.. హాజరైన అశేష జనం
  • సభకు హాజరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు
  • మంగళగిరిలో బీసీలను టీడీపీ తొక్కేస్తూ వస్తోంది
  • బీసీలకు కాదని నారా లోకేష్‌కు సీటు కేటాయిస్తోంది
  • సామాజిక న్యాయంలో భాగంగానే బీసీ అభ్యర్థి చిరంజీవికి వైఎస్సార్‌సీపీ సీటు కేటాయింపు
  • వేదిక నుంచి నారా లోకేష్‌ను ర్యాగింగ్‌ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు 
  • సరిగ్గా మంగళగిరి అని పలకడం కూడా లోకేష్‌కు రాదు
  • లోకేష్ తన దగ్గర ఉన్న డబ్బులతో మంగళగిరి ప్రజల్ని కొనేయాలనుకుంటున్నాడు
  • లోకేష్‌ను వైఎస్సార్సీపీ మడతపెట్టడం ఖాయం
  • వైఎస్సార్‌సీపీ దెబ్బకు లోకేష్‌ పారిపోతాడు
  • 2019లాగే.. 2024లో మరోసారి లోకేష్‌ను ఓడించాలని మంగళగిరి ప్రజలకు పిలుపు 
  • వెనుకబడిన వర్గానికి చెందిన గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని పిలుపు
  • 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలుపొందుతుందని నేతల్లో ధీమా
     

07:23 PM, Jan 31 2024
ఐదో జాబితాపై పూర్తైన కసరత్తు

  • వైనాట్‌ 175 నినాదంతో ఎన్నికలకు సిద్ధం అవుతున్న వైఎస్సార్‌సీపీ
  • ఈ క్రమంలోనే మార్పులు చేర్పులు చేస్తున్న అధ్యక్షుడు.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
  • క్షేత్రస్థాయి పరిస్థితులు.. సామాజిక సమీకరణాల దృష్ట్యానే మార్పులు
  • సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన చర్చలు జరిపిన కీలక నేతలు
  • కాసేపట్లో వైఎస్సార్‌సీపీ ఐదో జాబితా విడుదలకు అవకాశం
  • ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసిన పార్టీ
  • ఇప్పటికే 68 అసెంబ్లీతో పాటు పలు లోక్‌సభ స్థానాలకు మార్పులు చేసిన వైఎస్సార్‌సీపీ
     

07:18 PM, Jan 31 2024
తప్పుడు ప్రచారంపై లీగల్‌ చర్యలకు వెళ్తా: ఎమ్మెల్యే కాటసాని

  • పచ్చ మంద ప్రచారంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్‌
  • పాణ్యం నియోజకవర్గపు టీడీపీ పార్టీ నేతలపై మండిపడిన కాటసాని..
  • టీడీపీ పార్టీ చెందిన గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి పై అసత్య ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా
  • ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో తనపై భూకబ్జాలకు పాల్పడని ప్రచారం చేయడం సరైంది కాదు
  • తన పై చేసిన భూముల కబ్జాల ఆరోపణలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసి విచారణ నిరూపించాలి, లేదంటే వారి పై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తా

06:35 PM, Jan 31 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ విల్సన్‌

  • దేశ చరిత్రలో వైఎస్ఆర్ తర్వాత వైఎస్‌ జగన్ మాత్రమే పేదల కోసం పని చేస్తున్నారు
  • పేదల అభ్యన్నతికి ఆకర్షితుడినై జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాను
  • జగన్ ఎలాంటి పని అప్పగించినా చేస్తాను
  • వైఎస్సార్‌సీపీకి, జగన్ కి రుణపడి ఉంటాను
  • చుక్కా విల్సన్ బాబు, రిటైర్డు ఐఆర్ఎస్ ఆఫీసర్ వ్యాఖ్యలు

06:02 PM, Jan 31 2024
ఒంటరి పోరు దిశగా బీజేపీ ఇంకా ముందుకు.. 

  • నేడు 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో  ఎన్నికల కార్యాయాల్ని ప్రారంభించిన బీజేపీ
  • కొన్ని చోట్ల అసెంబ్లీ నియోజకవర్గాల కార్యాలయాల ప్రారంభం కూడా
  • అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా విడిగా మేనేజ్‌మెంట్‌ కమిటీల ఏర్పాటు
  • జాతీయ నాయకత్వం సూచనల మేరకు దూకుడు పెంచిన ఏపీ బీజేపీ 
  • కోర్‌ కమిటీ మీటింగ్‌లో నియోజకవర్గాల వారీగా పార్టీ పడే అవకాశం ఉన్న ఓట్లపై సమగ్ర చర్చ
  • లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా సిద్ధం
  • పురందేశ్వరి సహా ముఖ్య నాయకులందరికీ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఎన్నికల బాధ్యత

05:50 PM, Jan 31 2024
మార్టూరులో ఉన్నవన్నీ టీడీపీవాళ్ల పరిశ్రమలే: ఆమంచి కృష్ణమోహన్‌

  • పచ్చపత్రికలు తప్పుడు వార్తలతో మీడియా వ్యభిచారం చేస్తున్నాయి
  • మాఫియాతో గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై దాడులనడం అవాస్తవం
  • అక్రమాలు జరిగితే తనిఖీలు చేసే అధికారం అధికారులకు ఉంటుంది
  • ఫ్యాక్టరీల వల్ల లబ్ధి పొందుతున్నది ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
  • మార్టూరులో ఉన్నవన్నీ టీడీపీవాళ్ల పరిశ్రమలే
  • మార్టూరు విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌ వ్యాఖ్యలు

05:19 PM, Jan 31 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన రావెల కిషోర్‌ బాబు

  • వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌ బాబు  
  • సీఎం జగన్‌ సమక్షంలో చేరిక
  • వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉంది: రావెల
  • అంబేద్కర్‌ కలలను సాకారం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్‌
  • సీఎం జగన్‌ పాలనలోనే అన్ని వర్గాలకు మంచి జరిగింది: రావెల
  • వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఘనత జగన్‌ది: రావెల

05:00 PM, Jan 31 2024
ఆ నలుగురికి మళ్లీ నోటీసులు

  • వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరోసారి అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులు 
  • ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు పంపిన శాసనసభ అధికారులు
  • ఫిబ్రవరి 5 లోపు నోటీసులపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరిన స్పీకర్‌ 
  • ఫిబ్రవరి 8 తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • మంగళవారం సాయంత్రం నోటీసులు పంపిన స్పీకర్‌ కార్యాలయం
  • వివరణ విషయంలో వాళ్లు సీరియస్‌గా లేకపోవడంతో..  బుధవారం కూడా మరోసారి నోటీసుల పంపిణీ!
  • ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు అనర్హత పిటిషన్‌ నేపథ్యంలో వివరణ కోరిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం
  • గత విచారణలో గడువు కోరిన ఎమ్మెల్యేలు
  • ప్రసాదరాజు సమక్షంలోనే ఆ నలుగురిని ప్రశ్నించనున్న స్పీకర్‌
  • వివరణ తర్వాతే అనర్హత వేటుపై నిర్ణయం వెల్లడించే అవకాశం
     

04:15 PM, Jan 31 2024
ఇంతకీ పోటీ ఎక్కడ పవనూ?

  • ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌!
  • పోటీ ఎక్కడి నుంచి అనేదానిపై లేని క్లారిటీ
  • జనసేనాని పోటీ ఎక్కడి నుంచో అని జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ
  • గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పవన్‌ పోటీ
  • రెండింటిలోనూ ఓడిన పవన్‌ కల్యాణ్‌
  • గాజువాక, భీమవరంలలో ఓడిపోవడానికి టీడీపే కారణమంటూ అప్పట్లో మండిపడ్డ జనసైనికులు
  • పొత్తు వంకతో ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్న టీడీపీ
  • పొత్తు ధర్మం పక్కనపెట్టినందుకు కౌంటర్‌ రియాక్షన్‌ ఇవ్వాలంటూ పవన్‌పై ఒత్తిడి
  • ఈ క్రమంలోనే రెండు స్థానాల ప్రకటన
  • అయినా లెక్క చేయని టీడీపీ అధినేత చంద్రబాబు


04:00 PM, Jan 31 2024
మెగా డీఎస్సీ ఆమోదంపై డిప్యూటీ సీఎం ఏమన్నారంటే.. 

  • గతంలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చంద్రబాబు యువతను మోసం చేశారు
  • కానీ, నిరుద్యోగులకు సీఎం జగన్ పండగ లాంటి నిర్ణయం తీసుకున్నారు
  • 6100 టీచర్ పోస్టులకు కేబినెట్లో ఆమోదించాం
  • చంద్రబాబు గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చెయ్యలేదు
  • ఇప్పటికే 14 వేల టీచింగ్ పోస్టులు భర్తీ చేశాం
  • ఇప్పుడు మళ్లీ 6100 పోస్టులు భర్తీ చేస్తాం
  • 2 లక్షల 9 వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక సీఎం వై ఎస్ జగన్

కేబినెట్‌లో డిఎస్సీ ఆమోద నిర్ణయంపై డిప్యూటీ సీఎం రాజన్న దొర వ్యాఖ్యలు

03:30 PM, Jan 31 2024
ఏలూరులో 3న సిద్ధం.. పోస్టర్‌ ఆవిష్కరణ 

  • వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం
  • ఏలూరు జిల్లా దెందులూరు సహారా మైదానంలో ఫిబ్రవరి 3న సిద్ధం 
  • భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
  • దెందులూరు సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరణ
  • హాజరైన ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ ఎంపీ మిధున్ రెడ్డి, సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్ఆర్సిపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు 
  • పోస్టర్‌ ఆవిష్కరణలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ,ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ ,చింతలపూడి ఇంఛార్జ్ కంభం విజయ్ రాజు , వైఎస్‌ఆర్సీపీ శ్రేణులు

02:48 PM, Jan 31 2024
అబద్ధానికి మరో పేరు చంద్రబాబు: మంత్రి చెల్లుబోయిన

  • పేదలకు మంచి చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
  • పేదలను మోసం చేసిన చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నాడు 
  • అబద్ధానికి మరో పేరు చంద్రబాబు
  • అలాంటి చంద్రబాబుకు పవన్ మద్దతిస్తున్నాడు 
  • పార్టీ పెట్టి... 14 ఏళ్ల నుంచి ప్రజలను మోసం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ 
  • బీసీ కులగణనను తప్పుబడుతున్నారు 
  • చంద్రబాబు అడగలేకే.. పవన్ తో అడిగించాడు 
  • బోలెడన్ని పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్ కుట్రలకు కుతంత్రాలకు నిలయమైన చంద్రబాబుకు ఆసరాగా నిలవడం సిగ్గుచేటు 
  • ఎన్నికల ముందు పవన్, చంద్రబాబు కుటిలతత్వం బయటపడింది

02:22 PM, Jan 31 2024
చంద్రబాబును ఏనాడో పార్శిల్‌ చేసేశారు

  • చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ 
  • తాను తలుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ అవుతుందని చంద్రబాబు అంటున్నారు 
  • చంద్రబాబు తలుపుల్ని 2019లోనే హైదరాబాద్కు ఏపీ ప్రజలు పార్శిల్ చేశారు
  • ఇప్పుడు బాబు చేసేదేమీ లేదు 

01:57 PM, Jan 31 2024
జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ రాళ్ల దాడి

  • మద్దనూరులో ఉద్రిక్త పరిస్థితి
  • వైఎస్సార్‌సీపీ నేత మునిరాజరెడ్డి వర్గీయులపై టీడీపీరాళ్ల దాడి
  • టీడీపీ నేత భూపేష్‌రెడ్డి ఆదేశాలతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
  • దేవగుడి నుంచి మద్దనూరుకి భారీగా చేరుకున్న భూపేష్‌రెడ్డి అనుచరులు
  • అధికార పార్టీ నేత మునిరాజరెడ్డి లక్ష్యంగా రాళ్లదాడులకు దిగిన టీడీపీ శ్రేణులు


01:51 PM, Jan 31 2024
ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

  • డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌
  • 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం
  • వైఎస్సార్‌ చేయూత 4వ విడతకు ఆమోదం
  • ఫిబ్రవరిలో వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం
  • ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్‌ సిగ్నల్‌
  • ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం
  • ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
  • ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్‌ ఆమోదం
  • యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి  62కు పెంపు
  • అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
  • నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం
  • శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్‌ ఆమోదం

01:24 PM, Jan 31 2024
చంద్రబాబు, షర్మిల పై కొడాలి నాని ఫైర్

  • చంద్రబాబుకు మతిభ్రమించింది 
  • ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక జగన్ ను తిడుతున్నారు
  • 2019లోనే చంద్రబాబును ప్రజలు హైదరాబాద్ కు పంపించేశారు 
  • సీట్లు రాని, మేం తీసేసిన వాళ్లు టీడీపీలో చేరుతున్నారు 
  • చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా రాదు 
  • కొత్త మేనిఫెస్టోతో చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేస్తాం 
  • పదవి కోసమే జగన్ పై షర్మిల నిందలు 
  • షర్మిల గతంలో తెలంగాణ కోసం పార్టీ పెట్టారు 
  • తెలంగాణాలో పాదయాత్ర చేసి ఏం చేసిందో అందరికీ తెలుసు 
  • వైఎస్ ఆశయాలు సాధిస్తానని షర్మిల ఏం చేసిందో అందరికీ తెలుసు 
  • ఏపీ కోసం పుట్టానని ఇప్పుడు షర్మిల చెబుతున్నారు
  • షర్మిలకు స్టీల్ ప్లాంట్, పోలవరం ఇప్పుడు గుర్తొచ్చాయా? : కొడాలి నాని

12:10 PM, Jan 31 2024
బోండా ఉమను అసహ్యించుకుంటున్నారు: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌

  • బోండా ఉమ ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించాడు
  • బుడమేరు మధ్యకట్ట ప్రజలు బోండా ఉమను అసహ్యించుకుంటున్నారు
  • బోండా ఉమకు ప్రతి గుమ్మంలో నిరసన సెగ కనిపిస్తుంది
  • 30వ డివిజన్‌లో కోట్ల రూపాయలు అభిృద్ధి పనులు చేపట్టాం
  • సీఎం జగన్‌ పాలనను స్థానిక  ప్రజలు కోరుకుంటున్నారు

12:01 PM, Jan 31 2024
కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ భేటీ

  • మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై చర్చ
  • టీచర్ పోస్టుల భర్తీకి  డిఎస్సీ నిర్వహించేందుకు ఆమోదం తెలిపే అవకాశం
  • 6 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీపై చర్చించే అవకాశం
  • ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఆమోదం తెలపనున్న కేబినెట్
  • యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుపై చర్చించనున్న కేబినెట్
  • వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు ఆమోదం తెలపనున్న కేబినెట్
  • ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్
  • ఎస్‌ఐపీబి ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్
  • ఇందన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్

11:17 AM, Jan 31 2024
కాసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ

  • సచివాలయానికి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం
  • 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీల ఖరారు
  • పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చ
  • రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్ట్‌లను కూడా ఆమోదించనున్న మంత్రి వర్గం

10:26 AM, Jan 31 2024
రాజకీయ వ్యభిచారి చంద్రబాబు: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా 

  • తెలంగాణలో ఒక పార్టీ, ఇక్కడ మరొక పార్టీతో జత కట్టినచంద్రబాబు రాజకీయ వ్యభిచారిగా తయారయ్యారు
  • వెన్నుపోటు పొడవటం, మోసం చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
  • గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు హంగామాకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు
  • బ్లేడ్‌ బ్యాచ్‌ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు
  • గుండెల మీద చేయి వేసుకుని దీనివెనుక ఎవరున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి
  •  తాము అధికారంలోకి  వచ్చాక సంఘ విద్రోహ శక్తులను అదుపు చేశాం

9:25 AM, Jan 31 2024
నేడు మంగళగిరిలో సామాజిక సాధికార యాత్ర

  • మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్‌ విగ్రహం నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర
  • హాస్పిటల్‌ రోడ్డు, గాలి గోపురం, మెయిన్‌ బజార్‌ మీదగా మార్కెట్‌ సెంటర్‌కు యాత్ర
  • మార్కెట్‌ సెంటర్‌లో సామాజిక సాధికార సభ
  • పాల్గొననున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు

9:09 AM, Jan 31 2024
చంద్రబాబు పచ్చి మోసకారి?: ధర్మాన కృష్ణదాస్‌

  • అవసరముంటే ఒకలా.. అవసరం తీరాక మరోలా వ్యవహరించగలిగే ఊసరవిల్లి
  • పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారానికి బాబు వచ్చారు
  • నమ్మిన వారిని నట్టేట ముంచడంలో చంద్రబాబు మహా ఘనుడు
  • 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు
  • పేదలను, నిరుద్యోగులను మోసం చేశారు  

7:55 AM, Jan 31 2024
చంద్రబాబులో అణువణువూ విషమే.. మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌          

  • చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఓటమి ఖాయం 
  • వాళ్లు సర్దుకుని హైదరాబాద్‌ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు 
  • చేసిందేమిటో చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది  
  • బాబు సభలకు జన స్పందనే లేదు 
  • చంద్రబాబు అంత విషపూరిత రాజకీయ నేత దేశంలోనే లేరు
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్‌ బృందానికి ఓటమి ఖాయం
  • వారు మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్‌ వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు
  • సీఎం వైఎస్‌ జగన్‌ రూ.2.53 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో జమచేశారు
  • ఇలా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తే విషమవుతుందా?

నిజానికి.. చంద్రబాబు అంత విషపూరిత రాజకీయనేత దేశంలోనే లేరు

7:13 AM, Jan 31 2024
టీడీపీ ‘ఐ’ గేమ్‌..! 

  • టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫిర్యాదులు
  • ఓట్ల తొలగింపునకు ఫారం–7 నమోదు చేయించేది ఐ టీడీపీ సభ్యులే 
  • కానీ నేరం వైఎస్సార్‌సీపీపై నెట్టేలా పచ్చపత్రికల ద్వారా దుష్ప్రచారం
  • అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా రోజూ వ్యతిరేక వార్తలు
  • ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చుకోలేక అధికారుల సతమతం
  • నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఐ–టీడీపీ కుట్రకోణం 

7:06 AM, Jan 31 2024
నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ బెదిరింపుల కేసు వాయిదా

  • లోకేష్ తరపున హాజరైన న్యాయవాది లక్ష్మీనారాయణ
  • కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజుల సమయం కోరిన లోకేష్ న్యాయవాది లక్ష్మీనారాయణ
  • యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్లతో వివాదాస్పద వ్యాఖ్యలు వేసిన లోకేష్
  • చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని....రిమాండ్ విధించడం తప్పంటూ ఎసిబి న్యాయస్ధానానికి దురుద్దేశాలు ఆపాదించిన లోకేష్
  • రెడ్ బుక్ పేరుతో అధికారులకి బెదిరింపులు
  • వీడియోలతో సహా ఏసీబీ కోర్టులో గత నెలలో పిటీషన్ వేసిన సిఐడి
  • ఏసీబీ కోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినా అందుకోని లోకేష్
  • చివరగా ఏసీబీ కోర్టు నుంచే లోకేష్ కి నోటీసులు
  • కోర్టు నోటీసులకి స్పందించి విచారణకి హాజరైన లోకేష్ న్యాయవాది
  • నేటి విచారణలో మరోవారం సమయం అడిగిన లోకేష్ న్యాయవాది లక్ష్మీనారాయణ
  • విచారణ ఫిబ్రవరి 6 వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

7:05 AM, Jan 31 2024
స్కిల్ కేసు విచారణ మరోసారి వాయిదా

  • ఫిబ్రవరి 2 వ తేదీకి విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • చంద్రకాంత్ షా పిటిషన్ పై అభ్యతరాలు 
  • స్కిల్ స్కామ్ లో ఎ-2 ముద్దాయి మాజీ ఐఎఎస్ లక్ష్మీ నారాయణ ఏసీబీ కోర్టులో పిటిషన్
  • లక్ష్మీనారాయణ పిటీషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం
  • విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
  • ఫిబ్రవరి 2 వ తేదీకి విచారణ వాయిదా వేసిన న్యాయమూర్తి
  • అప్రూవర్ గా మారతానని ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా ఇప్పటికే ఎసిబి కోర్టులో పిటీషన్
  • కౌంటర్ పేరుతో పలుమార్లు సమయం‌ కోరిన చంద్రబాబు న్యాయవాదులు
  • కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు
  • దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని  చంద్రబాబు తరుపున న్యాయవాదులకు ఆదేశించిన కోర్టు
  • అప్పటి వరకు సిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు వాయిదా వేసిన ఏసిబి కోర్టు
  • చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22 న ఏసిబి కోర్టులో విచారణ
  • కౌంటర్ వేయడానికి సమయమివ్వాలన్న చంద్రబాబు న్యాయవాదులు
  • నిన్నటి విచారణలో చంద్రకాంత్ షా పిటీషన్ ని వ్యతిరేకిస్తూ ఏ2 లక్ష్మీనారాయణ కౌంటర్ పిటిషన్
  • అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల రకరకాలగా ఎత్తుగడలు

7:04 AM, Jan 31 2024
పీటీ వారెంట్‌పై విచారణ వాయిదా

  • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టులో విచారణ
  • ఫైబర్ నెట్ కేసులో‌ ముందస్తు బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు 
  • చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సీఐడీ
  • విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • వచ్చే నెల 22 కి వాయిదా
  • స్కిల్‌ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ మాత్రం బుధవారమే

6:57 AM, Jan 31 2024
వీరశివారెడ్డి రాజకీయం తెలిసిందే!

  • మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పై కమలాపురం ఎమ్మెల్యే ఫైర్‌
  • నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడటం తగదు
  • ఆయన రాజకీయ చరిత్ర అందరికి తెలిసిందే
  • పేకాట, క్లబ్బులు,సారాయి దుకాణాలు, నడిపించిన ఘనత ఆయనది
  • అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయ్యావు
  • వైఎస్ కుటుంబ మద్దతుతోనే టీడీపీ లో ఉన్నా నువ్ ఎమ్మెల్యే అయ్యావు
  • రెండవ సారి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గా గెలిచావ్
  • అధికారం ఎక్కడ ఉంటే వీరశివారెడ్డి ఆ పార్టీలో ఉంటాడు
  • ఎమ్మెల్యే గా ఫైరవీలు, ఉద్యోగాల బదిలీలు, అక్రమ ఇసుక పేరుతో దండుకున్నారు
  • ఇసుక దొంగ ఆయనే.. సారాయి దొంగ ఆయనే
  • హైదరాబాద్, బెంగళూరులో వాహనాల దోంగతనాలకు పాల్పడిన చరిత్ర వీరశివారెడ్డి ది
  • బెట్టింగ్ రాయుడు అనేది ఆయనకు ప్రత్యేక బిరుదు
  • ఇంకొకరి గురించి వీరశివారెడ్డి మాట్లాడటం హేయమైన చర్య
  • కేసులు మాఫీ అయ్యేందుకు  2019 ఎన్నికల తర్వాత వైసీపీకి మద్దతు ఇస్తున్న అన్నాడు
  • వైఎస్ జగన్ వల్లే 2009 లో ఎమ్మెల్యే గా అవకాశం వచింది
  • బెంగళూరులో అనేక సార్లు జగన్ ను కలిసిన విషయం వాస్తవం కాదా
  • వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శలు చేయడం దారుణం
  • నా పై చేసిన భూ కబ్జాలు చేసిన ఆరోపణలకు ఆయన కట్టుబడి ఉండాలి
  • ఆ భూకబ్జా ఆరోపణల్ని వీరశివారెడ్డి నిరూపించాలి
  • వేల ఎకరాలు దండుకున్న ఘనుడు చంద్రబాబు
  • ప్రతి జిల్లాలో చంద్రబాబు కు ఆస్తులు ఉన్నాయి
  • ప్రతి రాష్ట్రంలో చంద్రబాబు కు బినామీలు ఉన్నారు
  • రానున్న ఎన్నికల్లో 175 కి 175 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుంది

6:56 AM, Jan 31 2024
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు

  • వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
  • నోటీసులు పంపిన స్పీకర్‌ కార్యాలయం
  • ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం
  • ఫిబ్రవరి 5వ తేదీలోగా నోటీసులకు స్పందించాలని కోరిన స్పీకర్‌
  • టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్‌, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజుకు కూడా నోటీసులు జారీ 
  • ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి విచారణ చేయనున్నారు స్పీకర్‌ తమ్మినేని
  • మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకున్నాకే.. అనర్హత పిటిషన్‌ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం

Advertisement
Advertisement