అసెంబ్లీలో కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే విషెస్‌ | Sakshi
Sakshi News home page

ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: సీఎం రేవంత్‌రెడ్డి

Published Sat, Feb 17 2024 12:27 PM

In Assembly CM Revanth Reddy Birthday Wishes To Ex CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇరిగేషన్‌ శ్వేత పత్రంపై అధికార-ప్రతిపక్షం నడుమ వాడీవేడిగా వాదనలు జరుగుతున్న టైంలో.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి తన సీటులోంచి లేచారు.  మాజీ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 

కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన పూర్తి ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే.. ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన ప్రభుత్వానికి సహకరిస్తూ తెలంగాణ పున్నర్మిణంలో.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాం అని అన్నారాయన. కేసీఆర్‌ పూర్తిగా ఆరోగ్యంతో ఉండాలని.. ఆయన మరింత కాలం తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని తమ పార్టీ, ప్రభుత్వం కోరుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.

Advertisement
Advertisement