కవితపై బండి అనుచిత వ్యాఖ్యలు!.. భగ్గుమన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు

11 Mar, 2023 12:40 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. అయితే, కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ప్రతిపక్ష నేతలు కవితను టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కూడా కవితపై విమర్శలు చేశారు. చట్టం ముందు అందరూ ఒక్కరే అని అన్నారు. ఇదే సమయంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. సంజయ్‌ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్స్‌ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు