పంజాబ్‌లో బీజేపీ ఒంటరి పోరు: సునీల్ జాఖర్ | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం: సునీల్ జాఖర్ 

Published Tue, Mar 26 2024 12:22 PM

BJP to Fight Alone in Punjab Says Jakhar - Sakshi

పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాఖర్ తెలిపారు.

400 లోక్‌సభ స్థానాల లక్ష్యంతో వివిధ పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతున్న బీజేపీ పంజాబ్ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకుంది. తప్పకుండా దేశంలో 400 స్థానాల్లో గెలుస్తామని, ఇప్పటికే ప్రధాని మోదీ తన ధీమాను వ్యక్తం చేసారు. పంజాబ్‌లోని 13 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.

2019లో బీజేపీ ఎస్‌ఏడీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన 5 స్థానాలను బీజేపీ, ఎస్ఏడీ, ఆమ్ ఆద్మీ పార్టీలు సొంతం చేసుకున్నాయి. కాగా 2020లో ఎస్ఏడీ.. బీజేపీ సంబంధాలు తెగిపోయాయి. భవిష్యత్తులో కూడా ఈ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని జాఖర్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement