తెలంగాణకు బీఎల్ సంతోష్

27 Dec, 2022 18:33 IST|Sakshi

బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ రాష్ట్రానికి వస్తున్నారు. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ ఎపిసోడ్ తర్వాత మొదటిసారి ఆయన హైదరాబాద్‌లో అడుగుపెడుతున్నారు.  ఓ పక్క పోలీస్ కేసులు, మరో పక్క కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠ నెలకొంది.  ప్రస్తుతం బిఎల్ సంతోష్‌కు నోటీసులు, నిందితుడిగా చేర్చే అంశం హైకోర్టులో విచారణ జరుగుతుంది.

కోర్టు ఏం చెప్పింది?
మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ఎర వేశారని వచ్చిన అభియోగాల కేసులో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సెంటర్ గా  సిట్ విచారణ సాగుతుంది. ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని... 41 సి ఆర్ పి సి నోటీసులు పై స్టే ను ఎత్తివేయాలని సిట్ కోర్టుని అడుగుతోంది. ఆ కేసు ఈ నెల 30 కి వాయిదా పడ్డది. మరో వైపు ఆయనను అరెస్ట్ చేయొద్దని కూడా ఉత్తర్వులు ఇచ్చింది.

కేసుపై చర్చ, రాజకీయ రచ్చ
ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొదలైనప్పటి నుండి బిఎల్ సంతోష్ రాష్ట్ర పర్యటనకు రాలేదు. గత నెలలో జరిగిన బీజేపీ రాష్ట్ర శిక్షణ తరగతులు, కార్యవర్గ సమావేశాలకి ఆయన వస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగిన గుజరాత్ ఎన్నికలతో బిజీగా ఉండడం తో రాలేదు.  కేసు కొనసాగుతున్న నేపథ్యంలోని ఆయన రాష్ట్రానికి రాలేదని గుసగుసలు కూడా వినిపించాయి. ఇప్పుడు బిఎల్ సంతోష్ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఈనెల 28 29 తేదీల్లో హైదరాబాదులో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులు హైదరాబాద్ శివారులోని ఒక రిసార్ట్లో జరగనున్నాయి. ఇవి ఈ నెల 28 న ప్రారంభం అయ్యి 29న ఉదయం తో ముగుస్తాయి. 29 మధ్యాహ్నం తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఇన్చార్జులు, కన్వీనర్లు, విస్తారక్ లు పాలక్ ల సమావేశం అక్కడే జరగనుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని అయన మార్గ నిర్దేశనం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో ను అయన భేటీ కానున్నారు.

యాక్షన్ వర్సెస్ రియాక్షన్
బి ఎల్ సంతోష్ రాష్ట్రానికి వస్తుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అయన పైన వచ్చిన ఆరోపణలు, జరుగుతున్న పరిణామాల పై పార్టీ నేతలకు ఏమైనా చెబుతారా ? అనే డిస్కషన్ జరుగుతుంది. బిఎల్ సంతోష్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది ? పోలీస్ లు ఎలా రియాక్టు అవుతారు అనే దాని పై ఉత్కంఠ నెలకొంది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు