గాజువాక వస్తున్న చంద్రబాబుని నిలదీయాలి: మంత్రి బొత్స | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబు వైఖరేంటి?: మంత్రి బొత్స

Published Sat, Apr 13 2024 2:02 PM

Botsa Satyanarayana Ask Chandrababu Standards Vizag Steel Plant - Sakshi

విశాఖపట్నం, సాక్షి: ప్రజలు నిలదీయకున్నా సరే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వైఖరి ఏంటో తెలియజేయాలని  చెప్పాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు గాజువాక వస్తున్న తరుణంలో బాబు వైఖరి స్పష్టం చేయాల్సిందేనని బొత్స అన్నారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..   

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబు తన వైఖరి ఏంటో చెప్పాలి.  రేపు గాజువాక వస్తున్న చంద్రబాబుని నిలదీయాలి. ప్రజలు అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి. స్టీల్ ప్లాంట్ పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలి. స్టీల్ ప్లాంట్ డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి.

.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడతాం. టీడీపీ-జనసేన-బీజేపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే. లాబీయింగ్ చేసే సీఎం రమేష్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నా. అనకాపల్లిలో క్యాష్‌ పార్టీ తప్ప టీడీపీకి బీసీ నేత దొరకలేదా?. వలంటీర్లపై చంద్రబాబుది నాలుకా,. తాటిమట్టా. వృద్ధాప్యం, ప్రజావ్యతిరేకతతో చంద్రబాబు అయోమయంలో ఉన్నట్లున్నారు అని బొత్స ఎద్దేవా చేశారు. 

జగన్‌లాంటి నాయకుడ్ని చూడలేదు
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాట మీద నిలబడని నాయకులు. పైగా బలహీన వర్గాలంటే చిన్నచూపు. వాళ్లలా మేం మాయ మాటలు చెప్పం.  జగన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారు.. ఏదైతే చేస్తారో అదే చెప్తారు. నా రాజకీయ భవిష్యత్తులో జగన్ లాంటి మంచి నాయకుడిని చూడలేదు. మన పార్టీ బలహీనవర్గాల పార్టీ అని జగన్ నాతో అనేవారు. బీసీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్. అందుకే బలహీన వర్గాలకు రాజ్యాధికారం జగన్ మాత్రమే ఇస్తున్నారు. మత్యకారులను ఎమ్మేల్యేలుగా, మంత్రులుగా చేసిన  ఒకే ఒక్క నాయకుడు జగన్. ఈ ఎన్నికల్లో మత్యకారులకు నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఒక మత్స్య కారుని రాజ్య సభకు పంపించారు అని మంత్రి బొత్స గుర్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement