CBN: ఆ నవ్వు వెనుక అంత కథ ఉందా? | Sakshi
Sakshi News home page

అలా కనిపించారంటే అంతే!.. ఆ నవ్వు వెనుక అంత కథ ఉందా?

Published Mon, Jan 29 2024 5:02 PM

Chandrababu's Crying Acting Style In Assembly Elections - Sakshi

ఆ మధ్య చంద్రబాబు పబ్లిక్‌గా ఏడ్చారు. తప్పేం కాదు. మనిషి ఏడ్వొచ్చు. కానీ నాయకుడు ఏడ్వకూడదు. కనీసం ఏడ్చినట్లు కూడా కనిపించకూడదు. కానీ చంద్రబాబు తన ఏడుపును రాష్ట్ర ప్రజలంతా చూసేలా ఏడ్చారు. ఏడ్చి, ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నించారు. అభాసుపాలయ్యారు. ఆయన ఏడుపును ఎవరూ నమ్మలేదు. పైగా ‘‘హవ్వా’’ అని నవ్విపోయారు. నిజానికి చంద్రబాబు ఏడ్చే నాయకుడు కాదు. ఏడిపించే నాయకుడు కూడా. ఎన్టీఆర్‌ని అలాగే కదా ఏడిపించారు కదా.

అసలు సిసలు చంబ్రాబును చూడాలంటే మీరు 2003 అక్టోబర్‌ 1వ తేదీకి వెళ్లి ఆగాలి. తిరుపతిలో అలిపిరి దగ్గర ఆరోజు ఆయనపై నక్సల్స్‌ దాడి జరిగింది. ఆయన దుస్తులు రక్తసిక్తం అయ్యారు. ఆయన బెదిరిపోయారు. నిజానికి అది బెదురు కాదు. ఆలోచన! ఆ ఘటనను ఎలా తనకు అనుకూలంగా మలచుకోవాలన్న ఆలోచన. గాయాల నుంచి ఇంకా కోలుకోకుండానే, తిరిగి అధికార బాధ్యతలు చేపట్టకుండానే ఆయన పన్నిన మొదటి వ్యూహం.. నక్సలైట్‌ల హింసాకాండను కారణంగా చూపి శాసన సభ రద్దుకు సిఫారసు చేయడం. ముందస్తు ఎన్నికలకు ప్లాన్‌ చేయడం! అయితే పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ రాజకీయాలే ప్రధాన అజెండాగా ఓటర్ల సానుభూతి కోసం ఆయన చేసిన ‘ముందస్తు’ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

తనపైన జరిగిన దాడి తెలుగుదేశం పార్టీకి సానుభూతి ఓట్లను సంపాదించి పెడుతుందని భావించిన చంద్రబాబు.. దాడి జరిగిన సరిగ్గా నెల రోజులకు నవంబరు 2న హైదరాబాద్‌లో ఉప ప్రధాని అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుతో సమావేశం అయ్యారు. ముందస్తు ఎన్నికలపై మరోసారి ఆలోచించాలని కోరారు. (అప్పటికి నెల రోజులుగా ఈ ప్రతిపాదన తెస్తూనే ఉన్నారు.) కానీ ప్రధాని వాజ్‌పేయి ముందస్తు ఎన్నికలపై ఆసక్తి చూపకపోవటంతో అద్వానీ కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ ఏడాది నవంబరు–డిసెంబరు నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ముందస్తు గురించి ఆలోచిద్దాం అని అద్వానీ ఆ విషయాన్ని దాటవేశారు.

ఆ మర్నాడే చంద్రబాబు తన సన్నిహిత పార్టీ నేతలలో ముందస్తు గురించి చర్చించారు. టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న వాస్తవం వారి చర్చల్లోకి వచ్చింది. రాష్ట్ర హోం మంత్రి దేవేందర్‌ గౌడ్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు, పార్టీ కోశాధికారి ప్రభాకర్‌ రెడ్డి, ఏపీ కె.రామ్మోహన్‌రావు చంద్రబాబు ముందస్తు ప్రతిపాదనపై ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ‘దాడి’ని పక్కన పెట్టి, సంక్షేమ పథకాల ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికలకు అది కూడా  అవి జరిగినప్పుడే వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

2004 మే నెలలో జరిగిన ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ నాయకుడిగా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 294 స్థానాల్లో కాంగ్రెస్‌ 185 స్థానాల్లో విజయం సాధించింది. చంద్రబాబుకు సానుభూతి దగ్గకపోగా, ఘోర పరాజయానికి గురయ్యారు. ఆయన నాటకాలు కాంగ్రెస్‌కు చేదోడు అయ్యాయి తప్పితే, సైకిల్‌ని ముందుకు నడిపించలేకపోయాయి. చంద్రబాబు యాక్టింగ్‌ మామూలుగా ఉండదు. యాక్టింగ్‌ క్లాసులకు వెళ్లి మరీ తన యాక్టింగ్‌ను మెరుగు పరిచేందుకు 2004 ఎన్నికల ముందు ఆయనెంతో శ్రమ పడ్డారు.

చంద్రబాబు ఎప్పుడూ నవ్వుతూ కనిపించరు. ఒకవేళ కనిపించారంటే ప్రతిపక్ష నేతల్ని ప్రజల ముందు ఎద్దేవా చేయడానికి నవ్వుతారు. 2004 ఎన్నికలకు ముందు ఆయనపై సొంత పార్టీ నాయకులే ఈ విమర్శ చేశారు. ఆయనెప్పుడూ బిగదీసుకుని ఉంటారని, ప్రజల్లోకి అది వ్యతిరేక సంకేతాలను తీసుకెళుతుందనీ! దాంతో చంద్రబాబు తనని తను మలుచుకోవాలనుకున్నారు. మలుచుకోవడమే, మార్చుకోవటం కాదు.

ముఖం మీదకు నవ్వు రమ్మంటే ఊరికే వస్తుందా? యాక్టింగ్‌ చెయ్యాలి. చంద్రబాబు సహజ నటుడే కానీ, నవ్వును ముఖంపైకి తెప్పించడం ఆయన వల్ల కాలేదు. అందుకే ట్రైనింగ్‌ తీసుకున్నారు. సినీ, టీవీ రంగాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. మూడు రోజుల పాటు వారి నుంచి శిక్షణ పొందారు! ఉచ్ఛారణ, బాడీలాంగ్వేజ్, వస్త్రధారణ.. విషయంలో తనను తను మెరుగుపరుచుకున్నారు. ముఖం మీదకు నవ్వు తెప్పించుకోవటం కూడా ప్రాక్టీస్‌ చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల సన్నాహాలలో భాగంగా టీవీ చానెళ్లలో జరిగే చర్చగోష్ఠులలో పాల్గొన్నప్పుడు ఓటర్లను ఇంప్రెస్‌ చేయాలన్నదే ఆ శిక్షణ వెనుక ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదు.

ఆనాడు చంద్రబాబుకు పోస్టర్ల నాయకుడిగా కూడా పేరుండేది. అయితే ఆ ఇమేజ్‌ నగరాల్లో పనికొచ్చిందేమో కానీ, గ్రామాల్లోని ప్రజలు, ఓటర్లు ఈ నాటకాల నాయకుడిని తిరస్కరించారు. ప్రజలతో మమేకం అయి ఉన్న నాయకులే మనస్ఫూర్తిగా నవ్వగలరు. ఆ నవ్వు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపిస్తుందనే స్వయంగా టీడీపీ నాయకులే ఒప్పుకుంటారు.

ఇవి చదవండి: AP: సంక్షేమం అ‍ంటే బాబుకు ‘సన్‌’క్షేమం : మంత్రి చెల్లుబోయిన

Advertisement
Advertisement