‘జగన్‌ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు’ | Sakshi
Sakshi News home page

‘జగన్‌ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు’

Published Wed, Apr 10 2024 7:23 PM

Cm Jagan Comments On Chandrababu In Piduguralla Public Meeting - Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: ఊస‌ర‌వెల్లిని మించి రంగులు మారుస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్‌ బైపాస్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు.

‘‘వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఇలాగైనా జగన్‌ పాలన బావుందని బాబు ఒప్పుకున్నాడు. ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామంటున్నారు.. ఇంతకంటే జగన్‌ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్‌ ఏం ఉంటుంది?. ప్రజలు తిరగబడే సరికి చంద్రబాబు మారిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘ఊసరవెల్లి కంటే చంద్రబాబు ఎక్కువ రంగులుమారుస్తాడు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబు బతుకంతా అబద్ధాలు, వెన్నుపోట్లే. చంద్రబాబు ఊసరవెల్లిని దాటిపోయారు. చంద్రబాబు మోసాలు అందరికి తెలుసు. రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం బాబు మనస్తత్వం. అవ్వాతాలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్‌ ఆపారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారు. అవ్వాతాతలను ఇబ్బంది పడేలా చేశారు’’ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.

‘‘పిడుగురాళ్లలో జనసముద్రం చూస్తున్నాం. 5 ఏళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి అభివృద్ధి, సంక్షేమం అందించాం. సిద్ధం, సిద్ధం అంటూ నినాదాలు మన జైత్రయాత్రకు శంఖారావాలు. చంద్రబాబు మోసాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమా?. జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పి కొట్టాలి. మేం ఎప్పుడూ పేదల పక్షమే.ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పేదలవాళ్లు మోసపోతారు  చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా, అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు ముఖాముఖి. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌కు ఓటేయాలి’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.

‘‘పచ్చ మీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి. చంద్రబాబు హయాంలో ఒక్కరికైనా మంచి జరిగిందా?. 14 ఏళ్ల బాబు పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా?. మనం వచ్చాక సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. మనం వచ్చాక లక్షా 35 వేల మందికి ఉద్యోగాలిచ్చాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వైద్యరంగంలోనే 54 వేల నియామకాలు చేపట్టాం. పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రామ సచివాలయాల్లో లక్షా 35 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. జాబు రావాలంటే ఫ్యాన్ రావాలి’’ సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బాబుది బోగస్‌ రిపోర్ట్‌.. జగన్‌ది ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌: సీఎం జగన్‌

Advertisement
Advertisement