మన్యం ప్రజలు మీ వెంటే.. | Sakshi
Sakshi News home page

మన్యం ప్రజలు మీ వెంటే..

Published Tue, Apr 9 2024 1:28 PM

CM Jagan Is Maintaining The Trust Of The People - Sakshi

గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటిన వైఎస్సార్‌సీపీ

స్థానిక సంస్థల్లోనూ విజయ దుందుభి

గిరిజనుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న వైఎస్సార్‌సీపీ అధినేత 

పార్వతీపురం మన్యం: మన్యంలో ‘ఫ్యాన్‌’ జోరు తగ్గలేదు. వైఎస్సార్‌సీపీకి తిరుగులేదు. గత ఫలితాలే కాదు.. రాబోవు ఎన్నికల్లోనూ జగనన్న ప్రభుత్వానికి ఇక్కడ ఢోకా లేదు. ఏ ఇంట తలుపు తట్టినా.. ఏ వీధి మలుపు తిరిగినా ఇదే మాట. ప్రతి ఒక్కరి నోటా.. వైఎస్సార్‌సీపీ సంక్షేమం పాట. గతంలో ప్రభుత్వ పథకమంటే తెలియని అమాయక గిరిజనం. పేర్లు వారివి.. పథకాలు మరొకరివి. నేడు జగన్‌ పుణ్యమాని వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడమే కాక, లబ్ధినీ ఇంటి వద్దే పొందగలుగుతున్నారు. పోడు పట్టాలు దక్కించుకుంటున్నారు. అందుకే నాటి కంటే.. నేడు ‘ఫ్యాన్‌’ మరింత స్పీడుగా తిరుగుతోంది. వైఎస్సార్‌సీపీ గాలి ప్రతీ ఊరు, వాడ, గూడలో జోరుగా వీస్తోంది.

కంచుకోటగా..
కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గాలు పార్టీకి కంచుకోటగా మారాయి. 2014, 2019 ఎన్నికల్లో సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. పార్టీ తరఫున బరిలోకి దిగిన పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

2019 ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అలజంగి జోగారావు గెలుపొందారు. ఇంక స్థానిక సంస్థల్లోనూ అత్యధిక ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. పార్టీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థులు సైతం తిరుగులేని ఆధిక్యం సాధించారు. వైఎస్సార్‌సీపీ అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలు గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.

తిరుగులేదు..

  • సాలూరు నియోజకవర్గంలో పీడిక రాజన్నదొర వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.
  • 2019 ఎన్నికల్లో మొత్తం 1,46,839 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొరకు 78,430 ఓట్లు రాగా.. తెలుగుదేశం పార్టీ అభ్యరి్థకి 58,401 ఓట్లు వచ్చాయి. 20,029 ఓట్ల మెజారిటీతో రాజన్నదొర గెలిచారు.
  • 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ తరఫు న బరిలోకి దిగిన రాజన్నదొరకు 63,755 ఓట్లు వచ్చాయి. 47.8 శాతం ఓటింగ్‌తో ఆయన విజయం సాధించారు.
  • పార్వతీపురం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మొత్తం 1,37,154 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్‌సీ పీ అభ్యర్థి అలజంగి జోగారావుకు 75,304 ఓట్లు వచ్చాయి. 24,199 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు.
  • 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి చెందారు.
  • కురుపాం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో 1,38,723 ఓట్లు పోలవ్వగా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణికి 74,527 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 26,602 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై ఆమె ఘ న విజయం సాధించారు.
  • 2014 ఎన్నికల్లోనూ 55,435 ఓట్లు సాధించారు.19,083 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు.
  • 2014 ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి 55,337 ఓట్లు సాధించి విజయం సాధించారు. 1,620 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 18 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచారు.

స్థానిక సంస్థల్లోనూ సత్తా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. పార్వతీపురం నియోజకవర్గంలో 89 సర్పంచ్‌ స్థానాలుండగా.. వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు 76 చోట్ల గెలుపొందారు. ఎంపీటీసీలు 51కి 48, జెడ్పీటీసీలు మూడుకు మూడు స్థానాలు వైఎస్సార్‌సీపీవే.

పార్వతీపురం పట్టణంలో 30 వార్డులుండగా.. ఇందులో 24 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన కౌన్సిలర్లే. కురుపాం నియోజకవర్గంలో ఐదుకు ఐదు.. జెడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 137 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలుండగా.. వందకుపైగా మద్దతుదారులు గెలిచారు. పాలకొండ నియోజకవర్గంలోనూ జగన్‌ పట్ల ఉన్న విధేయతను అక్కడి ప్రజలు చూపించారు. పాలకొండలో 20కి 17 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌పీ నుంచి గెలిచారు.

జెడ్పీటీసీలు నాలుగుకు నాలుగూ విజయం దక్కించుకున్నారు. నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్‌ స్థానాలనూ మద్దతుదారులే దక్కించుకున్నారు. సాలూరు నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీలు, ఎంపీపీ లు వైఎస్సార్‌పీవే. మున్సిపల్‌ చైర్మన్‌నూ గెలుచుకుంది. సర్పంచ్, కౌన్సిలర్‌ స్థానాలనూ అత్యధికంగా కైవసం చేసుకుని ఆధిక్యతను చాటింది.  

జగన్‌ ఆశయాలకు అనుగుణంగా..
ముఖ్యమంత్రి జగన్‌ ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు గిరిజన ప్రజలతో నిత్యం మమేకమయ్యారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో కురుపాం, సాలూరు ఎమ్మెల్యేలు గిరిజన శాఖకు మంత్రులుగానూ వ్యవహరించారు. దీనివల్ల గిరిజనుల జీవన స్థితిగతులు మరింతగా మారాయి. సంక్షేమ పథకా లు ప్రతి గడపకూ వెళ్లాయి. గతంలో నిరక్షరాస్యులై న గిరిజనులకు తమ పేరిట ఏ పథకాలు వచ్చేవో కూడా తెలియదు. ఇప్పుడు నేరుగా వలంటీర్ల ద్వారానే లబ్ధి పొందగలుగుతున్నారు. ఊరిలో ఉన్న సచివాలయం నుంచి అన్నిరకాల ప్రభుత్వ సేవలు పొందుతున్నారు.

గిరి శిఖర గ్రామాలకు రహదారులనేకం మంజూరయ్యాయి. తాగునీరు అందుతోంది. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు చేతికందాయి. జగనన్న లేఅవుట్ల కింద ఇళ్లు, ఇంటి పట్టాలను పొందారు. పింఛన్లు పొందుతున్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టడంతో వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి. అందుకే.. ఏ ప్రాంతానికి వెళ్లినా జగన్‌ పట్ల తమ విధేయతను చాటుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. తామంతా మరోసారి అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు.

ఇవి చదవండి: అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్‌ ఉగాది శుభాకాంక్షలు   

Advertisement
Advertisement