అందుకే మంగళగిరిలో చేనేత మహిళకు టికెట్‌.. సీఎం జగన్‌ ట్వీట్‌ | Sakshi
Sakshi News home page

అందుకే మంగళగిరిలో చేనేత మహిళకు టికెట్‌.. సీఎం జగన్‌ ట్వీట్‌

Published Sat, Apr 13 2024 6:12 PM

Cm Jagan Tweet On Giving Ticket To Handloom Woman In Mangalagiri - Sakshi

సాక్షి, అమరావతి: మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘మరో వైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘కుప్పంలోనూ బీసీలు ఎక్కువగా ఉన్నా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించమని కోరుతున్నాను’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ‘‘చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు.

ఒక్కరికైనా సెంట్‌ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది’’ అని సీఎం జగన్‌ వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement