బాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

బాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్‌

Published Sun, Apr 28 2024 12:46 PM

CM YS Jagan Full Speech At Tadipatri Public Meeting

సాక్షి, తాడిపత్రి: టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తు పెట్టుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అలాగే, చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సీఎం జగన్‌ వ్యాఖ్యలు చేశారు.

కాగా, సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి సభలో మాట్లాడుతూ..
 

  • ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమేనా? 

  • తాడిపత్రి సిద్ధమేనా?. 

  • ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. 

  • ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత​్‌ను నిర్ణయించే ఎన్నికలు. 

  • జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారు. 

  • చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తుపెట్టుకోవాలి. 

  • చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. 

  • జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.

  • పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపే.

     

  • చంద్రబాబు సాధ్యం కానీ హామీలిస్తున్నారు.
  • నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాను. 
  • మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం. 
  • రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాం. 
  • ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. 
  • 58 నెలల కాలంలో 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.

 

  • పౌరసేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం​. 
  • వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. 
  • ప్రతీ గ్రామం, పట్టణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 
  • రైతు భరోసా కేంద్రం.. గ్రామాల్లోనే కనిపిస్తుంది. 
  • ఇంటి వద్దకే రేషన్‌ వస్తోంది. 
  • పెన్షన్లు నేరుగా మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. 
  • మీ బిడ్డ పాలనలో ఇంటి వద్దకే వైద్య సేవలు అందుతున్నాయి.

 

  • మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే మీ జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. 
  • నాడు-నేడుతో స్కూళ్ల రూపరేఖలను మార్చాం. 
  • టాప్‌ యూనివర్సిటీలతో మన డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేశాం. 
  • ప్రభుత్వ స్కూల్స్‌లో హక్కుగా ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు. 
  • మరో 10, 15 ఏళ్లలో ఇలాంటి పాలనే ఉంటే ప్రజల జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. 
  • గతంలో ఎప్పుడైనా మహిళా సాధికారత చూశారా?.
  • చట్టం చేసి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి నామినేటెడ్‌ పదవులు ఇచ్చాం. 
  • గతంలో ఎప్పుడైనా 31 లక్షల ఇళ్ల పట్టాలు చూశారా?.
  • రైతు భరోసా పథకాన్ని ఎప్పుడైనా చూశారా?.
  • 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. 
  • అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో సగం స్థానాలు కేటాయించాం. 
  • మోసాలు, కుట్రలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. 
  • చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్‌ అయినా ఉందా?. 
  • ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది.
  • రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. 
  • డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశాడు. 
  • ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. 

 

  • ఆడపిల్ల పుట్టగానే బ్యాంకుల్లో రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారా?. 
  • అర్హుందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్న చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా?. 
  • ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో మరో డ్రామా ఆడుతున్నారు
  • సంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి
  • 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి
  • తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి 
  • అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలి
  • హామీలు నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరతున్నాడు. 
  • ప్రజలకు మంచి చేశాకే మీ బిడ్డ మీ దీవెనలు కోరుతున్నాడు అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement
Advertisement