‘ఇండియా’లో పొత్తు చిచ్చు! | Sakshi
Sakshi News home page

‘ఇండియా’లో పొత్తు చిచ్చు!

Published Mon, Jan 1 2024 4:42 AM

Cong panel holds talks with state units on INDIA poll pacts for 2024 - Sakshi

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇతర విపక్షాలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటు కత్తిమీద సాములా మారుతోంది. సీట్ల పంపకాల విషయంలో సొంత పార్టీ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు ఒకవైపు, భాగస్వామ్య పక్షాలు అధిక సీట్లు డిమాండ్‌ చేస్తుండటం మరోవైపు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పశి్చమబెంగాల్, బిహార్, జమ్మూ కశీ్మర్లలో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్‌కు పరీక్ష పెడుతోంది...!

బెంగాల్లో బెంబేలు...
సీట్ల సర్దుబాటుపై ముందు సొంత పార్టీ నేతల నుంచి కాంగ్రెస్‌ అభిప్రాయ సేకరణ చేస్తోంది. దీనిపై ముకుల్‌ వాస్నిక్, అశోక్‌ గహ్లోత్, భూపేశ్‌ బఘెల్, సల్మాన్‌ ఖుర్షీద్, మోహన్‌ ప్రకాశ్‌లతో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ఏఐసీసీ బృందం రాష్ట్రాలవారీగా నేతలతో భేటీ అవుతోంది. ముఖ్యంగా 10 రాష్ట్రాల్లో కూటమి పక్షాలతో సీట్ల పంపకాలపై వారి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. పశి్చమబెంగాల్లో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్‌కు రెండే ఎంపీ సీట్లిస్తామని అధికార తృణముల్‌ కాంగ్రెస్‌ ఇప్పటికే తేల్చిచెప్పింది.

మిగతా 40 చోట్ల తామే పోటీ చేస్తామంటోంది. ఈ మాత్రానికి తృణముల్‌తో పొత్తెందుకని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రశి్నస్తున్నారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకొని ఎక్కువ సీట్లలో కాంగ్రెసే పోటీ చేయాలంటున్నారు. అసలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా రాష్ట్రంలో అన్ని సీట్లలోనూ తామే పోటీ చేయాలని తృణమూల్‌ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌దీ ఇదే అభిప్రాయమని కూడా
చెబుతున్నారు!     

బిహార్లో పీటముడి!
బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో 2019లో ఆర్జేడీ సహా చిన్నా చితక పారీ్టలతో కాంగ్రెస్‌ జత కట్టి పోటీ చేసింది. ఈసారి జేడీ(యూ) కూడా జత కూడుతుండటంతో సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. 2019లో ఆర్జేడీ 20, కాంగ్రెస్‌ 9, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 5, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హమ్‌), వీఐపీ చెరో మూడు చోట్ల పోటీ చేశాయి. కాంగ్రెస్‌ కేవలం ఒక సీటు గెలవగా, అప్పట్లో బీజేపీతో పొత్తున్న జేడీ(యూ) 16 సీట్లు నెగ్గింది! బీజేపీ 17, లోక్‌ జనశక్తి పార్టీ 6 సీట్లు గెలిచాయి. ఈసారి కాంగ్రెస్‌కు భాగంగా కాంగ్రెస్‌కు 6 సీట్లే ఇస్తామని జేడీ(యూ) చీఫ్‌ నితీశ్‌కుమార్‌ అంటుండటం పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు! జేడీ(యూ) 23, ఆర్‌జేడీ 9 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి.

మహారాష్ట్రలో ఐదు సీట్లే!
48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలోనూ శివసేన (ఉధ్దవ్‌) పార్టీ ఏకంగా 23, మరో మిత్రపక్షం ఎన్సీపీ 20 సీట్లు కోరుతున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్‌కు దక్కేవి ఐదే సీట్లు! ఇది ఆ మూడు పారీ్టలతో కూడిన ఎంవీఏ కూటమిలో చిచ్చు రాజేస్తోంది. ఇక ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీతో పొత్తు మాటెత్తితేనే స్థానిక కాంగ్రెస్‌ భగ్గుమంటున్నారు.

రాష్ట్ర స్థాయిలో ఆప్‌తో పోరాడుతున్న తమకు పొత్తుల పేరిట అన్యాయం చేయొద్దంటున్నారు. కశీ్మర్‌లో కూడా మెజార్టీ సీట్లలో కాంగ్రెసే పోటీ చేయాలని, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు ఎక్కువ సీట్లు వద్దని అక్కడి నేతలంటున్నారు. జనవరి మూడో వారానికల్లా సీట్ల సర్దుబాటును పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ను ఈ సమస్యలు చీకాకు పరుస్తున్నాయి.

Advertisement
Advertisement